షెడ్యూల్ ప్రకారం వర్సిటీల నిర్మాణాలు పూర్తి చేయాలి | versities constructions should be compleated as per shedules | Sakshi
Sakshi News home page

షెడ్యూల్ ప్రకారం వర్సిటీల నిర్మాణాలు పూర్తి చేయాలి

Published Tue, May 5 2015 5:39 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

versities constructions should be compleated as per shedules

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తలపెట్టిన వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల నిర్మాణాన్ని వేగిరపరిచేందుకు వ్యవసాయం అంశంపై ఏర్పాటైన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేసింది. ఆయా ప్రభుత్వాలతో చర్చించి ఓ షెడ్యూల్‌ను ఖరారు చే యాలని, ఆ మేరకు పనుల్ని పూర్తిచేయాలని సూచించింది. ఇందువల్ల నిర్మాణాలకు అనుగుణంగా కేంద్రం నిధులు విడుదల చేయొచ్చని తెలిపింది. కాగా 31 మంది ఎంపీలతో కూడిన ఈ కమిటీ గత నెల 27న లోక్‌సభకు ఓ నివేదిక సమర్పించింది.

12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా తెలంగాణలో ఉద్యానవన, ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్ని నిర్మించాల్సి ఉంది. ఈ విభాగం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ వర్సిటీని ప్రతిపాదించింది. దీంతో ఏపీ ప్రభుత్వం దానిని గుంటూరు జిల్లా లాం గ్రామంలో నిర్మించాలని సూచించింది. ఈ క్రమంలో కేంద్రం 2014-15లో రూ. 10 కోట్ల మేర నిధుల్ని విడుదల చేసింది. ఇక తెలంగాణలో రాజేంద్రన గర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో కొండా లక్ష్మణ్ పేరిట ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటవ నుంది. ఇందుకు కేంద్రం 2014-15లో రూ. 10 కోట్లు విడుదల చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement