గణేష్‌ నిమజ్జనంలో కూతురితో సందడి చేసిన బన్నీ | Allu Arjun Joins In Lord Ganesh Immersion Ceremony With Daughter Arha | Sakshi
Sakshi News home page

Allu Arjun-Ganesh Immersion: గణేష్‌ నిమజ్జనంలో కూతురితో సందడి చేసిన బన్నీ

Published Mon, Sep 5 2022 9:08 PM | Last Updated on Mon, Sep 5 2022 9:25 PM

Allu Arjun Joins In Lord Ganesh Immersion Ceremony With Daughter Arha - Sakshi

గణేష్‌ నిమజ్జనం కార్యక్రమంలో కూతురు అర్హతో కలిసి సందడి చేశాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. వినాయ చవితి సందర్భంగా ఆగస్ట్‌ 31న జూబ్లిహిల్స్‌లోని గీతా ఆర్ట్స్‌ భవనంలో నెలకొల్పిన గణేషునికి నేడు విడ్కోలు పలికారు. ఈ నిమజ్జనం కార్యక్రమంలో బన్నీ తన కూతురు ఆర్హతో కలిసి పాల్గొన్నాడు.

చదవండి: బిగ్‌బాస్‌పై సింగర్‌ స్మిత సంచలన వ్యాఖ్యలు.. ‘చచ్చినా ఆ తప్పు చేయను’

ఇక ఈ వేడుకులో గణపతికి వీడ్కోలు చెబుతూ బన్నీ కొబ్బరి కాయ కొట్టగా.. అర్హ గణపతి బప్పా మోరియా అంటూ సందడి చేసింది. ఇక కూతురిని ఎత్తుకుని మురిసిపోతూ బన్నీ డాన్స్‌ చేసిన ఈ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో, ఫొటోలు అల్లు ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా బన్నీ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. 

చదవండి: తిరుమల కొండపై నటి అర్చనా రచ్చ.. స్పందించిన టీటీడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement