ఎయిర్‌పోర్టులో క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్‌! | Cab driver kidnapped in airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్‌!

Published Sun, Jun 18 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

Cab driver kidnapped in airport

ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
 
శంషాబాద్‌(రాజేంద్రనగర్‌): అనుమతి లేకుండా విమానాశ్రయంలో ప్రయాణికులను తాము ఎక్కించుకుంటే.. ఈ సమాచారాన్ని ట్రాఫిక్‌ పోలీసులకు అందిస్తున్నాడని ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ను ఐదుగురు ప్రైవేట్‌ డ్రైవర్లు కిడ్నాప్‌ చేసినట్లుగా కలకలం రేగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ గగన్‌పహాడ్‌ బస్తీకి చెందిన జావెద్‌ అలీ (30) విమానాశ్రయంలో స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన కారును నడిపిస్తున్నాడు.

అనుమతులు లేకుండా విమానాశ్రయంలో ప్రయాణికులను ఎక్కించుకుంటున్న విషయమై ట్రాఫిక్‌ పోలీసులకు చెబుతున్నాడనే అనుమానంతో బేగంపేట, షాహిన్‌నగర్‌ బస్తీలకు చెందిన ఐదుగురు ప్రైవేటు ట్రావెల్స్‌ డ్రైవర్లు ఇబ్రహీం(28), తౌఫిక్‌(30), అఫ్రోజ్‌(28), అల్తాఫ్‌(29), ఇబ్రహీం(30) గురువారం మధ్యాహ్నం గోకార్టింగ్‌ రేస్‌ వద్ద జావెద్‌ అలీని కలిశారు. ట్రాఫిక్‌ పోలీసులకు ఎందుకు సమాచారం అందిస్తున్నావని అతనితో వాగ్వాదానికి దిగారు. షాహిన్‌ నగర్‌కు వెళ్లి మాట్లాడుకుందామని తీసుకెళ్లారు. అక్కడ తనని ఓ ఇంట్లో నిర్బంధించారని, దీంతో తాను తప్పించుకుని వచ్చానని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు శనివారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాము అతడితో చర్చించామే తప్ప, కిడ్నాప్‌నకు పాల్పడలేదని డ్రైవర్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement