హైదరాబాద్: సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గణేశ్ నిమజ్జనం వేడుకల్లో గురువారం అపశృతి చోటు చేసుకుంది. చంపాపేటలోని స్థానిక రెడ్డి కాలనీ సమీపంలో గణేశ్డిని ట్రాక్టర్‌లో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో ఇద్దరు వ్యక్తులకు కరెంటు వైర్లు తగిలి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అనే న్యాయవాదితో పాటు సరూర్‌నగర్‌కు చెందిన సందీప్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.