సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ ధ్వజం
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నోరెందుకు మెదపరని సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణన్ ప్రశ్నించారు. పక్కావ్యూహంతో అమాయక గిరిజనులు 20 మందిని అన్యాయంగా కాల్చి చంపారని దుయ్యబట్టారు. ఈ సంఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఎం 21వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన రామకృష్ణన్ సాక్షి ప్రతినిధితో శుక్రవారం మాట్లాడారు. ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బొజ్జల ఓ తమిళ టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ను తప్పుపట్టారు.
ఎన్‌కౌంటర్‌పై బాబు నోరెందుకు విప్పరు?
Published Sat, Apr 18 2015 1:11 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement