
జైట్లీతో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ
వచ్చేవారం పాలసీ సమీక్ష నేపథ్యం
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ శుక్రవారం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో జరిగిన వీరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
దేశ, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై వీరిరువురి మధ్యా సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ట స్థాయిలకు తగ్గడం, పారిశ్రామిక ఉత్పత్తి భారీ పతనం వంటి అంశాల నేపథ్యంలో రెపో రేటును (ప్రస్తుతం 6.25 శాతం) తగ్గించాలని ఇటు పారిశ్రామిక ప్రతినిధులతో పాటు, ప్రభుత్వ వర్గాల నుంచి కూడా డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే.