మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన మరో ఘటన ఎల్బీనగర్‌లో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన మరో ఘటన ఎల్బీనగర్‌లో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సమయంలో సోమేష్ అనే వ్యక్తి నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న రాజేష్, అనిల్‌తోపాటు సోమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సోమేష్‌ను కామినేని ఆస్పత్రికి, మిగతా ఇద్దరిని నక్షత్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని బాధితుడు అంటున్నాడు.