children deid
-
భార్య మరణం తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, తను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. ఈ విషాద ఘటన అనకాపల్లి ముత్రాసు కాలనీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కిర సత్యనారాయణ, పుష్పలత దంపతులు ముత్రాసు కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే గతేడాది నవంబర్లో పుష్పలత అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి భర్త సత్యనారాయణ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. అయితే మంగళవారం కూడా మనస్తాపం చెందిన సత్యనారాయణ తన పిల్లలకు విషం ఇచ్చి, తర్వాత ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సత్యనారాయణకు పదేళ్ల కుమారుడు లోకేశ్, తొమ్మిదేళ్ల కూతురు తేజశ్రీ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: బాలికను కిడ్నాప్ చేసి బిక్షాటన, మాట వినకపోవడంతో -
జాతరకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
నర్సాపూర్ రూరల్: శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లి దాచారం నుంచి నర్సాపూర్ వైపు బైక్పై వస్తుండగా కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా, నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘటన సోమవారం నర్సాపూర్– హైదరాబాద్ రహదారిలోని సబ్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై గంగరాజు కథనం మేరకు.. గుమ్మడిదల మండలం దాచారం గ్రామానికి చెందిన సంగని నరేశ్ (26)వరుసకు అల్లుళ్లు అయిన చంటిబాబు (15), లక్ష్మినర్సింహ (12), భానుచందర్ (10), అఖిల్ (8)లను బైక్పై ఎక్కించుకొని జాతరకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నర్సాపూర్ వస్తుండా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలైయ్యాయి. వీరిని వెంటనే 108 అంబున్స్లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడికి భార్య మంజుల ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నరేశ్ శవాన్ని పోస్టు మార్టం కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనట్లు తెలిపారు.కారు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చదవండి : (తండ్రి మృతి..అప్పులు తీర్చలేక కొడుకు ఆత్మహత్య) (వయసు ఎక్కువ ఉందని విద్యార్థి ఆత్మహత్య) -
నిమజ్జనంలో అపశ్రుతి.. 6గురు చిన్నారుల మృతి
కోలార్ : కర్ణాటక కోలార్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. క్యేశంబల్లా సమీపంలోని మరదాగట్టు గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. నిమజ్జనం కోసం గణేష్ విగ్రహాన్ని నీటికుంట వద్దకు తీసుకెళ్లిన సమయంలో ముగ్గురు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు చిన్నారులు కూడా అందులోకి దిగారు. దీనిని గమనించిన గ్రామస్తులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ముగ్గురు పిల్లలు ఘటన స్థలంలోనే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులను చిన్నారులు తేజసి, రక్షిత, రోహిత్, వైష్ణవి, ధనుష్, వీణలుగా గుర్తించారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
తాడిపత్రి: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి బకెట్లో పడి మృతి చెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దలవిన్న గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రసాద్, లక్ష్మీ దంపతులకు రెండేళ్ల చిన్నారి నవిత. ఈ రోజు ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశత్తూ నీటి బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. తండ్రి వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో తల్లి ఇంటి పని చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.