
రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్
ముంబై: బ్యాంకింగ్ మొండి బాకీల సమస్యపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాసిన పుస్తకం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దీన్ని ప్రచురించిన హార్పర్‌కోలిన్స్ ఇండియా ఈ విషయం వెల్లడించింది. ‘ఓవర్‌డ్రాఫ్ట్– భారత్‌లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం’ పేరిట పటేల్ ఈ పుస్తకం రాశారు. ఎన్‌పీఏలు పేరుకుపోవడానికి కారణాలు, పరిస్థితి చక్కదిద్దడానికి ఆర్‌బీఐ గవర్నర్ హోదాలో పటేల్ చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆయన పదవీకాలంలోనే పెద్ద నోట్ల రద్దు అమలైంది. అయితే, కొన్ని అంశాలపై ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో 2018 డిసెంబర్‌లో ఆయన అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. కానీ, ఇటీవలే ఎన్‌ఐపీఎఫ్‌పీ చైర్మన్‌గా గత నెలలో నియమితులయ్యారు.