ఆత్మహత్యాయత్నం చేసిన ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులు
పులివెందుల: తమను ఉద్యోగం నుంచి తొలగిస్తే పురుగుల మందు తాగి చనిపోతామంటూ ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఇద్దరు చిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో నియమితులై పులివెందుల మార్కెట్‌యార్డులో పనిచేస్తున్న నలుగురిని, సింహాద్రిపురం మార్కెట్‌యార్డులో ముగ్గురిని తొలగించేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్న ఆందోళనతో పులివెందుల మార్కెట్‌యార్డులో అటెండర్‌గా పనిచేస్తున్న అజార్, సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం స్థానిక మార్కెట్‌యార్డులో పురుగుమందు డబ్బాలు, పెట్రోలు తీసుకెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన మీడియాతో అజార్, మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతల ఆదేశాలతో.. సరైన కారణాలు చూపకుండా ఇప్పటికే అధికారులు తమకు రెండు షోకాజ్ నోటీసులు అందజేశారన్నారు.
ఆఫీసులో రిజిష్టర్‌ను దాచిపెట్టి తాము సంతకాలు పెట్టేందుకు వీలులేకుండా చేస్తున్నారని చెప్పారు. తమకు జీవనాధారం అయిన ఈ ఉద్యోగాలను తీసేస్తే.. ఆత్మహత్యలే శరణ్యమని విలపించారు. దీంతో మార్కెట్‌యార్డు సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ‘మీరు కోర్టును ఆశ్రయించారు కాబట్టి.. కోర్టు ద్వారా వచ్చే నిర్ణయాన్ని బట్టి తాము చర్యలు తీసుకుంటాం’ అని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. దీనిపై సెక్రటరీని వివరణ కోరగా తాము ఎవర్ని విధుల నుంచి తొలగించలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment