న్యూఢిల్లీ: బ్యాంకింగ్ కుంభకోణాలపై వివరణ ఇచ్చేందుకు మే 17న తమ ముందు హాజరు కావాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జీత్ పటేల్‌ను పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో సుమారు రూ.13 వేల కోట్ల స్కాంతోపాటు గత కొన్ని నెలలుగా పలు ఇతర బ్యాంకుల్లో కుంభకోణాలు వెలుగుచూడడం తెల్సిందే. దీంతో సీనియర్ కాంగ్రెస్ నేత మొయిలీ నేతృత్వంలోని ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది.
ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ ఎంపీ నిశికాంత్‌తో సహా పలువురు సభ్యులు ఆర్బీఐ రుణాల ఎగవేతను నియంత్రించ లేకపోయిందని అభిప్రాయపడినట్టు తెలిసింది. బ్యాంకులకు సంబంధించిన పలు అంశాలపై 3 వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ అధికారులను కమిటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గవర్నర్‌ను హాజరు కావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment