
సాక్షి, హైదరాబాద్: నిమజ్జనంపై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ముఖ్యఘట్టం అన్నారు. అన్ని శాఖలను కలుపుకుని కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం సాగిందని తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రేటర్‌తో కలుపుకుని 50 శివారు ప్రాంతాల్లో రేపు 50 వేల వినాయకుల నిమజ్జనం జరుగుతుందన్నారు. నిమజ్జనం జరిగే అన్ని చోట్లా సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందన్నారు.
మూడు కమిషనరేట్లు, డీజీపీ ఆఫీసులతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామన్నారు. గణేష్ మండపానికి చెందిన వారితో కలిసి నిమజ్జనం కొనసాగిస్తామన్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు తరలి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ అవసరం కోసం ఆయా ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించేందుకు ప్లాన్ చేశామన్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 100 సీసీటీవీలను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలపాటు బ్రేక్ లేకుండా నిమజ్జనం కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment