Navabharata yuvabheri
-
శతమానం భారతి: నవ భారతం
2014లో ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన మోదీ, ‘నవభారతం’ నిర్మించేందుకు కంకణబద్ధులయ్యారు. ‘అందరి సహకారం–అందరి కృషి–అందరి ప్రగతి–అందరి విశ్వాసం’ అనే సూత్రంతో ఆయన పని చేస్తున్నారు. మోదీ తొలిదఫా ప్రభుత్వం పునరుజ్జీవం, పునరుత్తేజంపై సంపూర్ణంగా దృష్టి సారించి, సంస్కరణల ద్వారాలు పూర్తిగా తెరిచింది. పేదలకు ప్రయోజనాల కల్పన దిశగా తొలి మార్గంకింద ‘జనధన్' యోజన, ఆధార్ బలోపేతం, మొబైల్‌ఫోన్ వినియోగం’ అమలులోకి వచ్చాయి. ‘పెన్షన్లు, రేషన్, ఇంధనం, అర్హులైన వారికి సమ్మాన్ 'నిధి’ వంటి లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లోనే జమచేయడానికి వీలు కల్పించే ‘ప్రత్యక్ష లబ్ధి బదిలీ’ (డీబీటీ) అమలులోకి వచ్చింది. ఈ కసరత్తుతో పన్ను చెల్లింపు దారు లైన ప్రజలకు అనుబంధ ప్రయోజనాలు అందివచ్చాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రకరకాల పన్నులున్న నేపథ్యంలో ‘వస్తు సేవల పన్ను’ (జీఎస్టీ) వ్యవస్థ వాటన్నిటినీ ఏకం చేసింది. ఇక మోదీ రెండోదఫా అధికారంలోకి వచ్చాక ప్రపంచ మహమ్మారి పరిస్థితుల్లోనూ ఆర్థిక దిద్దుబాటు వేగం కొనసాగింది. మహమ్మారి సమయంలో ఏ ఒక్కరూ ఆకలిదప్పులతో అల్లాడకుండా చూడాలన్న సంకల్పం సత్ఫలితాలిచ్చింది. ఆ మేరకు దేశంలో దాదాపు 80 కోట్ల మందికి పూర్తిగా 8 నెలలపాటు ఆహారధాన్యాలు ఉచితంగా సరఫరా చేశారు. నాలుగుసార్లు ప్రకటించిన ‘స్వయం సమృద్ధ భారతం’ ప్యాకేజీలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు వర్తకులు, చిరుద్యోగులకు సకాలంలో చేయూతనిచ్చారు. ఇవే కాదు, రానున్న ఏళ్లలో ప్రజలతో మమేకమైన మరిన్ని పురోగతి ప్రణాళికలు తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: గుజరాత్ అల్లర్లు: మోదీ వ్యతిరేక పిటిషన్ కొట్టివేత) -
‘294 స్థానాల్లో పోటీకి బీజేపీ సిద్ధం’
ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేసేందుకు భారతీయ జనాతా పార్టీ(బీజేపీ) సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలో జిల్లాల్లో నిర్వహించే ‘నవభారత యువభేరీ’ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ యువభేరీని నిర్వహిస్తామన్నారు. గత వారం హైదరాబాద్‌లో చేపట్టిన సభకు అపూర్వమైన ఆదరణ వచ్చిన విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, 294 స్థానాల్లోనూ పోటీకి దిగుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్ కోసం ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్ లో సభను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
జనభేరి
ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం కాషాయవర్ణమైంది. ‘యువభేరి’కి యువత హోరెత్తింది. వెల్లువలా తరలివచ్చిన జనంతో స్టేడియం కిక్కిరిసింది. ఆదివారం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘నవభారత యువభేరి’ జరిగింది. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన ప్రసంగం వినేందుకు జనం ఆసక్తి చూపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘నవభారత యువభేరి’ సభకు హాజరైన జనం.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీ ‘నవభారత యువభేరి’ సభకు హాజరైన జనం.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీసుస్వాగతం: ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయంలో మోడీ అభివాదంకేశవ్ మెమోరియల్ ఐటీలో మోడీ చిత్రపటాన్ని ఆయనకే బహూకరిస్తున్న విద్యార్థిని సభకు హాజరైన జనం.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీ సభకు హాజరైన యువతులు మోడీ. వేదికపై దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, కిషన్రెడ్డిఆదివారం హైదరాబాద్‌లో కేశవ్ స్మారక పాఠశాలలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న గుజరాత్ సీఎం నరేంద్రమోడీ స్టేడియంలో మహిళల నృత్యాలు... యువభేరీ సభలో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి వచ్చిన మేరీబెల్ను వేదికపైకి ఆహ్వానించి పాదాభివందనం చేస్తున్న మోడీ. చిత్రంలో పార్టీ నేతలు కె.లక్ష్మణ్, దత్తాత్రేయ తదితరులు స్టేడియం నిండిపోవడంతో బయట ఏర్పాటు చేసిన తెరపై మోడీ ప్రసంగం చూస్తూ...మోడీని కలిసిన ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ. చిత్రంలో యెండల, వెంకయ్య తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలో యువత... యువత కేరింత... ఎ గేట్ వద్ద తొక్కిసలాట... వివేకానందుడి వేషధారణలో చిన్నారి సభా ప్రాంగణంలో కాషాయజెండా రెపరెపలు వెళ్లొస్తా...: ఆదివారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో తిరుగుప్రయాణంలో... -
అభివృద్ధి, సుపరిపాలనే ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ రథసారథి నరేంద్ర మోడీ ‘నవభారత యువభేరి’కి రంగం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాదా, వచ్చే ఏడాదా అన్నది తేలని స్థితిలోనే బీజేపీ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ సదస్సు నుంచే ఎన్నికల ప్రచార నగారా మోగించనుంది. అభివృద్ధి, సుపరిపాలన, అధిక ధరలు, యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలే ఎన్నికల ఎజెండాగా దేశవ్యాప్తంగా నిర్వహించే వంద సదస్సుల్లో ఇది మొదటిది. మధ్యతరగతిని, ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి కాషాయ దళం దీన్ని ఏర్పాటు చేసింది. సదస్సు వేదిక నుంచే ‘కాంగ్రెస్ విముక్త భారత్’ నినాదాన్ని దేశానికి వినిపించనుంది. దేశానికి తామేం చేయబోతున్నామో వివరించనుంది. ఇప్పుడు కాకుంటే మరెన్నడూ కాదన్న రీతిలో, కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో మోడీ తన కొత్త ఆలోచనలను, ఆకాంక్షలను వెల్లడించనున్నారు. తెలంగాణలో లబ్ధి పొందాలన్న యోచనతో రాష్ట్ర పార్టీ కమిటీ నగరంలో ఈ సదస్సును ఏర్పాటు చేసింది. విస్తృత ఏర్పాట్లు: లక్ష మందితో నిర్వహించాలని భావిస్తున్న సదస్సుకు పార్టీ బీజేపీ రాష్ట్ర శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ల ద్వారా లక్షా 24 వేల మందికి ప్రతినిధి కార్డులు జారీ చేసింది. పార్కింగ్, ఇతర ఏర్పాట్ల కోసం చుట్టుపక్కలున్న నిజాం కళాశాల గ్రౌండ్స్, మహబూబియా కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ఎన్టీఆర్ స్టేడియాలను(ఇందిరాపార్కు) కూడా తీసుకుంది. పెద్దపెద్ద స్క్రీన్లను, సభాప్రాంగణంలో మూడు భారీ తెరలను అమర్చారు. సభా వేదికకు దారితీసే ఐదు ప్రధాన ద్వారాలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టారు. మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు సీ-బ్యాండ్‌తో అనుసంధాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లాల్లో సినిమా హాళ్లను అద్దెకు తీసుకుని ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలు వెంకయ్య నాయుడు, కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు, నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, నల్లు ఇంద్రసేనారెడ్డి, టి.ఆచారి, వెంకటరెడ్డి తదితరులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సదస్సు గురించి సోషల్ మీడియాలో ప్రచారం కోసం 500 మందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు పార్టీ ప్రధాన ప్రతినిధి ఎన్.రామచంద్రరావు తెలిపారు. ప్రతినిధి కార్డులు తప్పనిసరి... సదస్సు గురించి సామాజిక వెబ్సైట్లలో ప్రచారం కల్పించడంతో ఇతర రాష్ట్రాల నుంచి, అమెరికా, బ్రిటన్ల నుంచి కూడా కొందరు హాజరు కానున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతినిధి కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించనున్నారు. అప్పటికప్పుడు ఈ కార్డులను జారీ చేయడానికి సభాప్రాంగణంలో 20 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇవి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేస్తాయి. ఐదు రూపాయల రుసుం చెల్లించిన వారు ముందే వచ్చి తమ సీట్లలో కూర్చోవాలని నిర్వాహకులు సూచించారు. వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా టార్పాలిన్లు, గొడుగులు సిద్ధం చేసినట్టు సదస్సు ప్రధాన బాధ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వివరించారు. -
మోడి యువభేరి నేపథ్యం..నేడు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరగనున్న నవభారత యువభేరి నేపథ్యంలో మధ్య మండల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి రానున్న దృష్ట్యా.. స్టేడియం చుట్టూ, దాదాపు మధ్య మండలం మొత్తం మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. శనివారం సాయంత్రమే స్టేడియాన్ని పోలీసులు, భద్రత బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ మళ్లింపులు విధించడంతో పాటు వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆంక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు అమల్లో ఉంటాయని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్‌గార్గ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలు ఇవే.. ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి/రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు అబిడ్స్, గన్‌ఫౌండ్రి వైపు నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్ చౌరస్తా వైపు కాక హైదర్‌గూడ/కింగ్‌కోఠి మీదుగా వెళ్లాలి బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ వెళ్లే వాహనాలను హైదర్‌గూడ/కింగ్‌కోఠి మీదుగా మళ్లిస్తారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాకు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా పంపుతారు రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలు సిమెట్రీ జంక్షన్ నుంచి కింగ్‌కోఠి/నారాయణగూడ వైపు వెళ్లాలి కింగ్ కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వచ్చే వాహనాల్ని కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ హోటల్ వైపు పంపిస్తారు లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు బషీర్‌బాగ్ నుంచి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలి హిల్‌ఫోర్ట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కంట్రోల్ రూమ్ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ వైపు అనుమతించరు అతిథులు, పాస్‌లు కలిగిన వారినే మళ్లింపు ప్రాంతాలు దాటి ముందుకు పంపుతారు పార్కింగ్ ప్రాంతాలు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి వచ్చే డీసీఎం /లారీలను ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆపేస్తారు. సభకు వచ్చే వారు అక్కడ నుంచి కాలినడకన స్టేడియానికి చేరాలి. వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవాలి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చే డీసీఎం/లారీలను నాంపల్లిలోని ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద ఆపేస్తారు. వీటిని ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో నిలపాలి రంగారెడ్డి జిల్లా, నగరం చుట్టుపక్కల నుంచి వచ్చే డీసీఎం/లారీలను పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఆపేస్తారు. పబ్లిక్‌గార్డెన్స్‌లో నిలపాలి ద్విచక్ర, తేలికపాటి, ఇతర వాహనాలను నిజాం కాలేజీ, స్టాన్లీ ఇంజనీరింగ్, ఆలియా కాలేజీ, మహబూబియా కాలేజీల్లో నిలపాలి