parlimentary standing commitee
-
పార్లమెంటరీ కమిటీ ముందుకు ఎఫ్బీ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికపై కొన్ని సిద్ధాంతాలు, భావజాలం పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఫేస్బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్ బుధవారం పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. భావప్రకటన స్వేచ్ఛను సోషల్‌మీడియా దిగ్గజం హరిస్తోందనే విమర్శల మధ్య సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట అజిత్ మోహన్ హాజరయ్యారు. పౌరుల హక్కుల పరిరక్షణ, ఆన్లైన్..సోషల్‌మీడియా వేదికల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం, డిజిటల్ వేదికపై మహిళల భద్రత వంటి విషయాలపై చర్చకు ఎఫ్బీ అధికారిని సమావేశానికి పిలిచినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఫేస్బుక్ ఇండియాలో సీనియర్ సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర కేబినెట్ మంత్రులను దూషించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన మరుసటి రోజు ఎఫ్బీ అధికారి పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఫేస్బుక్ వేదికపై బీజేపీ నేతలను విద్వేష ప్రసంగాలు, సందేశాలు పోస్ట్ చేసేందుకు సోషల్‌మీడియా దిగ్గజం అనుమతించిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంతో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. వాల్‌స్ట్రీట్ కథనంతో ఫేస్బుక్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. చదవండి : ఫేస్‌బుక్‌కు తృణమూల్ కాంగ్రెస్ లేఖ -
పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆర్బీఐ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు, బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్పీఏ)పై వివరణ ఇచ్చేందుకు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ మంగళవారం ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన పదిరోజుల్లో లిఖితపూర్వకంగా బదులిస్తారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులతో సంప్రదింపుల సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ముడిచమురు ధరలు, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి చర్చించినట్టు సమాచారం. నోట్ల రద్దు, బ్యాంకుల్లో ఎన్పీఏల పరిస్థితి పర్యవసానాలపై సభ్యులు ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో 31 మంది సభ్యులున్న ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కాగా ఆర్బీఐ నిర్వహణ వ్యవహరాల్లో ఇటీవల కేంద్ర జోక్యం పెరిగిందన్న విమర్శల నేపథ్యంలో సెక్షన్ 7ను ప్రయోగించారనే ప్రచారంపై పార్లమెంటరీ కమిటీ ఊర్జిత్ పటేల్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. -
ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్‌కు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌ను మంగళవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది. వీరప్ప మొయిలీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన ఊర్జిత్ పటేల్‌ను సభ్యులు నీరవ్ మోదీ-పీఎన్బీ స్కామ్‌పై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నకిలీ పత్రాలతో రూ 13,000 కోట్ల రుణాలు పొందిన నీరవ్ మోదీ ఉదంతం బ్యాంకింగ్ వ్యవస్థలో పెను ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణాన్ని దీర్ఘకాలంగా ఎందుకు గుర్తించలేకపోయారని స్టాండింగ్ కమిటీ సభ్యులు ఊర్జిత్ పటేల్‌ను ప్రశ్నించారు. ఈ భేటీలో బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)పైనా ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. బ్యాంకుల్లో మొండిబకాయిల వసూలు ప్రక్రియ ప్రారంభమైందని పటేల్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా వివరించారు. గతంలో మే 17న కూడా ఆర్బీఐ గవర్నర్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. -
షెడ్యూల్ ప్రకారం వర్సిటీల నిర్మాణాలు పూర్తి చేయాలి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తలపెట్టిన వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల నిర్మాణాన్ని వేగిరపరిచేందుకు వ్యవసాయం అంశంపై ఏర్పాటైన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేసింది. ఆయా ప్రభుత్వాలతో చర్చించి ఓ షెడ్యూల్‌ను ఖరారు చే యాలని, ఆ మేరకు పనుల్ని పూర్తిచేయాలని సూచించింది. ఇందువల్ల నిర్మాణాలకు అనుగుణంగా కేంద్రం నిధులు విడుదల చేయొచ్చని తెలిపింది. కాగా 31 మంది ఎంపీలతో కూడిన ఈ కమిటీ గత నెల 27న లోక్‌సభకు ఓ నివేదిక సమర్పించింది. 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా తెలంగాణలో ఉద్యానవన, ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్ని నిర్మించాల్సి ఉంది. ఈ విభాగం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ వర్సిటీని ప్రతిపాదించింది. దీంతో ఏపీ ప్రభుత్వం దానిని గుంటూరు జిల్లా లాం గ్రామంలో నిర్మించాలని సూచించింది. ఈ క్రమంలో కేంద్రం 2014-15లో రూ. 10 కోట్ల మేర నిధుల్ని విడుదల చేసింది. ఇక తెలంగాణలో రాజేంద్రన గర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో కొండా లక్ష్మణ్ పేరిట ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటవ నుంది. ఇందుకు కేంద్రం 2014-15లో రూ. 10 కోట్లు విడుదల చేసింది.