Ajay Reddy
-
తొలిదశలో 66 స్కిల్ హబ్స్ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంలో భాగంగా కీలక అడుగు ముందుకు పడింది. ఇంటర్మీడియట్, అంతకంటే తక్కువ చదువు ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి వంతున ఏర్పాటు చేస్తున్న 175 స్కిల్ హబ్స్, అదనంగా మరో రెండు హబ్స్ (మొత్తం 177)లో తొలిదశ కింద 66 స్కిల్ హబ్స్ గురువారం ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా డోన్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)ఎండీ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి రెండు స్కిల్ యూనివర్సిటీలు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా 66 స్కిల్ హబ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలోనే మిగిలిన 111 హబ్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా కోర్సులను తీర్చిదిద్దినట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయా సంస్థలే ఉపాధి కల్పిస్తాయన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (స్కిల్ డెవలప్మెంట్) చల్లా మధుసూదన్‌రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ కాలేజీలో ఈ స్కిల్ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
బిడ్డ పుట్టిన మరుసటి రోజే తండ్రి మరణం
ప్రకాశం,ముండ్లమూరు: మండలంలోని రెడ్డినగర్‌కు సమీపంలో రజానగర్ మేజర్‌లో ప్రమాదవశాత్తు కాలుజారి పడి పిట్టం అజయ్‌రెడ్డి (23) అనే వ్యక్తి మృతి చెందాడు. అజయ్‌రెడ్డిది దర్శి మండలం అబ్బాయిపాలెం. భార్య శివమణి దర్శిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రంతా అజయ్‌రెడ్డి భార్య వద్దే ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. గురువారం ఉదయం స్నానం చేసేందుకు రజానగరం మేజర్ పరిధిలో రెడ్డినగర్ వద్దకు ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాలువలో మెట్లపై కూర్చొని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడ్డాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కాలువలో కొట్టుకు పోతుండగా ఇద్దరు స్నేహితులూ పెద్దగా కేకలు వేశారు. చుట్టు పక్కల ఉన్న వారు అక్కడకు చేరుకున్నారు. ఇంతలోనే దగ్గరలోని తూములోకి జారుకోవడంతో ఊపిరాడక అజయ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం 11 గంటల వరకు భార్య పక్కనే ఉండి బిడ్డను చూసి మురిసిపోయాడు. అంతలోనే కాలువకు వెళ్లి మృతి చెందాడని వార్త తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంతలో అక్కడకు చేరుకున్న అజయ్‌రెడ్డి తల్లిదండ్రులు ప్రభావతి, సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపించారు. మృతుడు తమ్ముడు రాజశేఖరరెడ్డి దర్శిలో డిగ్రీ చదువుతున్నాడు. వీఆర్వో మందా పెద్దన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.రామకృష్ణ తెలిపారు. -
ఎయిర్ హోస్టెస్‌కు వేధింపులు
శంషాబాద్: ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్ వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అజయ్ రెడ్డిగా గుర్తించారు. అజయ్ రెడ్డిపై ఎయిర్‌హోస్టెస్, విమాన పైలట్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన శంషాబాద్‌లోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అజయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజయ్‌ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. -
ప్రమాదం మిగిల్చిన విషాదం
=మిత్రుడి ఇంట్లో విందు ఉందని ఒకరు.. =కంప్యూటర్ బాగుచేయడానికి వెళుతున్నానని మరొకరు =ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగిరాని లోకాలకు.. =మత్యువులోనూ వీడని స్నేహం ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : మిత్రుడి ఇంట్లో విందు ఉందని వెళ్లి ఒకరు... కంప్యూటర్ బాగు చేసి వస్తానని చెప్పి మరొకరు ఇంటి బయటికి వెళ్లి తిరిగిరాని లోకానికి చేరుకున్నారు. హన్మకొండ సుబేదారిలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మిత్రులు దుర్మరణం చెందారు. దీంతో మతులు అజయ్‌రెడ్డి, ప్రేంచందర్ కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన చిమ్ముల శ్రీనివాస్‌రెడ్డి, పద్మజ దంపతులు హన్మకొండలోని ఎకై సజ్ కాలనీలో స్థిరపడ్డారు. వారికి కుమారుడు అజయ్‌రెడ్డి(26) బీకాం పూర్తిచేసి రెండేళ్ల క్రితం ఆస్ట్రియూ దేశానికి వెళ్లాచ్చాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. దీంతో కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఉంటూ వ్యాపారం మొదలు పెట్టే పనిలో నిమగ్నమయ్యాడు. దసరా పండుగకు కుటుంబ సభ్యులతో గడిపేందుకు హన్మకొండకు వచ్చాడు. గురువారం హైదరాబాద్ వెళ్లాలని భావించినప్పటికీ అదేరోజు సాయంత్రం మిత్రుడి ఎంగేజ్మెంట్ ఉండడంతో ఆగిపోయూడు. సాయంత్రం 5 గంటలకు మిత్రుడి ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉందని వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆయన హన్మకొండ భవానీనగర్‌కు చెందిన పిండి వెంకటేశ్వర్లు, ప్రభావతి దంపతుల కుమారుడు ప్రేంచందర్(26)ను కలుసుకున్నాడు. బాల్యస్నేహితులైన వీరిద్దరూ తరచూ కలుస్తుండేవారు. హార్డ్‌వేర్ నేర్చుకున్న ప్రేంచంద్ గురువారం రాత్రి 7.15 గంటలకు కంప్యూటర్ బాగుచేయడానికని ఇంట్లో నుంచి బయల్దేరాడు. రాత్రి బయట కలుసుకున్న వీరిద్దరు హన్మకొండలో హీరో గ్లామర్ వాహనంపై వెళుతుండగా సుబేదారిలో గుర్తుతెలియని వాహనం ఢీకొం ది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. వారి పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతోపాటు మతదేహాలు చిధ్రమయ్యూయి. సమాచారం అందుకున్న కాజీపేట ట్రాఫిక్ సీఐ జయరాం, ఎసై స విజయలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ చేసి, అదేరాత్రి మతదేహాలను పోస్టుమార్టరం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మతుడు అజయ్‌రెడ్డికి తమ్ముడు ఉండ గా, ప్రేంచందర్‌కు అక్క, తమ్ముడు ఉన్నారు. ప్రేంచందర్ తండ్రి వెంకటేశ్వర్లు ఆర్టీసీలో మెకానిక్‌గా ఉద్యోగం చేసి రిటైర్డ్ కాగా, అజయ్ తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ధర్మసాగర్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మిన్నంటిన రోదనలు.. రాత్రి కంప్యూటర్ బాగుచేసేందుకు వెళుతున్నట్లు చెప్పిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని ప్రేంచందర్ తల్లిదండ్రులు బోరున విలపించారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రేంచందర్ మిత్రుడు ఒకరు ఫోన్ చేసి ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పేవరకు తమకు యాక్సిడెంట్ తెలియదని విలపించారు. హైదరాబాద్ వెళ్లినా బతికేటోడు.. హైదరాబాద్ వెళతానని చెప్పిన తమ కుమారుడు ప్రయూణం వాయిదా వేసుకుని స్నేహితుడి ఎంగేజ్మెంట్ వెళ్లాడని, హైదరాబాద్‌కు వెళ్లిన బతికేటోడని అజయ్‌రెడ్డి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి రోదించారు. తొందరగానే వస్తానని వెళ్లి శవమై వచ్చాడని వారు కన్నీరుమున్నీరయ్యారు. అజయ్ మిత్రులు రోది స్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.