
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో 100 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19, 20వ తేదీల్లో ఎలాంటి ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా సెలవు తీసుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేశారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలో పనిచేస్తున్న వారందరూ ఆ రెండు రోజులు ఎందుకు విధులకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాల్సిందిగా సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దసరాను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17, 18 తేదీల్లో సెలవులు ప్రకటించింది.
ఆ తర్వాత 19, 20 తేదీల్లో శుక్ర, శనివారాలు కావడం, తదుపరి ఆదివారం రావడంతో అనేక మంది ఆ రెండ్రోజులు కూడా విధులకు డుమ్మా కొట్టారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలు, స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్నాయి. కంటి వెలుగు కార్యక్రమం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి సమాచారం, అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోవడంపై శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందుకున్న వారి నుంచి సమాధానం వచ్చాక తదుపరి చర్య తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment