Hyderabad CP Anjani Kumar Said All Flyovers To Be Closed To Night For Shab-E-Meraj (Jagne ki Raat) - Sakshi
Sakshi News home page

జగ్‌నేకీ రాత్‌ నేపథ్యంలో.. ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Thu, Mar 11 2021 10:12 AM | Last Updated on Thu, Mar 11 2021 2:18 PM

​Hyderabad : Flyovers Closed Tonight Due To Jagneki Rath - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జగ్‌నేకీ రాత్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నగరంలోని ఫ్లైఓవర్లను గురువారం అర్ధరాత్రి నుంచి మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కొత్వాల్‌ అంజనీకుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇవి అమలులో ఉంటాయి. గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్లతో పాటు పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు.

మరోవైపు  స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటి నేపథ్యంలో ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజ్‌ ఐలాండ్, ఛాపెల్‌ రోడ్‌ టీ జంక్షన్, ఓల్డ్‌ సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్, బషీర్‌బాగ్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్, ఏఆర్‌ పెట్రోల్‌ పంపుల నుంచి వాహనాలను మళ్లిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement