ప్రమాదం మిగిల్చిన విషాదం | One friend had dinner at home .. | Sakshi
Sakshi News home page

ప్రమాదం మిగిల్చిన విషాదం

Published Sat, Oct 19 2013 2:23 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One friend had dinner at home ..

 

=మిత్రుడి ఇంట్లో విందు ఉందని ఒకరు..
 =కంప్యూటర్ బాగుచేయడానికి వెళుతున్నానని మరొకరు
 =ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
 =మత్యువులోనూ వీడని స్నేహం

 
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ :  మిత్రుడి ఇంట్లో విందు ఉందని వెళ్లి ఒకరు... కంప్యూటర్ బాగు చేసి వస్తానని చెప్పి మరొకరు ఇంటి బయటికి వెళ్లి తిరిగిరాని లోకానికి చేరుకున్నారు. హన్మకొండ సుబేదారిలో గురువారం అర్ధరాత్రి  జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మిత్రులు దుర్మరణం చెందారు. దీంతో మతులు అజయ్‌రెడ్డి, ప్రేంచందర్ కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన చిమ్ముల శ్రీనివాస్‌రెడ్డి, పద్మజ దంపతులు హన్మకొండలోని ఎకై సజ్ కాలనీలో స్థిరపడ్డారు.

వారికి కుమారుడు అజయ్‌రెడ్డి(26) బీకాం పూర్తిచేసి రెండేళ్ల క్రితం ఆస్ట్రియూ దేశానికి వెళ్లాచ్చాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. దీంతో కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఉంటూ వ్యాపారం మొదలు పెట్టే పనిలో నిమగ్నమయ్యాడు. దసరా పండుగకు కుటుంబ సభ్యులతో గడిపేందుకు హన్మకొండకు వచ్చాడు. గురువారం హైదరాబాద్ వెళ్లాలని భావించినప్పటికీ అదేరోజు సాయంత్రం మిత్రుడి ఎంగేజ్‌మెంట్ ఉండడంతో ఆగిపోయూడు. సాయంత్రం 5 గంటలకు మిత్రుడి ఇంట్లో ఎంగేజ్‌మెంట్ ఉందని వెళ్లాడు.
 
ఈ క్రమంలోనే ఆయన హన్మకొండ భవానీనగర్‌కు చెందిన పిండి వెంకటేశ్వర్లు, ప్రభావతి దంపతుల కుమారుడు ప్రేంచందర్(26)ను కలుసుకున్నాడు. బాల్యస్నేహితులైన వీరిద్దరూ తరచూ కలుస్తుండేవారు. హార్డ్‌వేర్ నేర్చుకున్న ప్రేంచంద్ గురువారం రాత్రి 7.15 గంటలకు కంప్యూటర్ బాగుచేయడానికని ఇంట్లో నుంచి బయల్దేరాడు. రాత్రి బయట కలుసుకున్న వీరిద్దరు హన్మకొండలో హీరో గ్లామర్ వాహనంపై వెళుతుండగా సుబేదారిలో గుర్తుతెలియని వాహనం ఢీకొం ది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. వారి పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతోపాటు మతదేహాలు చిధ్రమయ్యూయి.

సమాచారం అందుకున్న కాజీపేట ట్రాఫిక్ సీఐ జయరాం, ఎసై స విజయలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ చేసి, అదేరాత్రి మతదేహాలను పోస్టుమార్టరం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మతుడు అజయ్‌రెడ్డికి తమ్ముడు ఉండ గా, ప్రేంచందర్‌కు అక్క, తమ్ముడు ఉన్నారు. ప్రేంచందర్ తండ్రి  వెంకటేశ్వర్లు ఆర్టీసీలో మెకానిక్‌గా ఉద్యోగం చేసి రిటైర్డ్ కాగా, అజయ్ తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ధర్మసాగర్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
 
 మిన్నంటిన రోదనలు..

 రాత్రి కంప్యూటర్ బాగుచేసేందుకు వెళుతున్నట్లు చెప్పిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని ప్రేంచందర్ తల్లిదండ్రులు బోరున విలపించారు.  శుక్రవారం తెల్లవారుజామున ప్రేంచందర్ మిత్రుడు ఒకరు ఫోన్ చేసి ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పేవరకు తమకు యాక్సిడెంట్ తెలియదని విలపించారు.

 హైదరాబాద్ వెళ్లినా బతికేటోడు..

 హైదరాబాద్ వెళతానని చెప్పిన తమ కుమారుడు ప్రయూణం వాయిదా వేసుకుని స్నేహితుడి ఎంగేజ్‌మెంట్ వెళ్లాడని, హైదరాబాద్‌కు వెళ్లిన బతికేటోడని అజయ్‌రెడ్డి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి రోదించారు. తొందరగానే వస్తానని వెళ్లి శవమై వచ్చాడని వారు కన్నీరుమున్నీరయ్యారు.  అజయ్ మిత్రులు రోది స్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement