ప్రపంచంలో బెస్ట్ టీచర్ ఆయన: నటి | Kajol celebrates Teachers Day in different manner | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో బెస్ట్ టీచర్ ఆయన: నటి

Published Tue, Sep 5 2017 3:56 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

ప్రపంచంలో బెస్ట్ టీచర్ ఆయన: నటి

ప్రపంచంలో బెస్ట్ టీచర్ ఆయన: నటి

నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమకు విద్యాబుద్ధులు, ఎన్నో విషయాలు నేర్పించిన గురువులను స్మరించుకుంటూ గౌరవించుకుంటాం.

ముంబయి: నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమకు విద్యాబుద్ధులు, ఎన్నో విషయాలు నేర్పించిన గురువులను స్మరించుకుంటూ గౌరవించుకుంటాం. మన నిత్య జీవితంలో గురువుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నది అక్షరసత్యం. బాలీవుడ్ నటి కాజోల్ మాత్రం టీచర్స్‌డే ను భిన్నంగా జరుపుకున్నారు. గణనాథుడికి టీచర్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప టీచర్ ఆయనే అంటూ గణనాథునితో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

విగ్రహం వద్ద చిరునువ్వులు చిందిస్తూ సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ నటించిన భజరంగీ బాయ్‌జాన్ లోని సెల్ఫీ లే లే పాటను తన సెల్ఫీ క్యాప్షన్‌లో కాజోల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే గొప్ప గురువు వినాయకుడంటూ గణేష్ నిమజ్జనం రోజున నటి చేసిన సోషల్ మీడియా పోస్టుపై విపరీతమైన స్పందన వస్తోంది. మన జీవితాంతం గురువు ఎవరైనా ఉన్నారంటే గణనాథుడేనంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు గణేషుడితో నేచురల్ బ్యూటీ, వెరీ నైస్ స్మైల్ అంటూ స్పందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement