Traffic diversion
-
విజయవాడలో రేపు ట్రాఫిక్ మళ్లింపు
విజయవాడ స్పోర్ట్స్: సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర పరిసరాల్లో వాహనాల రాకపోకలు దారి మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కె.చక్రవర్తి తెలిపారు. వాహన చోదకుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం వెల్లడించారు. 19న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద 1.35 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో బెంజి సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు బందరు రోడ్డుపై, ఐదో నెంబర్ రూట్‌పై, ఏలూరు రోడ్డు సీతారామపురం జంక్షన్ నుంచి రెడ్ సర్కిల్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ రోడ్డు వరకు అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, ఇతర వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. -
నేడు గుంటూరు నగరానికి సీఎం వైఎస్ జగన్ రాక
నగరంపాలెం: సీఎం వైఎస్ జగన్ మంగళవారం నగర పర్యటన దృష్ట్యా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ మార్గాల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం ప్రయాణించే సమయంలో శ్యామలానగర్, పట్టాభిపురం మెయిన్ రోడ్డులో ట్రాఫిక్‌ను అనుమతించమని పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ► జీటీ రోడ్డులోని మెడికల్ క్లబ్ నుంచి కలెక్టరేట్ వైపు వెళ్లే వాహనాలు, ఎత్తు రోడ్డు సెంటర్, జీటీ రోడ్డులోని ఐటీసీ నుంచి నగరంపాలెం పీఎస్, ఎస్బీఐ జంక్షన్ వైపు వాహనాల్ని కూడా మస్తాన్ దర్గా, ఎత్తు రోడ్డు సెంటర్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. ► నగరంపాలెం ఎస్బీఐ జంక్షన్ నుంచి కంకరగుంట బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాల్ని మెడికల్ కాలేజీ రోడ్డు వైపునకు, ఏటీ అగ్రహారం, కంకరగుంట వైపు నుంచి కలెక్టరేట్ ఎదురు రోడ్డుకు వచ్చే వాటిని కంకరగుంట అండర్ బ్రిడ్జి మీదుగా పట్టాభిపురం వైపు మళ్లిస్తారు. ► కలెక్టరేట్ నుంచి కంకరగుంట బ్రిడ్జి మీదుగా పట్టాభిపురం వైపునకు వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు. ► పట్టాభిపురం, రవీంద్రనగర్, శ్యామలానగర్, గుజ్జనగుండ్ల మీదుగా కలెక్టరేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను టీజేపీఎస్ కళాశాల వద్ద కంకరగుంట ఫైఓవర్ పైకి మీదకు అనుమతించరు. అండర్ పాస్ ద్వారా కలెక్టరేట్ వైపు అనుమతిస్తారు. ► సీఎం ప్రయాణించే మార్గంలోని శ్యామలానగర్ ఒకటి, రెండు, మూడో రోడ్ల వద్ద ట్రాఫిక్ అంక్షలు ఉంటాయి. శ్యామలానగర్ రైల్వేగేటు నుంచి ఆర్మీ రిక్రూట్మెంటు సెంటర్ వైపు వచ్చే వాహనాల్ని అందుబాటులో ఉన్న మార్గాల వైపు మళ్లిస్తారు. ► హౌసింగ్ బోర్డ్, ఎన్జీవో కాలనీ నుంచి శ్యామలానగర్ రైల్వేగేటు వైపు వచ్చే వాహనాలు నల్లపాడు నుంచి చుట్టుగుంట వైపు వెళ్లే రోడ్డును వినియోగించాలి. ► శ్యామలానగర్ గేటు వైపు వచ్చే వారు దాటకుండా, ఆర్.అగ్రహారం పక్కనున్న రోడ్డు ద్వారా కంకరగుంట అండర్ పాస్‌కు వెళ్లి, అక్కడ నుంచి పట్టాభిపురం వైపు, మరో అండర్ పాస్ ద్వారా కలెక్టరేట్ వైపు మళ్లాలి. -
Hyderabad: 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కూకట్పల్లి నుంచి అమీర్‌పేట, బేగంపేట వైపు, బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు, మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ►కూకట్పల్లి నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్పల్లి మెట్రో రైల్ స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకుని ఐడీఎల్ లేక్ రోడ్డు, గ్రీన్‌హిల్స్ రోడ్డు, రెయిన్బో విస్టాస్, ఖలాపూర్ ఫ్లైఓవర్, పర్వతనగర్, టాడీ కాంపౌండ్, కావూరిహిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాలి. ►కూకట్పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కూకట్పల్లి వై జంక్షన్లో బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లైఓవర్ కింద, న్యూబోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, అమీర్‌పేట్ నుంచి మళ్లిస్తారు. ►మూసాపేట, గూడ్స్ షెడ్ నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పర్వత్‌నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
Republic Day: విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు.. వాహనాల రూట్ ఇలా..
విజయవాడ స్పోర్ట్స్: ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలు జరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో బెంజిసర్కిల్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వరకు, రెడ్‌సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించమన్నారు. బెంజిసర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా వరకు ఆహా్వనితులను మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ ఆంక్షలు విధిస్తున్నామన్నారు. వాహనాల రూట్ ఇలా.. ♦ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెంజిసర్కిల్ రాకపోకలు సాగించే బస్సులు, ఇతర వాహనాలు ఏలూరు రోడ్డు, స్వర్ణప్యాలెస్, దీప్తిసెంటర్, పుష్పాహోటల్, జమ్మిచెట్టు సెంటర్, సిద్ధార్థ జంక్షన్ మార్గాన బందరులాకులు, రాఘవయ్యపార్క్, పాతఫైర్ స్టేషన్‌రోడ్, అమెరికన్ ఆస్పత్రి, మసీద్‌రోడ్, నేతాజీబ్రిడ్జి, గీతానగర్, స్క్యూ బ్రిడ్జి మార్గాన్ని అనుసరించాలి. ♦ఐదో నెంబర్ రూట్లో ప్రయాణించే సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ నుంచి బెంజిసర్కిల్‌కు చేరుకోవాలి. ♦హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే భారీ, మధ్యతరహా వాహనాలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ మార్గాన్ని అనుసరించాలి. ♦విశాఖపట్నం నుంచి చెన్నైకి రాకపోకలు సాగించే భారీ, మధ్యతరహా వాహనాలు హనుమాన్‌జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గాన్ని అనుసరించాలి. ♦గుంటూరు నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడిబ్రిడ్జి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ మార్గాన్ని అనుసరించాలి. ♦చెన్నై నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నాల్గొండ, నార్కెట్‌పల్లి మార్గాన్ని అనుసరించాలి. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు.. గణతంత్ర వేడుకలకు విచ్చేసే ఆహా్వనితులు వారి వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేక స్థలాలను కేటాయించినట్లు సీపీ తెలిపారు. ♦అ అ పాస్‌లు కలిగిన వారు స్టేడియం గేట్–2 నుంచి లోపలికి ప్రవేశించి, అక్కడే నిర్ధేశిత ప్రాంతంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ♦అ1, అ2 పాస్‌లు కలిగిన వారు గేట్–4 నుంచి ప్రవేశించి హ్యాండ్‌బాల్ గ్రౌండ్ నందు వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ♦ఆ1, ఆ2 పాస్‌లు కలిగిన వారు గేట్–6 నుంచి ప్రవేశించి ఫుట్‌బాల్ గ్రౌండ్ నందు, స్టేడియానికి ఎదురుగా ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ నందు వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ♦మీడియా ప్రతినిధులు గేట్–2 నుంచి స్టేడియం లోపలికి ప్రవేశించాలి. ♦నున్న, సింగ్‌నగర్, సత్యనారాయణపురం, మాచవరం వైపు నుంచి వచ్చే స్కూల్, కాలేజీ బస్సులు సీతారామపురం జంక్షన్ మీదుగా పుష్పా హోటల్ వరకు చేరుకుని అక్కడ విద్యార్థులను దింపి బస్సులను మధుచౌక్, జమ్మిచెట్టు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌నందు పార్కింగ్ చేసుకోవాలి. ♦పటమట వైపు నుంచి స్కూల్, కాలేజీ బస్సులు బెంజిసర్కిల్ మీదుగా వెటర్నరీ జంక్షన్ వరకు వచ్చి అక్కడే విద్యార్థులను దింపి బస్సులను నేతాజీ బ్రిడ్జి, స్క్యూబ్రిడ్జి, బెంజిసర్కిల్, నిర్మలజంక్షన్, పాలిక్లినిక్‌రోడ్డు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు పార్కింగ్ చేసుకోవాలి. ♦వన్‌టౌన్, కొత్తపేట, భవానీపురం, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే స్కూల్, కాలేజీ బస్సులు స్వరాజ్ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలి. చదవండి: టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన -
బంజారాహిల్స్ రోడ్ నెం.45 ట్రాఫిక్ డైవర్షన్: కొనసాగించాలా..? ఎత్తేయాలా.?
బంజారాహిల్స్: ట్రాఫిక్ డైవర్షన్ వల్ల మీరు ఆనందంగా ఉన్నారా..? ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? ఈ డైవర్షన్‌ను ఇలాగే కొనసాగించాలా..? ఎత్తేయాలా..? అంటూ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ డైవర్షన్‌పై వాహనదారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత నెల 24న రోడ్ నెం.45లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పలు చోట్ల వాహనాల మళ్లింపు, ‘యూ’ టర్న్‌లు, జంక్షన్ల మూసివేత, అంతర్గత రహదారుల వినియోగం తదితర చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇవి కొంత మందికి ఇబ్బంది కలిగిస్తుండగా మరి కొందరు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోలీసులు క్షేత్ర స్థాయిలో నేరుగా వాహనదారుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి వాహనదారులతో ముచ్చటిస్తున్నారు. ఈ రహదారులపై రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వాహనదారులను గుర్తించి వారి నుంచే అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45, రోడ్ నెం. 36, ఫిలింనగర్ రోడ్ నెం.1, జర్నలిస్టు కాలనీ, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రతినిధులు వాహనదారులను ట్రాఫిక్ డైవర్షన్‌పై పలు కోణాల్లో ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతున్నారు. వీటిని క్రోడీకరించి నగర పోలీస్ కమిషనర్‌కు నివేదిక అందించేందుకు సిద్ధమవుతున్నారు. నేడో, రేపో కమిషనర్‌కు ట్రాఫిక్ వెస్ట్‌జోన్ డీసీపీ ఈ నివేదికను అందించనున్నారు. మరో వైపు డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రాకపోకలను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టకముందు, చేపట్టిన తర్వాత అనే రెండు కోణాల్లో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. వాహనదారులు ఎంత దూరం ప్రయాణించాల్సి వస్తున్నది..? డైవర్షన్ వల్ల ఎంత సమయం ఆదా అవుతున్నది.. తదితర వివరాలను కూడా నివేదిక రూపంలో కమిషనర్‌కు అందించనున్నారు. ట్రాఫిక్ పోలీసులు క్షేత్ర స్థాయి పరిశీలనతో కూడిన నివేదికను పరిశీలించిన తర్వాత నగర పోలీస్ కమిషనర్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ డైవర్షన్‌పై ఓ నిర్ణయాన్ని వెలువరించనున్నారు. కొనసాగించాలా..? వద్దా..? అన్నది వాహనదారుల అభిప్రాయాల ద్వారానే నిర్ణయించనున్నారు. -
బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫిబ్రవరి 21 వరకు..
సాక్షి, హైదరాబాద్: బేగంపేట రసూల్‌పురా చౌరస్తా– మినిస్టర్ రోడ్డులోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ మధ్య ఉన్న నాలా పునరుద్ధరణ దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీ ఎస్ఎన్డీపీ–11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అభ్యర్ధన మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ► బేగంపేట ఫ్లైఓవర్ వైపు నుంచి కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రసూల్ చౌరస్తా వద్ద రైట్ టర్న్ తీసుకోవడానికి అనుమతించరు. అయితే అక్కడ యూ టర్న్ తీసుకోవచ్చు. బేగంపేట ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ మీదుగా రాంగోపాల్‌పేట పీఎస్, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ వైపు అనుమతిస్తారు. ► రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రసూల్‌పురా వైపు అనుమతించరు. వీరు రాంగోపాల్‌పేట పీఎస్, సింథికాలనీ, ఫుడ్‌వరల్డ్, హనుమాన్ టెంపుల్ మీదుగా రసూల్‌పురా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► సికింద్రాబాద్ వైపు నుంచి కిమ్స్ ఆస్పత్రి వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ, రాంగోపాల్‌పేట పీఎస్ వద్ద ఎడమ వైపు మళ్లి మినిస్టర్ రోడ్డులో కిమ్స్ వైపునకు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ప్యారడైజ్, రాణిగంజ్ వద్ద కుడివైపునకు మళ్లి కిమ్స్ వైపు మళ్లవచ్చు. ► అంబులెన్స్‌లు లేదా రోగులు బేగంపేట ఫ్లైఓవర్ నుంచి మినిస్టర్ రోడ్డు కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లేవారు సీటీఓ/ మీటింగ్ పాయింట్ వద్ద యూ టర్న్ తీసుకుని సింథికాలనీ, రాంగోపాల్ పేట పీఎస్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వైపుగా వెళ్లేందుకు బైలేన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ► భారీ వాహనాలు (బస్సులు, డీసీఎంలు, లారీలు) హనుమాన్ దేవాలయం నుంచి సింథికాలనీ, పీజీ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రెండు వైపులా అనుమతించరు. ఆ వాహనాలు మినిస్టర్ రోడ్డుకు చేరుకోవడానికి రాణిగంజ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. నగర పౌరులు ఈ ఆంక్షలను గమనించి సూచించిన మార్గాల్లో గానీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో గానీ తమ గమ్యస్థానాలను సులువగా చేరుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. -
ప్రధాని పర్యటన.. వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలివే
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. ప్రధాని సభ సందర్భంగా 8,600 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు. ఏయూ సభా ప్రాంగణం వద్ద ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ► ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ పరిసరాల్లో ఈ రోజు సాధారణ వాహనాల రాకపోకల నిషేధం విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు శ్రీకాకుళం విజయనగరం నుంచి విశాఖ మీదుగా వెళ్లే వాహనాలు ఆనందపురం సబ్బవరం మీదుగా మళ్లిస్తారు. ► అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే వాహనాలు లంకెలపాలెం సబ్బవరం పెందుర్తి మీదగా మళ్లింపు ఉంటుంది. ► శనివారం మధ్యాహ్నం మూడు వరకు మద్దిలపాలెం, ఆంధ్ర యూనివర్సిటీ .. పెదవాల్తేరు . కురుపాం సర్కిల్... స్వర్ణ భారతి స్టేడియం.. పరిసరాల్లో పూర్తిగా సాధారణ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ► అలాగే జ్ఞానాపురం హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ కు సెలవు ప్రకటించిన మార్కెట్ కమిటీ. ప్రధాని సభకు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 నుంచి 11 మధ్య అత్యవసరమైతే బయటకు రండి. ఆ సమయంలో ప్రధాని సభకు వెళ్లే ప్రజల వాహనాలకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రధాని సభకు వెళ్లే వాహనాలకు రూట్ మ్యాప్ ఇచ్చాం..వీటిని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటాం. ప్రధాని సభకు వెళ్లే వీఐపీలకు గ్రీన్ ఛానల్ రూట్ ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. -
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న టీ–20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. రాచకొండ పోలీసులు 2,500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్, ఆక్టోపస్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, ఐటీ సెల్, షీ టీమ్స్ అన్ని పోలీసు విభాగాలు విధుల్లో ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మైదానం, పరిసర ప్రాంతాల్లో 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. ట్రాఫిక్ ఆంక్షలిలా.. మైదానం చుట్టూ నేటి మధ్యాహ్నం నుంచి తెల్లవారు జాము వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి లేదు. సికింద్రాబాద్, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా ప్రవేశం లేదు. గేట్– 1 వీఐపీ ద్వారంలోని పెంగ్విన్ గ్రౌండ్లో 1,400 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. స్డేడియం నలువైపులా అయిదు క్రేన్లు అందుబాటులో ఉంటాయి. ఎన్జీఆర్ఐ గేట్ –1, జెన్‌ప్యాక్ట్‌లకు రోడ్డుకిరువైపులా ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక యాప్ ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి రూట్‌ను చూపించే యాప్ మెసేజ్ రూపంలో వస్తుంది. 21 పార్కింగ్ ప్రాంతాలు ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 370 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. స్టేడియం చుట్టూ దాదాపు 21 పార్కింగ్ ప్రాంతాలను అందుబాటులో ఉంచామన్నారు. వీటితో పాటు స్టేడియం చుట్టూ 7.5 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లపై పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించినట్లు, ప్రధాన కూడళ్లు నాగోల్ చౌరస్తా, ఉప్పల్ చౌరస్తా, హబ్సిగూడ ఎల్జీ గోడౌన్ వద్ద, హబ్సిగూడ చౌరస్తాలో పార్కింగ్ ప్రదేశాలను చూపే అతి పెద్ద సమాచారమిచ్చే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు.. ►ఉప్పల్ వైపు వచ్చే అన్ని భారీ వామనాలను దారి మళ్లించనున్నారు. ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను చెంగిచర్ల వద్దే దారి మళ్లిస్తారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలను దారి మళ్లించి దిల్సుఖ్నగర్ మీదుగా వయా అంబర్‌పేట నుంచి పంపించనున్నారు. వీటికి అనుమతి లేదు.. ►స్టేడియం లోపలికి మొబైళ్లు, ఇయర్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తారు. హెల్మెట్లు, కెమెరా, బైనాక్యులర్, ల్యాప్‌ట్యాప్, సిగరెట్లు, తినుబండారాలు, ఆల్కహాల్, మత్తు పదార్థాలు, సెల్ఫీ స్టిక్స్, హాల్‌పిన్స్, బ్లేడ్లు, చాకులు, వాటర్ బాటిళ్ల వంటివేవీ స్టేడియం లోనికి అనుమతించరు. -
బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న బంజారాహిల్స్‌లో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయం, పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్ మీదుగా వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్డు నంబర్–36, 45 మీదుగా మాదాపూర్ వైపునకు మళ్లాలి. మాసబ్‌ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 వైపు వచ్చే వాహనాలు బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1, 10 మీదుగా జహీరానగర్, కేన్సర్ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి. ఫిల్మ్‌నగర్ మీదుగా ఒర్సి ఐస్‌ల్యాండ్ మీదుగా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ, ఎన్ఎఫ్సీఎల్ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాలి. మాసబ్‌ట్యాంక్ మీదుగా రోడ్డు నంబర్ 12, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, నానల్‌నగర్, టోలిచౌకి, ఫిల్మ్‌నగర్, జూబ్లిహిల్స్‌కు చేరుకోవాలి. 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్న సీఎం బంజారాహిల్స్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని మంగళవారం ఆయ న హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు నాగేందర్, గోపీనాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్ చేతుల మీదు గా ప్రారంభం జరుగుతుందని తెలిపారు. (క్లిక్: జీహెచ్ఎంసీ నెత్తిన మరో పిడుగు) -
Ujjaini Mahankali Bonalu: జంటనగర వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 17, 18వ తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా... కర్బల మైదాన్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రాణిగంజ్ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్ మీదుగా, ఎస్పీ రోడ్‌లోని బేగంపేట హెచ్‌పీఎస్ వద్ద యూటర్న్ తీసుకుని సీటీవో, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ, సంగీత్, గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల మీదుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తాడ్బంద్, బేగంపేట వెళ్లే ఆర్టీసీ బస్సులు క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా లేదా క్లాక్ టవర్, వైఎంసీఏ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే సాధారణ ట్రాఫిక్ గాస్మండి చౌరస్తా, సజ్జన్‌లాల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా వెళ్లాలి. ► ప్యాట్నీ ఎస్బీఐ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్ ప్యాట్నీ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్, ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ సంగీత్ చౌరస్తా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా చిలకలగూడ వైపు నుంచి వెళ్లాలి. ► ప్యారడైజ్ వైపు నుంచి బైబిల్ హౌస్ వెళ్లాల్సిన వాహనదారులు ఎస్బీఐ, క్లాక్‌టవర్ మీదుగా వెళ్లాలి. ► క్లాక్ టవర్ నుంచి ఆర్పీరోడ్ వెళ్లే వాహనదారులు ప్యారడైజ్, మినిష్టర్ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► సీటీవో, ప్యారడైజ్ నుంచి ఎంజీరోడ్ వెళ్లే వాహనాలు సింధీకాలనీ, మినిష్టర్ రోడ్, కర్బల మైదాన్గా వెళ్లాలి. ► పంజగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్ జంక్షన్, ఐమాక్స్ రోటరీ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ చౌరస్తా, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు ఓల్డ్ గాంధీ, మోండా మార్కెట్, బైబిల్ హౌస్, కర్బల మైదాన్ మీదుగా వెళ్లాలి. ► ఉప్పల్ నుంచి పంజగుట్ట వెళ్లే వాహనదారులు రామంతాపూర్, అంబర్పేట్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ రోడ్డును వినియోగించుకోవాలి. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వైపు రెండు వైపుల రోడ్డు మూసి ఉంటుంది ఈ రోడ్డు వైపు రావద్దు. ► మహంకాళి ఆలయానికి వెళ్లే టొబాకోబజార్, హిల్‌స్ట్రీట్, సుభాష్‌రోడ్‌లో బాటా నుంచి రాంగోపాల్‌పేట్ పాత పోలీస్ స్టేషన్ వరకు, ఆదయ్యనగర్ నుంచి దేవాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే... ► బోనాల జాతరకు వచ్చే వాహనదారుల కోసం ట్రాఫిక్ పోలీసులు 8 ప్రాంతాల్లో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. ► సెయింట్ జాన్సన్ రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్బీఐ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్‌తో పాటు బెల్సన్ తాజ్ హోటల్, మహబూబ్ కళాశాల, ఎస్వీఐటీలో పార్కింగ్ చేసుకోవచ్చు. ► సుభాష్‌రోడ్, రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ జైల్‌ఖానా వద్ద, కర్బల మైదాన్, బైబిల్ హౌస్, గాస్మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా స్కూల్, రాణిగంజ్, ఆదయ్యనగర్ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలు ఆదయ్య మెమోరియల్ స్కూల్లో, సీటీవో, బాలంరాయి, రసూల్‌పురా నుంచి వచ్చే వాహనాలు గాంధీ విగ్రహం వద్ద, మంజు థియేటర్ వైపు వచ్చే వాహనాలు అంజలి థియేటర్ వద్ద పార్కింగ్ చేసికోవచ్చు. ► ‘సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు 10వ నంబర్ ప్లాట్‌ఫాం వైపు ఉన్న రహదారిని ఉపయోగించుకోవాలి’ అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. (క్లిక్: హైదరాబాద్ ఐఐటీ అదుర్స్) -
తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు.. ఇవి గమనించండి!
సాక్షి, తిరుపతి: నగరంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపై శ్రీనివాస సేతు ప్రాజెక్టు పనుల నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ వైపునకు వచ్చే వాహనాలు, వెళ్లే వాహనాలను తాత్కాలికంగా మళ్లిస్తున్నామన్నారు. ఈ మార్పు శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. బెంగళూరు, చిత్తూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామానుజపల్లి చెక్‌పోస్ట్ వద్ద నుంచి శ్రీపద్మావతి మహిళా యునివర్సిటీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండుకు చేరుకోవచ్చు. చంద్రగిరి టౌన్, చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవచ్చు . మదనపల్లి, పీలేరు, రాయచోటి, అనంతపురం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు చెర్లోపల్లి సర్కిల్, బాలాజి కాలనీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయి. చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవచ్చు. లైట్ మోటార్ వాహనాలు: బస్టాండ్ నుంచి రేణిగుంటకు.. రామానుజం సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్ వైపు వెళ్లాలంటే డీబీఆర్ హాస్పిటల్ మీదుగా హీరో హోండా షోరూమ్ వద్ద రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటుకొని వెళ్లవచ్చు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉన్నట్లు గుర్తించగలరు. పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు: రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్, తిరుచానూర్ ఫ్లై ఓవర్, ఆర్సీపురం జంక్షన్, ఎమ్మార్‌పల్లి పోలీసు స్టేషన్, అన్నమయ్య సర్కిల్, వెస్ట్ చర్చ్, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయి. హైదరాబాద్, కర్నూల్, కడప వాహనాలు కరకంబాడి మీదుగా బస్టాండు చేసుకోవచ్చు. నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చెన్నై నుంచి వచ్చే వాహనాలు రేణిగుంట రమణవిలాస్ సర్కిల్ మీదుగా కరకంబాడి, మంగళం లీలామహల్ మీదుగా వెళ్లచ్చు. లేకుంటే, గాజులమండ్యం జంక్షన్, ఆర్సీ పురం జంక్షన్, రామానుజపల్లి చెక్ పోస్ట్, మహిళా యునివర్సిటీ, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండ్ చేరుకోవచ్చు. అత్యవసర వాహనాలు ట్రాఫిక్ మళ్లింపు కారణంగా అంబులెన్స్, మెడికల్, ప్రభుత్వ వాహనాలకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ సహకరించాలి. అలాగే ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు, విద్యాసంస్థలు తమ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం అనువైన మార్గాన్ని ఎంచుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. (క్లిక్: హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి) -
ప్లీనరీకి పటిష్ట భద్రత
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీకి పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. విజయవాడ – గుంటూరు మధ్య జాతీయ రహదారికి సమీపంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో శుక్ర, శనివారాల్లో ప్లీనరీ జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ ప్లీనరీలో పాల్గొననున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న మొదటి ప్లీనరీ కావడంతో కార్యకర్తలు అంచనాలకు మించి రానున్నారు. అందుకు తగ్గట్టుగానే పోలీసు శాఖ భద్రత ఏర్పాట్లు చేసింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో అదనపు డీజీ (శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, విజయవా డ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, గుంటూ రు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ అంశాలపై ప్రణాళిక రూపొందిం చారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్లీనరీ ప్రాంగణాన్ని గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 3,500 మంది పోలీసులను ప్లీనరీ భద్రతా విధుల కోసం నియమించారు. 14 మంది ఐపీఎస్ అధి కారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు కాకుం డా 30 మంది డీఎస్పీలు, 120 మంది సీఐలు, 170 మంది ఎస్సైలకు విధులు కేటాయించారు. రిజర్వ్ ఫోర్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. సీఎం హెలికాప్టర్ కోసం ప్లీనరీ వేదికకు సమీపంలో హెలి ప్యాడ్ ఏర్పాటు చేశారు. సర్వం సిద్ధం.. వీఐపీలకు ప్రత్యేక ప్రవేశ ద్వారం ప్లీనరీకి హాజరయ్యే వీఐపీల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లీనరీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర కేబి నెట్ హోదా కలిగిన ప్రముఖులు దాదాపు 300 మం ది వీఐపీ జాబితాలో ఉన్నారు. వారికి వీఐపీ పాస్ లు, వాహన పాస్‌లు జారీ చేశారు. వారికి ప్రత్యేక రూట్‌ను నిర్ణయించారు. నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఏఎన్‌యూ డైవర్షన్ పాయింట్ నుంచి అండర్‌పాస్‌లో వచ్చి వేదిక వద్దకు చేరుకోవాలి. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రధాన వేదిక ముందు ‘డి జోన్’ను ఏర్పాటు చేశారు.ఆ జోన్’లోకి ఎవరినీ అనుమతించరు. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు ఇతర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలను గుర్తించేందుకు నిఘా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గురువారం రాత్రి విద్యుత్ దీపాల ధగధగలతో కాంతులీనుతున్న ప్లీనరీ ప్రాంగణం పక్కాగా పార్కింగ్ ఏర్పాట్లు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉండే మైదానంలో ప్లీనరీ నిర్వహిస్తున్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ► సీఎం కాన్వాయ్ వాహనాల పార్కింగ్: జేఎంజే స్కూల్ పార్కింగ్, సెయింట్ ఆన్స్ కాంపౌండ్. ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీచైర్మన్ల వాహనాలకు: బైబిల్ మిషన్ భవంతి పశ్చిమ వైపున ఉన్న ప్రదేశం. ► విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులకు: కాజా టోల్ గేట్ వద్ద ఉన్న ఆర్కే వెనుజియ లే అవుట్ వద్ద ► విజయవాడ నుంచి వచ్చే కార్లు, ఆటోలు, బైక్‌లు, స్కూటర్లకు : ఏఎన్‌యూ నార్త్, మెయిన్ గేటు, సౌత్ గేట్ల వద్ద పార్కింగ్, అయోధ్య రామిరెడ్డి – సన్స్ ఫంక్షన్ హాల్ ప్రదేశం ► గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులకు : నంబూరు, కంతేరు రోడ్డు పక్కన ► గుంటూరు వైపు నుంచి వచ్చే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు: అమలోద్భవి హోటల్ ప్రాంగణం, జైన్ ఆలయం ప్రాంగణం, దశావతార ఆలయం ప్రాంగణం, కేశవరెడ్డి స్కూల్ ప్రాంగణం, కేశవరెడ్డి స్కూల్ వెనుక, కంతేరు రోడ్డు రైల్వే గేటు నుంచి సాయి భారతి హోం వరకు, రైల్వే గేటు దగ్గరలో సాయి భారతి హోం అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్, కంతేరు రోడ్డులో వైట్ ఫెన్సింగ్ ఖాళీ ప్రదేశం, ఎడ్ల పందేల ర్యాంప్, పల్లలమ్మ చెరువు నుండి కంతేరు రోడ్డు వరకు, ఖలీల్ దాబా వెనుక వైపు, రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ సమీపంలో. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, భారీస్థాయిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరయ్యే వైఎస్సార్సీపీ ప్లీనరీ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో మొత్తం 3,500 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలకు అనుమతించిన వాహనాల్లో వారు మాత్రమే రావాలి. వారి అనుచరులు, కార్యకర్తలను అనుమతించరు. పోలీసులకు నేతలతో సహా అందరూ సహకరించాలి. జాతీయ రహదారి ట్రాఫిక్ మళ్లింపు ప్లీనరీ ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే బహిరంగ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు హాజరుకానున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆంక్షలుంటాయి. ► చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే భారీ రవాణా వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద మళ్లిస్తారు. చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకోవచ్చు. ► చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. ► చిలకలూరిపేట వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు , చందోలు, చెరుకుపల్లి , భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. ► చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద మళ్లిస్తారు. ఉన్నం, ఏబీ పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు , చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. ► గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలు బుడంపాడు క్రాస్ వద్ద మళ్లిస్తారు. తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. ► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా ఒంగోలు చేరుకోవాలి. ► గుంటూరు వైపు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు తాడికొండ, తుళ్ళూరు, వెంకటపాలెం, యెర్రబాలెం, డాన్ బాస్కో స్కూల్, ఉండవల్లి సెంటర్, తాడేపల్లి పెట్రోల్ బంక్, వారధి మీదుగా విజయవాడ చేరుకోవాలి. ► రాజమండ్రి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దివాన్ చెరువు, ధవళేశ్వరం వంతెన, కొవ్వూరు, జంగారెడ్డి గూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా వెళ్లాలి. ► విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఇవి నూజివీడు, మైలవరం, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. ► గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కేసరపల్లి, ముస్తాబాద, ఇన్నర్ రింగ్ రోడ్, పైపులరోడ్ మీదుగా ఇబ్రíహీంపట్నం చేరుకోవాలి. ► హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్, ఆగిరిపల్లి, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. ► భారీ సరకు రవాణా వాహనాలు గన్నవరం, ఆగిరిపల్లి, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాలి. è హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, అద్దంకి, మేదరమెట్ల మీదుగా చెన్నై వెళ్లాలి. ► హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు, మైలవరం, నూజివీడు మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. మల్టీ యాక్సిల్ రవాణా వాహనాల నిలిపివేత చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే మల్టీ యాక్సిల్ రవాణా వాహనాలను చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేస్తారు. శనివారం రాత్రి 10 గంటల తరువాత అనుమతిస్తారు. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ రవాణా వాహనాలను హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద నిలిపివేసి, శనివారం రాత్రి 10 గంటల తరువాత అనుమతిస్తారు. -
వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 9న ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకాని వద్ద జాతీయ రహదారి – 16 సమీపంలో జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీ, బహిరంగ సభ సందర్భంగా ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని భారీ వాహనాలతో పాటు ఇతర ట్రాఫిక్ ప్లీనరీ జరిగే జాతీయ రహదారిపైకి రాకుండా ఇతర మార్గాల్లోకి మళ్లించినట్టు చెప్పారు. ఈ నిబంధనలు శనివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ► చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపు వెళ్లే భారీ గూడ్స్ వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట నుంచి చీరాల–బాపట్ల–రేపల్లె– అవనిగడ్డ– పామర్రు– గుడివాడ– హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. ► గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూరి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు– గుడివాడ– హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు. ► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ– పామర్రు– అవనిగడ్డ– రేపల్లె– బాపట్ల– చీరాల– త్రోవగుంట– ఒంగోలు మీదుగా మళ్లించారు. ► విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు– మైలవరం– జి.కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. ► హైదరాబాద్ వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి.కొండూరు – మైలవరం– నూజివీడు– హనుమాన్ జంక్షన్ మీదుగా అనుమతిస్తారు. ► చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ గూడ్స్ వాహనాలను ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారికి సమీపంలోని చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు. ► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ గూడ్స్ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద, పొట్టిపాడు టోల్గేట్ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు. ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్ ఇలా.. ► విజయవాడ నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు కాజా టోల్ ప్లాజా వద్ద ఉన్న ఆర్కే వెనుజియా లేఅవుట్ వద్ద, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ► గుంటూరు నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు నంబూరు, కంతేరు రోడ్డుపైన, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్, రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన పార్కింగ్ ఇచ్చారు. -
HYD: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరేడ్ గ్రౌండ్ వద్ద శుక్రవారం భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జరగబోయే సభకు నాలుగు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు. ఇక, హెచ్ఐసీసీ పరిధిలో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ వెళ్లేవారు.. సీఓడీ నుంచి దుర్గం చెరువు, బయోడైవర్సిటీ మీదుగా రాకపోకలు. ఆర్సీపురం, చందానగర్, మాదాపూర్, గచ్చిచౌలి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్, హెచ్‌సీయూ, ట్రిపుల్ ఐటీ మీదుగా వెళ్లాలి. మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి వచ్చేవారు ఏఐజీ ఆసుపత్రి, దుర్గం చెరువు మీదుగా రాకపోకలు సాగించాలి. -
హైదరాబాద్: నేటి రాత్రి ఫ్లైఓవర్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: జగ్నేకీ రాత్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నగరంలోని ఫ్లైఓవర్లను గురువారం అర్ధరాత్రి నుంచి మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కొత్వాల్ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇవి అమలులో ఉంటాయి. గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్లతో పాటు పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. మరోవైపు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటి నేపథ్యంలో ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజ్ ఐలాండ్, ఛాపెల్ రోడ్ టీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంపుల నుంచి వాహనాలను మళ్లిస్తారు. -
వర్షాలతో తడిసి ముద్దయిన ముంబై
సాక్షి, ముంబై: ముంబైని వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. వర్షం కారణంగా ముంబైలోని ప్రధాన దారులన్నీ జలదిగ్భందమయ్యాయి. సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే జనాలు.. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల వల్ల అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిసింది. వర్షం కారణంగా అంధేరిలో ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నావీ ముంబైలోని వశీ ప్రాంతంలో ఉదయం తొమ్మిది గంటకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. అసలే అది లోతట్టు ప్రదేశం కావటంతో వర్షాలు కురిసిన ప్రతీసారి నీటమునడం పరిపాటిగా మారింది. దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా జుహు, వసాయ్ వంటి ప్రాంతాలు నీటమునగగా.. శివారు ప్రాంతాలన్నీ ట్రాఫిక్ దిగ్భందంలో చిక్కుకుపోయాయి. జోగేశ్వరి హైవే నుంచి ఐఐటీ పోవై వరకు, బోరివ్లి నుంచి శాంతాక్రజ్ వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. బాంద్రాలోని ఎస్వీ రోడ్డులో నీటిముంపు కారణంగా ట్రాఫిక్ మళ్లించారు. నగరంలోనే కాక పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ట్విట్టర్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. అటు వాతావరణ శాఖ కూడా ముంబై, థానే ప్రాంతాల్లో శుక్రవారం తీవ్ర వర్షాలు కురుస్తాయంటూ ముందుగానే హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో మ్యాన్‌హోల్స్‌ను తెరవద్దంటూ బీఎంసీ నగరవాసులను కోరింది. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ గ్రిల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపింది. -
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం : 30న ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
సాక్షి, విజయవాడ : ఈ నెల 30వ తేదీన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు 5 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ఈ వేడుకకు హాజరుకానున్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ క్వానాయ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గం సిద్దం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం ఏఆర్ మైదానం కేటాయించారు. అలాగే అధికారులు, వారి సిబ్బంది, సహాయకుల వాహనాలను బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల, స్టేట్ గెస్ట్‌హౌస్‌లో నిలపాల్సి ఉంటుంది. గురువారం రోజున ట్రాఫిక్ డైవర్షన్‌కు సంబంధించిన వివరాలు.. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట, వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు గుంటూరు, తెనాలి, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి. హైదరాబాద్ నుంచి చెన్నై మధ్య రాకపోకలు నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, అడవినెక్కలం, మేదరమెట్ల, ఒంగోలు మీదుగా సాగనున్నాయి. -
గణేష్ నిమజ్జనం: ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. 1.సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్స్, ఇంజిన్‌బౌలి, నాగుల్చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్‌కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్,దారుల్షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ 2.ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ 3.వెస్ట్ జోన్: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ 4.సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చౌరస్తా, కంట్రోల్‌రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్కు, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు 5.నార్త్‌జోన్: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్‌నగర్ కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్ ఫుడ్ వరల్డ్, సత్యం థియేటర్ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్‌పేట మీదుగా పంపిస్తారు. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రి 10.30 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 550 ప్రత్యేక బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకునేందుకు 550 బస్సులను అదనంగా తిప్పనున్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, కాచిగూడ, కూకట్పల్లి, లింగంపల్లి, బాలానగర్, జీడిమెట్ల, మెహదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్ వరకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. #HYDTPinfo Please go through the maps of Main procession and Parking Places around Hussain Sagar Lake. Pl. Plan ur journey by avoiding the routes shown in the Map. Separate parking places around the Hussain Sagar Lake were arranged for the convenience of viewers. @AddlCPTrHyd pic.twitter.com/lBvND599tZ — Hyderabad Traffic Police (@HYDTP) 21 September 2018 -
అమీర్‌పేట వెళుతున్నారా.. ఇది గమనించండి
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట ప్రధాన రహదారిలో ప్రారంభమైన ట్రాన్స్‌కో 132 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనుల కారణంగా అమీర్‌పేట నుంచి పంజగుట్ట నిమ్స్ వరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 24 నుంచి మే 31వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు. మళ్లింపు ఇలా... సంగారెడ్డి, జహిరాబాద్, పటాన్చెరువు వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పంజగుట్ట నుంచి అనుమతించరు. కూకట్పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ క్రాస్ రోడ్, బాలానగర్, ఫిరోజ్‌గూడ, బోయిన్పల్లి జంక్షన్, తాడ్బంద్జంక్షన్, బాలంరాయి జంక్షన్,ప్యారడైజ్ హోటల్ ఎంజీ రోడ్, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, ఏజీ ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. పఠాన్‌చెరువు, మియాపూర్, కూకట్పల్లి నుంచి వచ్చే ఆంధ్ర, రాయలసీమ ప్రైవేట్ బస్సులు అమీర్‌పేట, పంజగుట్ట వైపు అనుమతించరు. మైత్రివనం వద్దే మళ్లించి ఎస్ఆర్నగర్ గౌతండిగ్రీ కాలేజీ వద్ద యూ టర్న్ తీసుకొని అక్కడే ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సిటీ బస్సులు, లారీలు, పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ట్యాంకులు, పటాన్ చెరువు, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి నుంచి ఖైరతాబాద్ వెళ్లాలంటే ఎస్ఆర్నగర్ చౌరస్తాలో ఉమేష్ చంద్రా విగ్రహం వద్ద ఎడమ వైపు తీసుకొని కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్బి సిగ్నల్, సోనాబాయి టెంపుల్, అమీర్‌పేట్, బీకే రోడ్డు, కాకతీయ హోటల్, సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం చౌరస్తా వద్ద ఎడమ వైపు తీసుకొని రాజ్‌భవన్ రోడ్డులో ఖైరతాబాద్ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. -
సత్యం థియేటర్‌వైపు వెళ్లొద్దు..
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేటలోని సత్యం థియేటర్ మార్గంలో జీహెచ్ఎంసీ అధికారులు నాలా వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో గురువారం నుంచి మూడు నెలల పాటు కనకదుర్గ దేవాలయం–సత్యం థియేటర్ మధ్య మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి. రవీందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి కేవలం ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. మైత్రీవనం నుంచి గ్రీన్‌ల్యాండ్స్ వైపు వెళ్ళే ఈ వాహనాలను ధరమ్‌కరమ్ రోడ్, జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్, సోనబాయ్ టెంపుల్, సత్యం థియేటర్ మీదుగా పంపించనున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను అనుమతిస్తామని చెప్పారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో ఉంచుకుని తమకు సహకరించాలని కోరారు. మలక్‌పేటలోనూ.. మలక్‌పేట ఆర్వోబి వద్ద మెట్రో వయాడక్ట్‌ల(సెగ్మెంట్ల) అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. వయాడక్ట్‌ల అనుసంధానం కోసం నాలుగు నెలల క్రితం ట్రాఫిక్ ఆంక్షలు విధించి భారీక్రేన్ సహాయంతో ఎల్జి బ్రిడ్జి బ్లిల్డర్ను పిల్లర్లపైకి ఎక్కించారు. మూడు నెలలు రాత్రింబవళ్లు కష్టపడి సెగ్మెంట్లను అనుసంధానం పూర్తిచేశారు. వయాడక్ట్‌ల అనుసంధానం పూర్తయి నెల రోజులు గడుస్తున్నా బ్రిడ్జి బిల్డర్‌ను కిందకి దింపలేకపోవటం, మరోవైపు మెట్రో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మలక్‌పేటలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని డాక్టర్ వి. రవీందర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం నుంచి నవంబర్ 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
బెంబేలెత్తిన బెజవాడ వాసులు..
-
బెంబేలెత్తిన బెజవాడ వాసులు..
►ట్రాఫిక్ జామ్‌తో స్తంభించిన బెజవాడ రోడ్లు ►దాదాపు మూడు గంటల నుంచి రోడ్లపైనే నిలిచిన వాహనాలు ►నగరమంతా అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్ సాక్షి, విజయవాడ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపుతో బెజవాడ ప్రజలు పట్టపగలే చుక్కలు చూశారు. అసలే ఇరుకు రోడ్లు. ఆపై చిన్నచిన్న వీధుల్లోకి ట్రాఫిక్ మళ్లింపులతో శనివారం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం కావడంతో నగర వాసులను ట్రాఫిక్ బేజారెత్తించింది. బందర్ రోడ్డుకు కనెక్ట్ అయ్యే కృష్ణలంక రోడ్ పూర్తిగా జామైపోయింది. దాంతో రెండు గంటలపాటు వందల వాహనాలు నిలిచిపోయాయి. అధికార యంత్రాంగం చేతులెత్తేయడంతో విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్ళాల్సిన ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్ళాల్సిన రోగులు నానా అవస్ధలు పడ్డారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమను కష్టాల పాలు చేస్తోందని పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలు ఇలా రోడ్లపై వుండాలంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి నుంచే ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులు వాహనాలకు సరైన రీతిలో ప్రత్యామ్నాయం చూపకపోవడంతో అనేక చోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్థంగా తయారైంది. విజయవాడ బయట కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక గన్నవరం నుంచి వెలగపూడి వరకు 23కిలో మీటర్ల మేర పూర్తిగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. అలాగే రామలింగేశ్వర నగర్, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల నుంచి రావాలంటే బందర్ రోడ్ మీదుగానే రావాల్సి వుంటుంది. అయితే బందర్ రోడ్‌తో వున్న అన్ని కనెక్టింగ్ రోడ్లను పోలీసులు మూసివేశారు. ఫలితంగా వేలాది వాహనాలు కృష్ణ లంక వైపు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను సత్తుపల్లి మీదుగా, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, గుడివాడల మీదుగా, హైదరాబాద్‌నుంచి బందరు వెళ్లే వాహనాలు..నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించారు. అలాగే మచిలీపట్నంనుంచి చెన్నై వెళ్లే వాహనాలను..పామర్రు, చల్లపల్లి మీదుగా మళ్లించారు. ఉప రాష్ట్రపతి పర్యటన, వాహనాలు మళ్లింపు -
మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్ : మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో అమీర్‌పేటలోని మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్ మళ్ళింపులు విధించారు. ఇవి గురువారం నుంచి 45 రోజుల పాటు అమలులో ఉంటాయని, వాహనచోదకులు సహకరించాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం కోరారు. ►ఎర్రగడ్డ, అమీర్‌పేట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాహనాలను ఎస్సార్‌నగర్‌లోని ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి ఎస్సార్‌నగర్ ఠాణా, ఎస్సార్‌నగర్ టి జంక్షన్, సత్యం థియేటర్, దుర్గామాత టెంపుల్ మీదుగా పంపిస్తారు. ఈ మార్గం వన్‌వేగా ఉండే నేపథ్యంలో దీనికి వ్యతిరేక దిశలో వాహనాలు అనుమతించరు. ►ఫతేనగర్ నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను సత్యం థియేటర్ వైపు అనుమతించరు. వీటిని బల్కంపేట ఆర్ అండ్ బీ ఆఫీస్, డీకే రోడ్, జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్ మీదుగా పంపిస్తారు. ►ఎర్రగడ్డ వైపు నుంచి మధురానగర్, కళ్యాణ్‌నగర్ వైపు వెళ్ళే తేలికపాటి వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఉమేష్ చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి కుడి వైపునకు భారీ వాహనాలను ఎడమ వైపునకు మళ్లిస్తారు. ►జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్, అమీర్‌పేట–సోనాబాయ్ టెంపుల్ మధ్య ఇరుకైన రోడ్డు కావడంతో దీన్ని వన్‌వేగా చేస్తున్నారు. సోనాబాయ్ టెంపుల్ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. ►బేగంపేట నుంచి ఎస్సార్‌గనర్, యూసుఫ్‌గూడ వైపు వెళ్ళే వాహనాలను సత్యం థియేటర్ వైపు అనుమతించరు. వీటిని దుర్గామాత దేవాలయం నుంచి మైత్రివనం వైపు మళ్ళిస్తారు. ►ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా, ఎస్సార్‌నగర్ టి జంక్షన్ మధ్య ఉన్న బై లైన్ రోడ్స్‌లో కమ్యూనిటీ హాల్ రోడ్ మినహా మిగిలినవి మూసేస్తారు. ►అమీర్‌పేట జంక్షన్ నుంచి మైత్రివనం, ఎస్సార్‌నగర్ వైపు వెళ్ళే వాహనాలు యథావిధిగా ప్రయాణిస్తాయి. ►ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తగిన రూట్లు ఎంపిక చేసుకుంటే మంచిది. -
పరీక్షల సమయంలో ట్రాఫిక్ మళ్లింపా..!?
కుమ్మరిపాలెం వద్ద వాహనదారుల ఇక్కట్లు భవానీపురం (విజయవాడ పశ్చిమం) : ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు సరికాదని ప్రజలు పేర్కొంటున్నారు. దుర్గగుడి టోల్గేట్ నుంచి విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ వరకు జాతీయ రహదారి మరమ్మతుల సందర్భంగా గురువారం అర్ధరాత్రి నుంచి నెల రోజులపాటు మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ క్రమంలో వన్‌టౌన్, టూటౌన్ వెళ్లాల్సిన గట్టు వెనుక ప్రాంతంలోని వాహనదారులను కుమ్మరిపాలెం వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు సొరంగ మార్గం గుండా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కనీసం ద్విచక్రవాహనాలను కూడా అనుమతించకపోవడంతో వాహనచోదకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం సాయంత్రం టూటౌన్ వెళ్లాల్సిన అంబులెన్స్‌ను కూడా పోలీసులు అనుమతించలేదు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబులెన్సు సకాలంలో ఆస్పత్రికి చేరక, రోగి ప్రాణాలకు ఏమైనా ఆపద ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. త్వరలో ఇంటర్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చుట్టూ తిరిగి వెళ్లే సమయంలో సొరంగం వద్ద ట్రాఫిక్ స్తంభించి, విద్యార్థలు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరకుంటే వారి పరి స్థితి ఏమిటా అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్ పరీక్షల తరువాత 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభమవుతాయని, వారు కూడా అవస్థల పడకతప్పేలా లేదని పేర్కొంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపు కారణంగా సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుతామో లేదోనన్న ఆందోళనతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు ట్రాఫిక్ మళ్లింపుపై పునరాలోచన చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘దారీ’ తెన్నూ తెలియక...
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ మళ్లింపుపై సరైన అవగహన లేకపోవడంతో తొలి రోజున పుష్కర భక్తులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వన్‌టౌన్‌లో కాళేశ్వరరావు మార్కెట్ నుంచి వచ్చే యాత్రికులను ఫ్లై ఓవర్ కింద నుంచి కెనాల్ రోడ్డు వీఎంసీ కార్యాలయం మీదగా స్నాన ఘాట్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే ట్రాఫిక్ మళ్లింపుపై అవగహన లేకపోవడం, సరైన సూచిన బోర్డులను ఏ ర్పాటు చేయకపోవడంతో ఫ్లై ఓవర్ వద్ద యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మార్కెట్ వైపు నుంచి వచ్చే భక్తులు వీఎంసీ కార్యాలయం వైపు వెళ్లేందుకు అనుమతించకపోవడం, అటు వైపు నుంచి వచ్చే యాత్రికులు కాళేశ్వరరావు మార్కెట్‌కు వెళ్లేందుకు వీలు లేకపోయింది. యాత్రికుల రాకపోకలను నియంత్రిస్తూ పోలీసుశాఖ బ్యారికేట్స్ను ఏర్పాటు చేశారు. రోడ్డు దాటేందుకు అనుమతించాలని యాత్రికులు పలు మార్లు వేడుకున్నా వారు ఒప్పుకోకపోవడంతో చివరకు ఫ్లైఓవర్ గోడఎక్కి దూకేశారు. వృద్దు లు, చిన్నారులు, యువకులు అనే బేదం లేకుండా ప్రతి ఒక్కరు ఇలా గోడ దూకేశారు. ఎలావెళ్లాలో చెప్పే పోలీసులు, వాలంటీర్లు కూడా కరువయ్యా రు. -
1న పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
పాతబస్తీలో ఈ నెల 31న నిర్వహించే అమ్మవారికి బోనాల సమర్పణతో పాటు ఆగస్టు 1న నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపునకు అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలతో పాటు అన్ని ప్రాంతాల్లోని అమ్మవారికి స్థానిక భక్తులు భక్తిశ్రద్దలతో బోనాలను సమర్పించనున్నారు. ఈ జాతర సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా.. ఆగస్టు 1న ట్రాఫిక్ ఆంక్షలు.. అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు సందర్భంగా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు దక్షిణ మండలంలోని చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా తదితర ఏసీపీల పరిధిలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలున్నందున తాము సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణికులు, వాహనదారులు వెళ్లాలని డీసీపీ కోరారు. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షల వివరాలు... కందికల్‌గేట్ నుంచి లాల్‌దర్వాజ వైపు వచ్చే వాహనాలను ఛత్రినాక పోలీస్‌స్టేషన్ వద్ద టీ జంక్షన్ నుంచి గౌలిపురా మీదుగా మళ్లీస్తారు. ఫూల్‌బాగ్ నుంచి లాల్‌దర్వాజ వైపు వచ్చే వాహనాలు పత్తర్‌కీదర్గా వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి ఛత్రినాక పాత ఏసీపీ కార్యాలయం మీదుగా వెళ్లాలి. గౌలిపురా మార్కెట్ నుంచి వచ్చే వాహనాలను సుధా టాకీస్, అశోకా ిపిల్లర్ క్రాస్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. బాలాగంజ్ నుంచి లాల్‌దర్వాజ వైపు వచ్చే వాహనాలు గౌలిపురా క్రాస్‌రోడ్డు మీదుగా వెళ్లాలి. ఉప్పుగూడ, ఛత్రినాక నుంచి వచ్చే వాహనాలను హరిబౌలి క్రాస్ రోడ్డుగా పంపిస్తారు. మీరా-కా-దయిరా, మొఘల్‌పురా నుంచి శాలిబండ వైపు వచ్చే వాహనాలను హరిబౌలి క్రాస్ రోడ్డు మీదుగా పంపిస్తారు. చాంద్రాయణగుట్ట నుంచి అలియాబాద్ వైపు వచ్చే వాహనాలను న్యూ షంషీర్గంజ్ టీ జంక్షన్ మీదుగా తాడ్బన్ వయా ఆల్మాస్ హోటల్ మీదుగా మళ్లీస్తారు. భవానీనగర్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనదారులు బీబీ బజార్ క్రాస్ రోడ్డు మీదుగా ఆలిజా కోట్లా రోడ్డు మీదుగా వెళ్లాలి. మొఘల్‌పురా నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను ఆలిజాకోట్లా మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ మీదుగా మళ్లీస్తారు. యాకుత్‌పురా నుంచి గుల్జార్ హౌస్ వైపు వచ్చే వాహనాలను ఐత్బార్ చౌక్ మీదుగా మళ్లీస్తారు. పురానాపూల్ నుంచి లాడ్‌బజార్ వైపు వచ్చే వాహానాలను మోతీగల్లీ వైపు మళ్లీస్తారు. షక్కర్‌కోట్ నుంచి మిట్టికా షేర్ వైపు వచ్చే వాహనాలను ఘన్సీబజార్, చేలాపూర్ వైపు మళ్లిస్తారు. ఖిల్వత్ నుంచి లాడ్‌బజార్ వైపు వచ్చే వాహనాలను మోతీగల్లీ జంక్షన్ నుంచి చౌక్ మసీదు మీదుగా మళ్లిస్తారు. పురానాపూల్ మహబూబ్కీ మెహిందీ మీదుగా నయాపూల్ వైపు వెళ్లే వాహనాలు ముస్లింజంగ్ బ్రిడ్జి, బేగంబజార్ మీదుగా వెళ్లాలి. గౌలిగూడ, సిద్దంబర్ బజార్ నుంచి నయాపూల్‌కు వచ్చే వాహనాలు అఫ్జల్‌గంజ్ క్రాస్ రోడ్డు నుంచి ఉస్మానియా ఆసుపత్రి రోడ్డు మీదుగా వెళ్లాలి. ఆర్టీసీ బస్సులు పాత సీబీఎస్, దారుల్షిఫా క్రాస్ రోడ్డు, ఇంజన్‌బౌలి నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. ఈ ప్రాంతాల్లో నిషేధం.. ఫతే దర్వాజ నుంచి హిమ్మత్‌పురా వైపు వాహనాలను అనుమతించరు. వీరంతా ఓల్గా హోటల్ నుంచి ఖిల్వత్ లేదా మోతీగల్లీ మీదుగా వెళ్లాలి. చాదర్‌ఘాట్, నూర్ఖాన్ బజార్, దారుల్‌షిఫాల నుంచి నయాపూల్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. దారుల్షిఫా నుంచి సాలార్జంగ్ బ్రిడ్జి మీదుగా గౌలిగూడ, అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లాలి. -
దీక్ష పేలవం
స్పందన నామమాత్రం.. దీక్ష పేలవం నవనిర్మాణ దీక్షలో ఖాళీగా కుర్చీలు ట్రాఫిక్ మళ్లింపుతో {పయాణికుల పాట్లు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ‘నవ నిర్మాణ దీక్ష’కు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఉదయం ఎనిమిది గంటలకే వేదిక వద్దకు సభికులు రావాల్సి ఉండగా.. 10 గంటలకు కూడా అంతంత మాత్రంగానే ప్రజలు వచ్చారు. దీంతో అధికారులు, తెలుగుదేశం నేతలు నానా హైరానా పడి డ్వాక్రా మహిళల్ని, అంగన్వాడీ కార్యకర్తల్ని, కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తరలించారు. దీంతో పది గంటల ప్రాంతంలో వేదిక వద్ద మాత్రం ప్రజల సందడి కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం వస్తారనే ఉద్దేశంతో వెనుకవైపు వేసిన కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్క్రీన్లను పట్టించుకునే నాథుడే కనిపించలేదు. స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వైపు వెళ్లే స్క్రీన్ పనిచేయక మొరాయించింది. జనస్పందన కోసం తహతహ... సీఎం చంద్రబాబు దీక్షా వేదికపై ప్రసంగిస్తున్నప్పుడు ప్రజల నుంచి స్పందన రాలేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, రాష్ట్రాభివృద్ధికి తాను ఎలా కష్టపడుతున్నదీ వివరించినా జనం పట్టించుకోలేదు. తన ప్రసంగానికి కనీసం ప్రజల నుంచి చప్పట్లు కొట్టడం కానీ, గాలిలో చేతులు ఊపటం కానీ లేకపోవడంతో చంద్రబాబు ప్రజాస్పందన కోసం నాలుగువైపులా చూడటం కనిపించింది. గంటకు పైగా సాగిన ప్రసంగంలో గతంలో జరిగిన పరిణామాలనే ప్రజలకు గుర్తు చేయడంతో సభికుల్లో అసహనం కనిపించింది. ఉదయం 11 గంటలకు చంద్రబాబు సభికులతో ప్రతిజ్ఞ చేయించి ప్రసంగం ప్రారంభించారు. 12.15 గంటలకు సమావేశం ముగిసింది. చిరిగిన ఫెక్ల్సీలు.. ఖాళీగా కుర్చీలు... 13 జిల్లాల నుంచి ప్రజలు తరలివస్తారని అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేసినా వేదికకు నాలుగువైపుల, వెనుకవైపు ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వేదిక సమీపంలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేస్తున్న ఫొటోలతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గాలికి అవి ఎగిరి చిరిగిపోయాయి. దీంతో సమావేశం జరగడానికి ముందే వేదిక వెనుక వైపు ఉన్న చిరిగిన ఫ్లెక్సీలను తొలగించారు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్... గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి నగరంలోనికి ట్రాఫిక్‌ను అనుమతించకపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై, కనకదర్గమ్మ వారిధిపై, ఎర్రకట్టపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీక్ష అనంతరం వీటిని క్లియర్ చేయడానికి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. నవ నిర్మాణ దీక్షకు ప్రజల్ని సమీకరించేందుకు ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులను ఉపయోగించుకున్నారు. వీటిని గ్రామాలకు పంపించి అక్కడి నుంచి గ్రామస్తులను తరలించారు. -
నవనిర్మాణ దీక్షకు బెజవాడలో ట్రాఫిక్ మళ్లింపు : సీపీ
నవనిర్మాణ దీక్షకు విస్తృత ఏర్పాట్లు : కలెక్టర్ విజయవాడ : నగరంలో జూన్ రెండో తేదీన ప్రభుత్వం నిర్వహించే నవ నిర్మాణ దీక్ష సందర్భంగా జాతీయ రహదారులు, నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ దీక్షకు హాజరవుతున్నందున ఆ రోజు ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను సత్తెనపల్లి - పిడుగురాళ్ల - మిర్యాలగూడ - నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య ఇలా.. విశాఖపట్నం నుంచి దేవరపల్లి - సత్తుపల్లి - తల్లాడ -ఖమ్మం - సూర్యారావుపేట మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. మరో మార్గంలో హనుమాన్‌జంక్షన్ నుంచి నూజివీడు -విస్సన్నపేట -కల్లూరు -వైరా, ఖమ్మం మీదుగా లేదా హనుమాన్‌జంక్షన్ - నూజివీడు -మైలవరం - ఇబ్రహీంపట్నం మీదుగా లేదా హైదరాబాద్ నుంచి సూర్యారావుపేట - ఖమ్మం - తల్లాడ - సత్తుపల్లి - దేవరపల్లి మీదుగా విశాఖపట్నం వెళ్తాయి. హైదరాబాద్ నుంచి సూర్యాపేట - ఖమ్మం - వైరా -కల్లూరు - విస్సన్నపేట - నూజి వీడు - హనుమాన్‌జంక్షన్ మీదుగా లేదా ఇబ్రహీం పట్నం - మైలవరం - నూజివీడు - హనుమాన్‌జంక్షన్ మీదుగా విశాఖపట్నం వెళ్తాయి. వైజాగ్, చెన్నయ్ మధ్య ఇలా.. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నయ్ వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్ నుంచి గుడివాడ - పామర్రు - చల్లపల్లి - అవనిగడ్డ - బాపట్ల - ఒంగోలు మీదుగా చెన్న య్కు మళ్లిస్తారు. చెన్నయ్ వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లే వాహనాలను ఒంగోలు - త్రోవగుంట - బాపట్ల - అవనిగడ్డ - చల్లపల్లి - పామర్రు - గుడివాడ - హనుమాన్‌జంక్షన్ మీదుగా విశాఖపట్నం మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి చెన్నయ్ నార్కెట్‌పల్లి - నల్గొండ - మిర్యాలగూడ - పిడుగురాళ్ల - అద్దంకి - మేదరమెట్ల - ఒంగోలు మీదుగా చెన్నయ్ వెళ్తాయి. చెన్నయ్ నుంచి వచ్చే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల - అద్దంకి - పిడుగురాళ్ల - మిర్యాలగూడ - నల్గొండ -నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్తాయి. మచిలీపట్నం, చెన్నయ్ మధ్య ఇలా.. మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ మీదుగా చెన్నయ్ వెళ్లే వాహనాలను, మచిలీపట్నం, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, బాపట్ల, ఒంగోలు, మీదుగా చెన్నైకు మళ్లిస్తారు. చెన్నయ్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వెళ్లే వాహనాలను ఒంగోలు, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా మచిలీపట్నం మళ్లిస్తారు. మచిలీపట్నం, హైదరాబాద్ మధ్య.. మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను పామర్రు, హనుమాన్‌జంక్షన్ నుంచి నూజి వీడు, విస్సన్నపేట, కల్లూరు, వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను సూర్యారావుపేట, ఖమ్మం, వైరా, కల్లూరు, విస్సన్నపేట, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, పామర్రు మీదుగా మచిలీపట్నం మళ్లిస్తారు. విజయవాడలో ట్రాఫిక్ ఇలా... బహిరంగ సభకు హాజరయ్యే ఆహూతులు, ప్రజల వాహనాలను కూడా వివిధ మార్గాల్లో మళ్లిస్తారు.స్వరాజ్యమైదానం నుంచి బెంజిసర్కిల్ వైపు వెళ్లే వాహనాలు హోటల్ డీవీ మనార్ వరకు అనుమతి స్తారు. అక్కడి నుంచి సభాస్థలికి నడిచి వెళ్లాలి. ఇక్కడ ప్రజలను దింపిన తరువాత వాహనాలను పీబీ సిద్ధార్థ కళాశాల, సిద్ధార్థ అకాడమీ, సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రాంగణాల్లో నిలపాలి. బందరు రోడ్డుపై మచిలీపట్నం నుంచి వచ్చే వాహనాలు ఎన్టీఆర్ సర్కిల్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి నడిచి సభాస్థలికి వెళ్లాలి. వారి వాహనాలను పంట కాలువ రోడ్డులో, లేదా దానికి అనుబంధమైన రోడ్లలో ఖాళీ ప్రదేశాల్లో రోడ్లకు ఒక పక్కగా పార్కింగ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి హైస్కూల్ ఆవరణలో వాహనాలను పార్కింగ్‌కు అనుమతిస్తారు. గుంటూరు వైపు నుంచి జాతీయరహదారి మీదుగావచ్చే వాహనాలను పకీరు గూడెం జంక్షన్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి ప్రజలు నడిచి బెంజిసర్కిల్‌కు వెళ్లాలి. వారి వాహనాలు పకీరు గూడెం వద్ద యూటర్న్ తీసుకుని స్క్రూబ్రిడ్జి మీదుగా కృష్ణలంక కట్ట ఫీడర్ రోడ్డు దూరదర్శన్ క్వార్టర్స్‌కు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో నిలపాలి. గన్నవరం నుంచి జాతీయరహదారి మీదుగా విజయవాడ వచ్చే వాహనాలను నిర్మలా కాన్వెంటు జంక్షన్ వరకు అనుమతిస్తారు. వాహనాలను నిర్మలా కాన్వెంటు ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలి. వాహనాలు ఎక్కువగా ఉంటే మేరి స్టెల్లా కళాశాలలో పార్కింగ్‌కు అనుమతిస్తారు. ఏలూరు నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు వచ్చే వాహనాలను రామరవప్పాడు రింగ్ రోడ్డు మీదుగా ఏలూరు రోడ్డు, పోలీసు కంట్రోల్ రూం మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు మళ్లించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఏలూరు వచ్చే వాహనాలు పోలీసు కంట్రోల్ రూం మీదుగా ఏలూరు రోడ్డు - రామవరప్పాడు రింగ్ మీదుగా ఏలూరుకు మళ్లిస్తారు. మచిలీపట్నం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు వచ్చే వాహనాలను తాడిగడప, వంద అడుగుల రోడ్డు మీదుగా మళ్లించి ఎనికేపాడు, రామరవప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, పోలీసు కంట్రోల్ రూం మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు మళ్లిస్తారు. -
అమీర్‌పేటలో ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్: అమీర్‌పేటలోని సారథి స్టూడియో, యూసుఫ్‌గూడ మధ్య జరుగుతున్న మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు భారీ వాహనాలకు నిబంధనలు వర్తిస్తాయి. మిగిలిన వాహనాలన్నీ యథావిధిగా యూసుఫ్‌గూడ వైపు వెళ్ళోచ్చు. * అమీర్‌పేట, పంజగుట్ట, సత్యం థియేటర్ వైపు నుంచి యూసుఫ్‌గూడ వెళ్లే వాహనాలు ఎస్సార్‌నగర్ జంక్షన్, వెంగళ్రావు నగర్, కళ్యాణ్‌నగర్, సాయిబాబా దేవాలయం, కృష్ణకాంత్ పార్క్, జీహెచ్ఎంసీ కార్యాలయం, యూసుఫ్‌గూడ బస్తీ చౌరస్తా మీదుగా వెళ్లాలి. * మళ్లింపులు వర్తించే బస్సుల రూట్ నెంబర్లు: 19 వై/ఎఫ్, 10 హెచ్, 10 వై/ఎఫ్, 19 ఎస్/ఎఫ్, 113 వై/ఎఫ్, 45ఏ, 47 ఎఫ్, 47 కే -
ట్రాఫిక్ టెర్రర్
♦ ట్రాఫిక్ మళ్లింపుతో వాహనదారుల కష్టాలు ♦ గంటల తరబడి నిలిచిన రాకపోకలు ♦ రోడ్లపైన ప్రయాణికుల పడిగాపులు ♦ ముందస్తు సమాచారం లేక ఇబ్బందులు నిజామాబాద్ సిటీ: నగరంలోని కంఠేశ్వర్ రైల్వే కమాన్ వద్ద జరుగుతున్న పనులతో ప్రయాణికులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా ట్రాఫిక్ పోలీసులు రాకపోకలను నియంత్రించడంతో వాహనదారులు శుక్రవారం నరక యాతన అనుభవించారు. ట్రాఫిక్ మళ్లింపుతో నగరంలో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రైల్వే బ్రిడ్జి పక్కనే పెద్దపల్లి-నిజామాబాద్ నూతన రైల్వే లైన్ కోసం వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే రెండు పిల్లర్లు నిర్మించే సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. పిల్లర్లు పూర్తి కావడంతో ఆంక్షలు ఎత్తివేశారు. పిల్లర్లపై వంతెన నిర్మించే పనులు మొదలు కావడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కంఠేశ్వర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలు ఎంఎస్ఆర్ స్కూల్, పూలాంగ్వాగుపై గల రైల్వే బ్రిడ్జి కింద నుంచి ఎల్లమ్మగుట్ట మీదుగా మళ్లించారు. ఈ మార్గంలో కార్లు, ఆటోలు, బైక్‌లను మాత్రమే అనుమతించారు. బస్సులు, లారీల వంటి వాటిని పాలిటెక్నిక్ కాలేజీ, జెడ్పీ, హమల్‌వాడి, నాందేవ్‌వాడ, రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నుంచి బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా వైపు మళ్లించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కంఠేశ్వర్ వైపునకు వెళ్లే వాహనాలను ఇదే మార్గంలో అనుమతించారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కంఠేశ్వర్ వైపు వెళ్లేందుకు ఆటోలు, బైక్‌లను పూలాంగ్‌వాగు బ్రిడ్జి కింద నుంచి అనుమతిస్తే బాగుంటుందని వాహనదారులు కోరుతున్నారు. అలాగే, ట్రాఫిక్ జామ్ కాకుండా సిబ్బందిని నియమించాలని సూచిస్తున్నారు. వంతెన నిర్మాణం పనులు పూర్తి కావాలంటే కనీసం 20 రోజులు పడుతుందని, అప్పటివరకు ఈ సమస్య తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ : నగరంలోని అంబర్‌పేట-గోల్నాక ప్రధాన రహదారిలో శనివారం వాహనదారులు నరకయాతన పడ్డారు. మెట్రో రైలు పనుల కారణంగా మలక్‌పేట వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వాహనాలను... అదే విధంగా విజయవాడ నుంచి దిల్సుఖ్నగర్ మీదుగా అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ల వైపు వచ్చే వాటిని అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా నుంచి గోల్నాక మీదుగా అప్జల్‌గంజ్ వైపు మళ్లిస్తున్నారు. వాహనాల రద్దీని తక్కువగా అంచనా వేయటంతో అంబర్‌పేట రోడ్డులో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వారం క్రితం ట్రయల్ వేసిన ట్రాఫిక్ అధికారులు సమస్య తీవ్రతను అంచనా వేయకుండానే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడ్డారు. దీంతో రోడ్లన్నీ పెద్ద సంఖ్యలో వాహనాలతో నిండిపోయాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ అధికారులు నానా హైరానా పడ్డారు. ఖైరతాబాద్ లో దారి మళ్లింపు.. ఖైరతాబాద్ జంక్షన్లో జరుగుతున్న మెట్రో పనుల నేపథ్యంలో పలు దారులను అధికారులు ఈ రోజు మూసివేశారు. నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడే కేసీపీ గెస్ట్‌హౌజ్ చౌరస్తా నుంచి ఖైరతాబాద్ వెళ్లే వాహనదారులు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద యూ టర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, ఆనంద్ నగర్ కాలనీ శ్రీధర్ ఫంక్షన్ హాల్ నుంచి ఖైరతాబాద్ చౌరస్తాకు వెళ్లే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ తీసుకొని కేసీపీ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకొని ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్ రహదారులకు వెళ్లాల్సి ఉంటుంది. -
ఎన్‌హెచ్-9పై వాహనాల దారి మళ్లింపు
కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో... ఆదివారం ఉదయం నుంచి అమలు విజయవాడ సిటీ(కృష్ణా): విజయవాడ కనకదుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని 9వ నంబర్ జాతీయ రహదారిపై వచ్చే భారీ వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు. జాతీయ రహదారిపై సీతమ్మవారి పాదాల నుంచి భవానీపురం లారీ స్టాండ్ వరకు ఫై ్లఓవర్ నిర్మాణం కోసం శనివారం పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ మీదుగా 9వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను మళ్లిస్తున్నట్టు పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి వాహనాల మళ్లింపు నిబంధనలు అమలులోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, కోల్కత్తా వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట మీదుగా ఖమ్మం-సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, దేవరపల్లి మీదుగా రాజమండ్రి వైపు, చిల్లకల్లు నుంచి వైరా మీదుగా తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, దేవరపల్లి న్యూ బ్రిడ్జి మీదుగా రాజమండ్రి వైపు మళ్లించారు. హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి వద్ద మళ్లించి నల్గొండ మీదుగా మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, అద్దంకి మీదుగా ఒంగోలు వైపు మళ్లించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మేదరమెట్ల జంక్షన్ వద్ద మళ్లించి అద్దంకి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడెం, నల్గొండ మీదుగా నార్కెట్ పల్లి నుంచి హైదరాబాద్ మళ్లించనున్నారు. విశాఖ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను దివాన్‌చెరువు మీదుగా న్యూ బ్రిడ్జి, దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం, సూర్యారావుపేట మీదుగా హైదరాబాద్ వైపు, గుండుగొలను మీదుగా పంగిడిగూడెం, కామవరపుకోట, అశ్వారావుపేట, వైరా మీదుగా ఖమ్మం వైపు, హనుమాన్‌జంక్షన్ మీదుగా నూజివీడు, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వైపు మళ్లిస్తున్నారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, బాపట్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పేరేచర్ల మీదుగా సత్తెనపల్లి, పిడుగురాళ్ల నుంచి మళ్లించనున్నారు. -
‘బతుకమ్మ’ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
* రేపు సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 వరకు * ట్యాంక్‌బండ్, ఎల్బీస్టేడియం కేంద్రంగా అమలు సాక్షి, సిటీబ్యూరో: మధ్య మండల పరిధిలోని ఎల్బీ స్టేడియంతో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్‌పై మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపు నిబంధన విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. ఆ సమయంలో సికింద్రాబాద్, కట్టమైసమ్మ, కవాడీగూడ, ఇక్బాల్మీనార్, ఏఆర్ పెట్రోల్ పంప్, డీజేఆర్ స్టాట్యూ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, పోలీసు కంట్రోల్ రూమ్, నాంపల్లి, హిమాయత్‌నగర్ వై జంక్షన్, పంజగుట్ట, రాజ్‌భవన్, బుద్ధభవన్ వైపునకు ప్రయాణించే వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని కమిషనర్ కోరారు. కార్యక్రమాలకు హాజరయ్యే ఆహుతులు తమకు జారీ చేసిన పాసుల శ్రేణిని బట్టి నిర్ణీత ప్రాంతాల్లో ఆపి దిగిపోవడంతో పాటు కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కారు పాసుల్లేని వాహనాలను ట్రాఫిక్ మళ్లింపులు ఉన్న ప్రాంతాలు దాటి రావడానికి అనుమతించరు. చిల్డ్రన్ పార్క్ జంక్షన్ దాటి, ఎల్బీ స్టేడియం నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ మధ్య ఉన్న బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ స్టాట్యూ మధ్య వాహనాలను అనుమతించరు. ఆహుతులు తమ డ్రైవర్ నెంబర్లను దగ్గర ఉంచుకుని, కార్యక్రమం ముగిసిన తర్వాత మాత్రమే నిర్ణీత ప్రాంతాలకు కార్లను పిలిపించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. బతుకమ్మ సంబరాలకు భారీ బందోబస్తు ఖైరతాబాద్: బతుకమ్మ సంబరాలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు, 20మంది సీఐలు, 60మంది ఎస్ఐలతో పాటు మొత్తం 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 200 మంది మహిళలతో పాటు 10 వేల మంది మహిళా పొదుపు సంఘాల మహిళలు మొత్తం 12వేల మంది మహిళలు లాల్‌బహదూర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. వీరితో పాటు రాజకీయ, ఇతర ప్రముఖులు, నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా ప్రత్యేక శకటాలు లాల్‌బహదూర్ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రదర్శనగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో 20వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ ఘాట్లకు రూ.70లక్షలు బంజారాహిల్స్: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్ రోడ్, ట్యాంక్‌బండ్ పైన ఉన్న బతుకమ్మ ఘాట్లలో బతుకమ్మ నిమజ్జనాలు చేసేందుకు ఏడు ఘాట్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రూ.70లక్షల నిధులు వెచ్చిస్తున్నట్లు జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ కిషన్ తెలిపారు. ఈ ఘాట్లలో పరిశుభ్రమైన నీరు ఉండే విధంగా చెత్తను తొలగిస్తున్నామని రోడ్డు మరమ్మతులు చేపట్టి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన నీళ్లలో బతుకమ్మ నిమజ్జనం చేసే విధంగా కొన్ని చోట్ల టబ్‌ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రానికి ఘాట్ల వద్ద పూర్తి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. -
రేపటి నుంచి నుంచి తార్నాకలో ట్రాఫిక్ డైవర్షన్
నల్లకుంట (హైదరాబాద్): తార్నాక సిగ్సల్స్ వద్ద (ఫ్లై ఓవర్) శనివారం నుంచి ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నట్ల్లు సుల్తాన్ బజార్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ ప్రేమ్ కాజల్ చెప్పారు. తార్నాక చౌరస్తాలో సిగ్నల్స్ కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులుతలెత్తుతున్నాయన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకే శనివారం నుంచి ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ డైవర్షన్‌కు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు వాహనదారులు సహకరించాలని కోరారు. శుక్రవారం హరిత హారంలో భాగంగా నల్లకుంట ట్రాఫిక్ పీఎస్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు వెల్లడించారు. ఓయూ నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనాలు తార్నాక సిగ్నల్స్ వద్ద నుంచి లెఫ్ట్ తీసుకుని మెట్టుగూడ వైపు కొద్ది దూరం ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా లాలాపేట నుంచి ఓయూ వైపు వెళ్లే వాహనదారులు తార్నాక సిగ్నల్స్ నుంచి లెఫ్ట్ తీసుకుని హబ్సిగూడ రోడ్డులో ముందుకు వెళ్లి యూ టర్న్ తీసుకోవాలన్నారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వాహనాలు నేరుగా ఫై ్లఓవర్ పైనుంచి వెళతాయని చెప్పారు. ఉప్పల్ నుంచి వచ్చే వాహదారులు ఎవరైనా ఓయూ వైపు, లేదా లాలాగూడ వైపు వెళ్లాలంటే ఫై ్ల ఓవర్ కింది నుంచి నేరుగా వెళ్లిపోవచ్చునని అన్నారు. ఈ మేరకు దారి మళ్లింపుతో వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. -
నేడు చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష
-
నవనిర్మాణ దీక్షకు భారీ ఏర్పాట్లు
దీక్షకు ప్రదర్శనగా చంద్రబాబు రాక సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల 2 నుంచి చేపడుతున్న నవ నిర్మాణ దీక్షకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సమయంలో, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాదైనా నెరవేర్చలేక విఫలం కావడంతో ఎదురవుతున్న విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలపై నెట్టడానికి ఈ కార్యక్రమాలను ఉపయోగించుకుంటున్నట్లు.. జరుగుతున్న ఏర్పాట్లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్టెల్లా కాలేజీ నుంచి, ప్రజాప్రతినిధులు మిగిలిన మూడు వైపుల నుంచి ర్యాలీగా దీక్షా స్థలానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు, ఉద్యోగులు కూర్చునేందుకు జాతీయ రహదారిపైనే నాలుగువేల కుర్చీలు వేయనున్నారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి ర్యాలీగా దీక్షాస్థలికి చేరుకుంటారు. 9.30 నుంచి 10 గంటల వరకు ముఖ్యమంత్రి మాట్లాడతారు. కాగా, హైవేపై దీక్ష చేపడుతున్న ప్రభుత్వం అందుకు తమ అనుమతి తీసుకోలేదని జాతీయ రహదారులశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
నేడు ట్రాఫిక్ మళ్లింపు
ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు క్రైం : విజయవాడ బెంజ్ సర్కిల్లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం తెలిపారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడవైపు వెళ్లే భారీ వాహనాలు, లారీలను ఇతర మార్గాలకు మళ్లిస్తూ చర్యలు చేపట్టామన్నారు. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం నవనిర్మాణ దీక్ష పూర్తయ్యే వరకు రాకపోకలకు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామన్నారు. చెన్నై నుంచి కలకత్తా వైపు వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లాలోని త్రోవకుంట, చదలవాడ, నాగులుప్పలపాడు, చినగంజాం, చీరాల, ఈపూరుపాలెం, బాపట్ల, కర్లపాలెం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా కృష్ణాజిల్లా చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ చేరుకుని జాతీయ రహదారి 16 మీదుగా కలకత్తా వైపు వెళ్లాలని చెప్పారు. కలకత్తా నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కూడా ఇదే మార్గంలో మళ్లిస్తామని చెప్పారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళ, దాచేపల్లి, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటాయని చెప్పారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గం వైపు మళ్లిస్తున్నామన్నారు. గుంటూరు నుంచి కలకత్తా వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు, నారాకోడూరు, బాపట్ల, కర్లపాలెం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జి, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ చేరుకుని కలకత్తా వైపునకు వెళ్లాలని సూచించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, దాచేపల్లి, మిర్యాలగూడ వైపుగా హైదరాబాద్ వెళ్లాలని వివరించారు. ట్రాఫిక్ మళ్లింపు కారణంగా వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. -
బాబు పర్యటనతో నేడు ట్రాఫిక్ మళ్లింపు
కడప అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర మాజీ మఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా కడప నగరంలో డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ మళ్లింపునకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ స్టేడియంలో నేడు ప్రజాగర్జన బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. కమలాపురం, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల నుంచి వచ్చే టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తమ వాహనాలను బిల్టప్ సమీపంలోని పుత్తా గార్డెన్స్, ఈద్గామైదానం వద్ద పార్కింగ్ చేసి కాలినడకన మున్సిపల్ స్టేడియంకు చేరుకోవాల్సి ఉంటుందని డీఎస్పీ ఆదేశించారు. రాజంపేట, బద్వేలు, రైల్వేకోడూరు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు బైపాస్ ద్వారా దేవునికడప మీదుగా మార్కెట్‌యార్డుకు చేరుకుని అక్కడ వాహనాలు నిలుపాలని సూచించారు. రాయచోటి నియోజకవర్గం నుంచి వచ్చేవారు రైల్వేగేటు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు. -
నేడు ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: శనివారం ఎల్బీస్టేడియంలో జరగనున్న సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. చోటుచేసుకోనున్న మార్పులివే.. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్టేడియం చుట్టుపక్కల ఆంక్షలు ఏఆర్పెట్రోల్ పంప్, పీజేఆర్ విగ్రహం చౌరస్తా మధ్య వాహనాలను అనుమతించరు అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను పీజేఆర్ విగ్రహం వైపు కాక ఎస్బీహెచ్ మీదుగా మళ్లిస్తారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా మళ్లిస్తారు రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలను సిమెట్రీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను కింగ్‌కోఠి క్రాస్‌రోడ్డు నుంచి తాజ్‌మహల్ మీదుగా పంపిస్తారు లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ మీదుగా పంపిస్తారు పోలీస్ కంట్రోల్‌రూమ్ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వాహనాలను అనుమతించరు పీవీ విగ్రహం, తెలుగుతల్లి, అప్పర్‌ట్యాంక్‌బండ్ మార్గాల మీదుగా పాస్ ఉన్నవారినే స్టేడియానికి అనుమతిస్తారు. మిగతా వారి రాకపోకలపై నిషేధం. -
మోడి యువభేరి నేపథ్యం..నేడు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరగనున్న నవభారత యువభేరి నేపథ్యంలో మధ్య మండల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి రానున్న దృష్ట్యా.. స్టేడియం చుట్టూ, దాదాపు మధ్య మండలం మొత్తం మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. శనివారం సాయంత్రమే స్టేడియాన్ని పోలీసులు, భద్రత బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ మళ్లింపులు విధించడంతో పాటు వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆంక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు అమల్లో ఉంటాయని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్‌గార్గ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలు ఇవే.. ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి/రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు అబిడ్స్, గన్‌ఫౌండ్రి వైపు నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్ చౌరస్తా వైపు కాక హైదర్‌గూడ/కింగ్‌కోఠి మీదుగా వెళ్లాలి బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ వెళ్లే వాహనాలను హైదర్‌గూడ/కింగ్‌కోఠి మీదుగా మళ్లిస్తారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాకు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా పంపుతారు రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలు సిమెట్రీ జంక్షన్ నుంచి కింగ్‌కోఠి/నారాయణగూడ వైపు వెళ్లాలి కింగ్ కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వచ్చే వాహనాల్ని కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ హోటల్ వైపు పంపిస్తారు లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు బషీర్‌బాగ్ నుంచి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలి హిల్‌ఫోర్ట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కంట్రోల్ రూమ్ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ వైపు అనుమతించరు అతిథులు, పాస్‌లు కలిగిన వారినే మళ్లింపు ప్రాంతాలు దాటి ముందుకు పంపుతారు పార్కింగ్ ప్రాంతాలు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి వచ్చే డీసీఎం /లారీలను ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆపేస్తారు. సభకు వచ్చే వారు అక్కడ నుంచి కాలినడకన స్టేడియానికి చేరాలి. వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవాలి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చే డీసీఎం/లారీలను నాంపల్లిలోని ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద ఆపేస్తారు. వీటిని ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో నిలపాలి రంగారెడ్డి జిల్లా, నగరం చుట్టుపక్కల నుంచి వచ్చే డీసీఎం/లారీలను పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఆపేస్తారు. పబ్లిక్‌గార్డెన్స్‌లో నిలపాలి ద్విచక్ర, తేలికపాటి, ఇతర వాహనాలను నిజాం కాలేజీ, స్టాన్లీ ఇంజనీరింగ్, ఆలియా కాలేజీ, మహబూబియా కాలేజీల్లో నిలపాలి