‘294 స్థానాల్లో పోటీకి బీజేపీ సిద్ధం’
ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేసేందుకు భారతీయ జనాతా పార్టీ(బీజేపీ) సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలో జిల్లాల్లో నిర్వహించే ‘నవభారత యువభేరీ’ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ యువభేరీని నిర్వహిస్తామన్నారు. గత వారం హైదరాబాద్‌లో చేపట్టిన సభకు అపూర్వమైన ఆదరణ వచ్చిన విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, 294 స్థానాల్లోనూ పోటీకి దిగుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్ కోసం ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్ లో సభను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.