
కాజోల్
చిన్నప్పుడు పిల్లలకు అమ్మా, ఆవు అని పలక మీద దిద్దిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల వల్ల తల్లిదండ్రులతో డిజిటల్ పలక (ఐపాడ్, ఐఫోన్)పై కొత్త విషయాలను దిద్దిస్తున్నారు పిల్లలు. బాలీవుడ్ నటి కాజోల్ కూడా తన కూతురు దగ్గర టెక్నాలజీ పాఠాలు కొన్ని నేర్చుకున్నారట. కొన్ని వారాల పాటు కూతురి దగ్గర క్రాష్ కోర్స్ చేశారట. కాజోల్ లేటెస్ట్ సినిమా ‘హెలికాఫ్టర్ ఈల’. ఇందులో న్యూ జనరేషన్ మదర్‌గా యాక్ట్ చేశారామె. దాని కోసం కూతురి దగ్గర ఇన్‌స్టాగ్రామ్, ట్వీటర్ హ్యాష్ ట్యాగ్స్, చాటింగ్‌లో షార్ట్ కట్స్ నేర్చుకున్నారట. ఈ లేటెస్ట్ టెక్నికల్ షార్ట్‌కట్స్‌ను త్వరగానే నేర్చుకోగలిగారట కాజల్. ‘హెలికాఫ్టర్ ఈల’ ఈ నెల 12న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment