అమీర్‌పేటలో ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్: అమీర్‌పేటలోని సారథి స్టూడియో, యూసుఫ్‌గూడ మధ్య జరుగుతున్న మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు భారీ వాహనాలకు నిబంధనలు వర్తిస్తాయి. మిగిలిన వాహనాలన్నీ యథావిధిగా యూసుఫ్‌గూడ వైపు వెళ్ళోచ్చు.
* అమీర్‌పేట, పంజగుట్ట, సత్యం థియేటర్ వైపు నుంచి యూసుఫ్‌గూడ వెళ్లే వాహనాలు ఎస్సార్‌నగర్ జంక్షన్, వెంగళ్‌రావు నగర్, కళ్యాణ్‌నగర్, సాయిబాబా దేవాలయం, కృష్ణకాంత్ పార్క్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం, యూసుఫ్‌గూడ బస్తీ చౌరస్తా మీదుగా వెళ్లాలి.
* మళ్లింపులు వర్తించే బస్సుల రూట్ నెంబర్లు: 19 వై/ఎఫ్, 10 హెచ్, 10 వై/ఎఫ్, 19 ఎస్/ఎఫ్, 113 వై/ఎఫ్, 45ఏ, 47 ఎఫ్, 47 కే