
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
1.సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్స్, ఇంజిన్‌బౌలి, నాగుల్‌చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్‌కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్,దారుల్‌షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్
2.ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్
3.వెస్ట్ జోన్: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్
4.సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చౌరస్తా, కంట్రోల్‌రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్‘వై’ జంక్షన్, బీఆర్‌కే భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్కు, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు
5.నార్త్‌జోన్: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి.
మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్‌నగర్ కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్ ఫుడ్ వరల్డ్, సత్యం థియేటర్ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్‌పేట మీదుగా పంపిస్తారు.
ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు
ఆదివారం రాత్రి 10.30 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
550 ప్రత్యేక బస్సులు
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకునేందుకు 550 బస్సులను అదనంగా తిప్పనున్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, కాచిగూడ, కూకట్‌పల్లి, లింగంపల్లి, బాలానగర్, జీడిమెట్ల, మెహదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్ వరకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి.
#HYDTPinfo Please go through the maps of Main procession and Parking Places around Hussain Sagar Lake. Pl. Plan ur journey by avoiding the routes shown in the Map. Separate parking places around the Hussain Sagar Lake were arranged for the convenience of viewers. @AddlCPTrHyd pic.twitter.com/lBvND599tZ
— Hyderabad Traffic Police (@HYDTP) 21 September 2018
Comments
Please login to add a commentAdd a comment