సాక్షి, హైదరాబాద్: హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని తెలిపింది. పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా పీవోపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని గతేడాది హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. పీవోపీ విగ్రహాలు ప్రత్యేక కృత్తిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. అయితే గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని హైకోర్టు తెలిపింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలన్న తయారీదారుల పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని వినాయక విగ్రహ తయారీదారులు తమ పిటిషన్‌లో కోరారు. గతేడాది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ తెలిపారు. అయితే ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25కి వాయిదా వేసింది.
చదవండి: కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం
Comments
Please login to add a commentAdd a comment