మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్ | The arrest of the man who harassed woman | Sakshi
Sakshi News home page

మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్

Published Fri, Sep 16 2016 8:00 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

The arrest of the man who harassed woman

నృత్యం చేస్తున్న మహిళను వేదిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి షీటీం పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం... సఫీల్‌గూడ మిని ట్యాంక్‌బండ్ వద్ద వినాయక నిమజ్జనం జరుగుతున్న సమయంలో మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేసే మల్కాజిగిరికి చెందిన ఆర్. అనిల్ (32) నృత్యాలు చేస్తున్న మిహ ళలను వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు అక్కడే విధులు నిర్వహిస్తున్న షీటీం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షీటీం పోలీసులు అనిల్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement