నిమజ్జనంలో విషాదం: ముగ్గురు మృతి | three died due to current shock during ganesh Immersion | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో విషాదం: ముగ్గురు మృతి

Published Mon, Aug 28 2017 3:44 PM | Last Updated on Tue, Sep 12 2017 1:12 AM

three died  due to current shock during ganesh Immersion

కోల్‌కతా: గణేష్‌ విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కరెంట్‌షాక్‌తో ముగ్గురు చనిపోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ విషాదం చోటు చేసుకుంది. హుగ్లీ నదిలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తుండగా బాజా కడమ్‌తాల ఘాట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
 
కరెంటు తీగ తెగి విగ్రహంపై పడటంతో దానిని ఆనుకుని ఉన్న నిర్వాహకులు బిమల్‌ సహాని(37), జితేంద్ర సహాని(28), బితాష్‌ మండల్‌(30) అక్కడికక్కడే షాక్‌తో చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. విగ్రహం ఎత్తు 18 అడుగులకు మించి ఉండటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement