గణేష్ శోభాయాత్రలో అపశ్రుతి
Published Sat, Sep 17 2016 12:13 PM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM
-యువకుడి మృతి
జిన్నారం: వినాయక శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదలలో శనివారం ఉదయం బొజ్జ గణపతిని ఊరేగిస్తున్న వాహనానికి విద్యుత్ తీగలు తాకాయి. దీంతో ఆ సమయంలో వాహనం పై ఉన్న కిషోర్(19) కరెంట్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కిషోర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement