నగరంపాలెం: సీఎం వైఎస్ జగన్ మంగళవారం నగర పర్యటన దృష్ట్యా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ మార్గాల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం ప్రయాణించే సమయంలో శ్యామలానగర్, పట్టాభిపురం మెయిన్ రోడ్డులో ట్రాఫిక్‌ను అనుమతించమని పేర్కొన్నారు.
ట్రాఫిక్ మళ్లింపు
► జీటీ రోడ్డులోని మెడికల్ క్లబ్ నుంచి కలెక్టరేట్ వైపు వెళ్లే వాహనాలు, ఎత్తు రోడ్డు సెంటర్, జీటీ రోడ్డులోని ఐటీసీ నుంచి నగరంపాలెం పీఎస్, ఎస్‌బీఐ జంక్షన్ వైపు వాహనాల్ని కూడా మస్తాన్ దర్గా, ఎత్తు రోడ్డు సెంటర్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
► నగరంపాలెం ఎస్‌బీఐ జంక్షన్ నుంచి కంకరగుంట బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాల్ని మెడికల్ కాలేజీ రోడ్డు వైపునకు, ఏటీ అగ్రహారం, కంకరగుంట వైపు నుంచి కలెక్టరేట్ ఎదురు రోడ్డుకు వచ్చే వాటిని కంకరగుంట అండర్ బ్రిడ్జి మీదుగా పట్టాభిపురం వైపు మళ్లిస్తారు.
► కలెక్టరేట్ నుంచి కంకరగుంట బ్రిడ్జి మీదుగా పట్టాభిపురం వైపునకు వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు.
► పట్టాభిపురం, రవీంద్రనగర్, శ్యామలానగర్, గుజ్జనగుండ్ల మీదుగా కలెక్టరేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను టీజేపీఎస్ కళాశాల వద్ద కంకరగుంట ఫైఓవర్ పైకి మీదకు అనుమతించరు. అండర్ పాస్ ద్వారా కలెక్టరేట్ వైపు అనుమతిస్తారు.
► సీఎం ప్రయాణించే మార్గంలోని శ్యామలానగర్ ఒకటి, రెండు, మూడో రోడ్ల వద్ద ట్రాఫిక్ అంక్షలు ఉంటాయి. శ్యామలానగర్ రైల్వేగేటు నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంటు సెంటర్ వైపు వచ్చే వాహనాల్ని అందుబాటులో ఉన్న మార్గాల వైపు మళ్లిస్తారు.
► హౌసింగ్ బోర్డ్, ఎన్జీవో కాలనీ నుంచి శ్యామలానగర్ రైల్వేగేటు వైపు వచ్చే వాహనాలు నల్లపాడు నుంచి చుట్టుగుంట వైపు వెళ్లే రోడ్డును వినియోగించాలి.
► శ్యామలానగర్ గేటు వైపు వచ్చే వారు దాటకుండా, ఆర్.అగ్రహారం పక్కనున్న రోడ్డు ద్వారా కంకరగుంట అండర్ పాస్‌కు వెళ్లి, అక్కడ నుంచి పట్టాభిపురం వైపు, మరో అండర్ పాస్ ద్వారా కలెక్టరేట్ వైపు మళ్లాలి.
Comments
Please login to add a commentAdd a comment