ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 70స్థానాలున్న అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి 24 గంటలయిన ఎన్నికల కమీషన్ మాత్రం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించలేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి కానీ బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయని.. అమిత్ షా చెప్పినట్లు 45 సీట్లకు తక్కువ కాకుండా తామే గద్దెనెక్కుతామని ధీమా వ్యక్తం చేస్తుంది.