
ఉర్జిత్ పటేల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ మాట దేవుడెరుగు, రుణాల రీషెడ్యూల్ సమస్య కూడా మళ్లీ మొదటికొచ్చింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ మాట దేవుడెరుగు, రుణాల రీషెడ్యూల్ సమస్య కూడా మళ్లీ మొదటికొచ్చింది. రుణాలు రీషెడ్యూల్ చేస్తామని ఆర్బిఐ ఎటువంటి హామీ ఇవ్వలేదని ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ ఆర్. ఉర్జిత్ పటేల్ గాంధీ స్పష్టం చేశారు. రుణాల రీషెడ్యూల్ విధివిధానాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రీషెడ్యూల్పై పూర్తి వివరాలతో రమ్మని మాత్రమే చెప్పినట్లు తెలిపారు. రెండు ప్రభుత్వాలకు ఇదే చెప్పినట్లు ఆయన తెలిపారు.
జాతీయ విపత్తుల్లాంటి సందర్భాలలో మాత్రమే రుణాల రీషెడ్యూల్‌లో బ్యాంకులకు నియమనిబంధనలుంటాయని చెప్పారు. రైతుల రుణాల రీషెడ్యూల్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బిసి) ఆమోదంతో జరగాలన్నారు. రుణాల రీషెడ్యూల్ కంటే ఇంకేదైనా చేయాలన్నదానిపై ఇరు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు గాంధీ తెలిపారు.