మంత్రి గంటా శ్రీనివాస రావు సేవలో తరించిన ప్రభుత్వ అధికారులకు ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు.
తిరుపతి: మంత్రి గంటా శ్రీనివాస రావు సేవలో తరించిన ప్రభుత్వ అధికారులకు ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. మంత్రిని చూసేసరికి సర్వశిక్ష అభియాన్ అధికారులకు ఏమీ గుర్తుకు రాలేదు. ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేశారు. ఎన్నికల సంఘం చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది. వారికి నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన సర్వశిక్ష అభియాన్ పీడీ లక్ష్మి, ఇన్చార్జి డీఈఓ శ్యామ్యూల్లకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.