![Hyderabad Ganesh Immersion: Two Boys Died - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/29/Hyderabad-Ganesh-Immersion.jpg.webp?itok=tKvkwLIU)
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సంజీవయ్య పార్క్ వద్ద బాలుడు మృతిచెందాడు. గణనాథుడిని తీసుకొస్తున్న లారీ టైర్ కిందపడి బాలుడు మృతిచెందాడు. మృతిచెందిన మైనర్ కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణిత్‌కుమార్‌గా గుర్తించారు.
మరో ప్రమాదంలో..
బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ సమీపంలో లారీ టైర్ కింద పడి ఒకరు మృతిచెందారు. సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబం.. నిమజ్జనం చేయడానికి బైక్‌పై వస్తుండగా, బైక్ స్కిడ్ కావడంతో కుటుంబసభ్యులు కిందపడ్డారు. నాలుగేళ్ల ఆయుష్‌పై నుంచి టక్కర్ వాహనం వెళ్లడంతో నిలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు?
Comments
Please login to add a commentAdd a comment