సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరగనున్న నవభారత యువభేరి నేపథ్యంలో మధ్య మండల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి రానున్న దృష్ట్యా.. స్టేడియం చుట్టూ, దాదాపు మధ్య మండలం మొత్తం మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. శనివారం సాయంత్రమే స్టేడియాన్ని పోలీసులు, భద్రత బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ మళ్లింపులు విధించడంతో పాటు వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆంక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు అమల్లో ఉంటాయని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్‌గార్గ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆంక్షలు ఇవే..
ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి/రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు
అబిడ్స్, గన్‌ఫౌండ్రి వైపు నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్ చౌరస్తా వైపు కాక హైదర్‌గూడ/కింగ్‌కోఠి మీదుగా వెళ్లాలి
బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ వెళ్లే వాహనాలను హైదర్‌గూడ/కింగ్‌కోఠి మీదుగా మళ్లిస్తారు
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాకు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా పంపుతారు
రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలు సిమెట్రీ జంక్షన్ నుంచి కింగ్‌కోఠి/నారాయణగూడ వైపు వెళ్లాలి
కింగ్ కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వచ్చే వాహనాల్ని కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ హోటల్ వైపు పంపిస్తారు
లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు
బషీర్‌బాగ్ నుంచి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలి
హిల్‌ఫోర్ట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కంట్రోల్ రూమ్ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ వైపు అనుమతించరు
అతిథులు, పాస్‌లు కలిగిన వారినే మళ్లింపు ప్రాంతాలు దాటి ముందుకు పంపుతారు
పార్కింగ్ ప్రాంతాలు
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి వచ్చే డీసీఎం /లారీలను ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆపేస్తారు. సభకు వచ్చే వారు అక్కడ నుంచి కాలినడకన స్టేడియానికి చేరాలి. వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవాలి
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చే డీసీఎం/లారీలను నాంపల్లిలోని ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద ఆపేస్తారు. వీటిని ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో నిలపాలి
రంగారెడ్డి జిల్లా, నగరం చుట్టుపక్కల నుంచి వచ్చే డీసీఎం/లారీలను పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఆపేస్తారు. పబ్లిక్‌గార్డెన్స్‌లో నిలపాలి
ద్విచక్ర, తేలికపాటి, ఇతర వాహనాలను నిజాం కాలేజీ, స్టాన్లీ ఇంజనీరింగ్, ఆలియా కాలేజీ, మహబూబియా కాలేజీల్లో నిలపాలి
మోడి యువభేరి నేపథ్యం..నేడు ట్రాఫిక్ మళ్లింపు
Published Sun, Aug 11 2013 1:26 AM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM
Advertisement