
సాక్షి, విశాఖపట్నం: ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, తను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. ఈ విషాద ఘటన అనకాపల్లి ముత్రాసు కాలనీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కిర సత్యనారాయణ, పుష్పలత దంపతులు ముత్రాసు కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే గతేడాది నవంబర్‌లో పుష్పలత అనారోగ్యంతో మృతి చెందారు.
దీంతో అప్పటి నుంచి భర్త సత్యనారాయణ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. అయితే మంగళవారం కూడా మనస్తాపం చెందిన సత్యనారాయణ తన పిల్లలకు విషం ఇచ్చి, తర్వాత ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సత్యనారాయణకు పదేళ్ల కుమారుడు లోకేశ్, తొమ్మిదేళ్ల కూతురు తేజశ్రీ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment