
కోలార్ : కర్ణాటక కోలార్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. క్యేశంబల్లా సమీపంలోని మరదాగట్టు గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. నిమజ్జనం కోసం గణేష్ విగ్రహాన్ని నీటికుంట వద్దకు తీసుకెళ్లిన సమయంలో ముగ్గురు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు చిన్నారులు కూడా అందులోకి దిగారు. దీనిని గమనించిన గ్రామస్తులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
అయితే ముగ్గురు పిల్లలు ఘటన స్థలంలోనే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులను చిన్నారులు తేజసి, రక్షిత, రోహిత్, వైష్ణవి, ధనుష్, వీణలుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment