Sanjeevaiah Park
-
హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సంజీవయ్య పార్క్ వద్ద బాలుడు మృతిచెందాడు. గణనాథుడిని తీసుకొస్తున్న లారీ టైర్ కిందపడి బాలుడు మృతిచెందాడు. మృతిచెందిన మైనర్ కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణిత్‌కుమార్‌గా గుర్తించారు. మరో ప్రమాదంలో.. బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ సమీపంలో లారీ టైర్ కింద పడి ఒకరు మృతిచెందారు. సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబం.. నిమజ్జనం చేయడానికి బైక్‌పై వస్తుండగా, బైక్ స్కిడ్ కావడంతో కుటుంబసభ్యులు కిందపడ్డారు. నాలుగేళ్ల ఆయుష్‌పై నుంచి టక్కర్ వాహనం వెళ్లడంతో నిలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
హైదరాబాద్: సంజీవయ్య పార్కులో వింటేజ్ వాహనాల ప్రదర్శన (ఫోటోలు)
-
జీహెచ్ఎంసీ సిబ్బందితో కేటీఆర్ లంచ్
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్లో సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ శానిటేషన్, డీఆర్ఎఫ్, ఎంటమాలజీ క్షేత్రస్థాయి సిబ్బందితో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు. సంజీవయ్యపార్క్ దగ్గర ఈవీడీఎం యార్డులో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతి ఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ సమయంలో పోలీసులకు దీటుగా పనిచేస్తున్నారని.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ముందుండి సేవలు అందిస్తున్న మునిసిపల్ సిబ్బంది అందరికీ మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ముందుండి పోరాడుతున్న ప్రతిఒక్కరికి చేతులెత్తి సమస్కరిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. (చదవండి: కరోనా: ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్) -
ఈ పార్కులో వారికి నో ఎంట్రీ
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్ సాగర్ తీరాన 92 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంజీవయ్య పార్కు ఇక నుంచి సంజీవయ్య చిల్డ్రన్ పార్కుగా మారనుంది. ఇన్నాళ్లు ప్రేమపక్షుల సందడితో ఉన్న ఈ పార్కులో వారికి ప్రవేశమే లేకుండా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరానికి వచ్చిన ఇతర రాష్ట్రాలు, దేశాల సందర్శకులు సాగర్ తీరాన ఉన్న ఈ పార్కును సందర్శిస్తుండటం, అలాగే పిల్లలతో కలిసి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇక్కడ ప్రేమ జంటలు చేసే చేష్టలపై బీపీపీఏ అధికారులకు ఫిర్యాదులు పోటెత్తడంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఈ పార్కులోకి రోజూ వస్తున్న జంటలు వందల సంఖ్యలో ఉంటున్నాయి. వీరి ప్రవర్తన శృతిమించి తార స్థాయికి వెళ్లడమే కాదు పోలీసు స్టేషన్ల వరకు వెళ్లిన ఫిర్యాదులు అధికారుల్లో మార్పు తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ కేవలం ఆదాయం కోసమే ఈ పార్కులో ఏం జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించిన అధికారులు ఇటీవల బీపీపీఏ ఓఎస్డీగా రాంకిషన్ బాధ్యతలు చేపట్టడంతో అనివార్యంగా మార్పు కనిపించింది. సంజీవయ్య పార్కుతో పాటుగా హెర్బల్ పార్క్, బటర్ ఫ్లై పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మారిస్తే బాగుంటుందన్న ఆయన ప్రతిపాదనను హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ముందుంచడంతో పచ్చజెండా ఊపారు. పిల్లల్లో సైన్స్‌పై ప్రాక్టికల్‌గా అవగాహన కలిగించేందుకు ఇది ఎంతో దోహదం కానుంది. ఇక ఎడ్యుకేషనల్ హబ్‌గా పార్క్... న్యూఢిల్లీలో ఇండియాగేట్ వే దగ్గర ఉన్న చిల్డ్రన్ పార్క్ తరహాలోనే సంజీవయ్య పార్కును చిల్డ్రన్ పార్కుగా మార్చి విద్యార్థుల్లో పర్యావరణంపై మెళకువలు పెంచేవిధంగా బీపీపీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంÜజీవయ్య పార్కుతో పాటుగా హెర్బల్ పార్క్, బటర్ ప్లై పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మార్చారు. కేవలం 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులు లేదంటే సంరక్షకులతో వస్తేనే ఎంట్రీ ఉంటుందని, 14 ఏళ్లలోపు దాటినవారికి ప్రవేశం ఉండదని హెచ్ఎండీఏ కార్యదర్శి, బీపీపీఏ ఓఎస్డీ రాంకిషన్ బుధవారం తెలిపారు. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 ఎంట్రీ ఫీజును వసూలుచేస్తున్నామని, ఇక నుంచి పిల్లలతో వచ్చే వారికి కూడా రూ.10 ఎంట్రీ ఫీజు ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బృందంగా వస్తే ప్రవేశం ఉచితంగా కల్పిస్తాం. విద్యార్థుల్లో మరింత విజ్ఞానాన్ని పెంచేందుకు లాభాపేక్షలేకుండా ఈ పార్కును నిర్వహిస్తాం. సైన్సు పట్ల పిల్లల్లో మరింత జిజ్ఞాస పెంచే విధంగా ఈ పార్కును తీర్చిదిద్ది ముఖ్యంగా విద్యార్ధులు, అధ్యాపకులను ఆకర్శించేందుకు చర్యలు చేపట్టాం. అలాగే ఈ ఉద్యానవనంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం నిషేధించడంతో పాటు, పచ్చదనం–పరిశుభ్రత పట్ల విద్యార్ధుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు ఉంటాయి. బయటి తినుబండారాలను లోనికి అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నామ’ని రాంకిషన్ తెలిపారు. అయితే ప్రస్తుతం రోజుకు 1500 మంది సందర్శకులు వస్తున్నారని గురువారం నుంచి ఈపార్కును పిల్లల కేంద్రంగా మార్చడం వల్ల కొంత ఆదాయంతగ్గినా ఫర్వాలేదని, విద్యార్థుల్లో సైన్స్‌పెంచడమే తమ ప్రాధాన్యత అనిరాంకిషన్ అన్నారు. -
పే...ద్ద జెండాకు ప్రణామం!
సిటీబ్యూరో: ‘హమారా ఇండియా...హమారా హైదరాబాద్...హమారా జెండా..’అంటూ నగరవాసులతో పాటు సిటీ అందాలను చూసేందుకు వచ్చేవారిలో దేశభక్తి వెల్లివిరిసేలా చేస్తోంది నగరంలోని అతిపెద్ద జెండా. సంజీవయ్య పార్కులో గతేడాది జూన్‌లో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఇప్పుడు లక్షలాది మంది సందర్శిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ తీరాన..పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతీయ జెండా రెపరెపలాడుతూ భారతావని కళ్ల ముందు కదలాడుతున్నట్టుగా మురిపిస్తోంది. ఆ జెండా చూసిన ఎవరైనా సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు. దాదాపు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వచ్చే బలమైన గాలులను తట్టుకొని జెండా రెపరెపలాడుతున్న తీరు అద్భుతంగా ఉంది. భారీగా ఖర్చు... గతేడాది జూన్ 2 వతేదీన తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో ఈ అతిపెద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ పతాకం నిర్వహణ బాధ్యతను చూసుకుంటున్న హెచ్ఎండీఏ ఎక్కడా లోటుపాట్లు లేకుండా జాగ్రత్తపడుతోంది. దీని నిర్వహణ కోసం ఏకంగా ఏడాదికి రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వెచ్చిస్తోంది. తరచూ బలమైన గాలులు వీస్తున్నందున ఇక్కడ ప్రతి నెలా రెండు జెండాలు అవసరమవుతున్నాయి. ఒక్కో జెండా కోసం రూ.1.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక విద్యుత్ చార్జీలు, డీజిల్ జనరేటర్ నిర్వహణ, జెండాను ఎత్తడానికి దించడానికి సిబ్బంది, రక్షణ...ఇలా అన్నీ కలిపి నెలకు దాదాపు రూ.3.8 లక్షల వరకు వ్యయమవుతోంది. గతేడాది జూన్ రెండు నుంచి ఇప్పటివరకు దాదాపు 14కుపైగా జెండాలు మార్చారు. రోజుకు షిఫ్ట్‌ల వారీగా ముగ్గురు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇక్కడ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నారు. రెండుసార్లు జాతీయ గీతాలాపన... ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో, మళ్లీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత సిబ్బంది ఈ జెండా వద్ద జనగణమన గీతాలాపన చేస్తారు. ఈ జెండాను చూసేందుకు వచ్చిన సందర్శకులు తమ సెల్ఫోన్లలో జాతీయ గీతం పాటను ఆన్‌చేసి మరీ జెండాకు సెల్యూట్ చేస్తూ తమ గొంతుకను కూడా కలుపుతున్నారు. ఎక్కువగా పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రాంతాల పర్యాటకులు సందర్శిస్తున్నారు. నెలకు దాదాపు లక్ష మందికిపైగా జాతీయ జెండాను చూసేందుకు వస్తున్నారు. సూర్యాపేటలోని డీఆర్డీఏలో పనిచేసే కె.సంజీవరావు తయారుచేసిన ఈ జాతీయ జెండాకు ఎంతో మంది నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక్కో జెండాను రెడీ చేసేందుకు 15 రోజుల సమయం అవసరమని, దాదాపు పదిమంది వర్కర్లు అవసరమవుతారని నిర్వాహకులు తెలిపారు. జాతీయ జెండా నిర్వహణ సంతోషదాయకం... జాతీయ జెండా నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. నెలకు ఒకటి రెండుసార్లు జెండా ఆవిష్కరించేటప్పుడు, దింపేటప్పుడు సిబ్బంది చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. రాత్రి సమయాల్లో వెలుతురులో కనిపించేందుకు జెండా చుట్టూ బల్బులను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచుతాం. ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో జెండా చిరిగిపోయే ఘటనలు చోటుచేసుకుంటాయి. అందుకే అప్రమత్తంగా ఉంటాం. జెండా నిర్వహణ విషయంలో హెచ్ఎండీఏ అధికారుల నుంచి పూర్తి సహకారం ఉంది. జాతీయ జెండాకు సేవ చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నా. – పద్మావతి, జెండా నిర్వాహకురాలు చాలా గర్వంగా ఉంది... ఇంత పెద్ద జాతీయ జెండాను దగ్గరి నుంచి చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. దేశంలోనే అతి పొడవైన జెండాను భాగ్యనగరంలో ఏర్పాటు చేయడమంటే మామూలు విషయం కాదు. ఈ తిరంగాను చూసినప్పుడు మనకు తెలియకుండానే మనసులో దేశభక్తి భావం కలుగుతుంది. గణతంత్ర దినోత్సవానికి ఒకరోజూ ముందు ఈ జెండాను చూడాలనే ఆశతో వచ్చా. భారత్ మాతాకీ జై. – వెంకటేశ్, డిగ్రీ విద్యార్థి -
సంజీవయ్య పార్క్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు
-
సూపర్ మూన్
సిటీలో సూపర్ మూన్ దృశ్యాన్ని చిన్నారులు ఆనందంగా వీక్షించారు. ప్లానెటరీ సొసైటీ ఇండియా, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్ సంజీవయ్య పార్కులోని ఎత్తైన జాతీయ జెండా వద్ద వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సూపర్ మూన్‌ను వీక్షింప చేశారు. ప్లానెటరీ సొసైటీ ఇండియా డెరైక్టర్ రఘునందన్ కుమార్, టీఎస్సీవోఎస్టీ మెంబర్ సెక్రటరీ నాగేష్ కుమార్‌లు మాట్లాడుతూ చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి 14శాతం పెద్దగా, 30శాతం కాంతివంతంగా కనిపించే అరుదైన రోజని తెలిపారు. -రాంగోపాల్‌పేట్ -
పెద్ద జెండా చిరిగిపోయింది!
- వెంటనే కొత్త పతాకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు - భారీ గాలుల తాకిడితో అధికారుల్లో టెన్షన్ సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సంజీవయ్య పార్కులో జూన్ 2న సీఎం కేసీఆర్ ఎగరేసిన అతిపెద్ద జాతీయ పతాకం పది రోజులకే చిరిగిపోయింది. ఈ పతాకం ఏర్పాటు చేసిన సమయంలోనే ముందుజాగ్రత్త చర్యగా రెండు పతాకాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు రెండోదాన్ని ఎగురవేశారు. ఇప్పుడు అది ఎన్ని రోజులుంటుందో తెలియక అధికారుల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆరు జాతీయ పతాకాలను సిద్ధం చేయాలని నిర్ణయించుకుని.. తొలి పతాకాన్ని తయారు చేసిన ఖమ్మంలోని వ్యక్తికి మూడు పతాకాలకు ఆర్డరిచ్చారు. ఇలాంటి భారీ పతాకాలను రూపొందించటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ముంబైలోని సారాబాయి ఫ్లాగ్ కంపెనీకి మరో మూడు జెండాలకోసం ఆర్డర్ ఇచ్చారు. వెంటనే వాటిని పంపాలని కోరడంతో ఆదివారం నాటికి ముంబై నుంచి ఒక పతాకం వచ్చింది. త్వరలో అక్కడి నుంచి మరో రెండు, ఖమ్మం నుంచి మూడు పతాకాలు రానున్నాయి. భారీ వ్యయం ఇక్కడ ఏర్పాటు చేసిన పతాకాన్ని ప్రత్యేక పాలిస్టర్ వస్త్రంతో రూపొందించారు. 72 బై 108 ఫీట్ల మేర ఉన్న ఈ భారీ పతాకానికి రూ.1.15 లక్షల వ్యయమవుతోంది. కొద్దిపాటి చిరుగుతో దాన్ని తొలగిస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. దీంతో నిబంధనల్లో మినహాయింపు మేరకు పాతదాన్ని మరమ్మతు చేసి మరోసారి వాడాలని నిర్ణయించారు. కాగా, పతాకం కోసం ఏర్పాటు చేసిన 291 అడుగుల ఎత్తయిన స్తంభం కూడా తొలుత స్వల్పంగా ఒరిగింది. 11 జాయిం ట్లతో రూపొందిన ఈ భారీ స్తంభం.. ఏర్పాటు సమయంలోనే ఒరిగిందని, ప్రస్తుతం దానికి గాలి వల్ల ఎలాంటి ఇబ్బంది క లగలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పతాకం రాత్రి వేళ చీకటిలో ఉండకూడదనే నిబంధన ఉన్నందున ఒక్కోటి వెయ్యి వాల్టుల సామర్థ్యమున్న ఎనిమిది భారీ లైట్లనుఏర్పాటు చేశారు. దాంతో రాత్రి వేళ కూడా భారీ లైట్ల కాంతితో పతాకం ధగధగలాడుతోంది. -
జాతీయ జెండాకు రూ.1.96 కోట్లు
303 అడుగుల ఎత్తున ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద జాతీయ పతాకం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.96 కోట్లు మంజూరు చేసింది. ట్యాంక్‌బండ్ సమీపంలోని సంజీవయ్య పార్కులో ఈ పతాకాన్ని ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మే 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 303 అడుగుల ఎత్తుండే జెండా పోల్ నిర్మాణ బాధ్యతలను కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సంబంధిత కంపెనీకి ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ సమ్మతి పత్రాన్ని అందజేశారు. దీనికి మంజూరు చేసిన రూ.1.96 కోట్లలో స్కిప్పర్ కంపెనీకి రూ.1.32 కోట్లను కేటాయించారు. మిగతా మొత్తాన్ని పిల్లర్ బేస్ నిర్మాణం, సివిల్ వర్క్స్‌కు వినియోగిస్తారు. -
పల్లె నుంచి పట్నం దాకా..
♦ ఘనంగా రాష్ట్రావతరణ ఉత్సవాలు ♦ వేడుకల నిర్వహణపై సమావేశంలో అధికారులకు సీఎస్ ఆదేశం ♦ ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం ♦ శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్ ♦ సంజీవయ్య పార్కులో అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ ♦ పరేడ్ గ్రౌండ్లో ఉత్సవాలు.. ప్రసంగించనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పల్లె నుంచి పట్నం దాకా జూన్ 2న రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. రాష్ట్రావతరణ ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో శనివారం సచివాలయంలో సీఎస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొలుత గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారన్నారు. తర్వాత ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేసి సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే ఉత్సవాల్లో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి ప్రసంగిస్తారని రాజీవ్‌శర్మ వివరించారు. పురస్కార గ్రిహీతలకు సర్టిఫికెట్ల ప్రదానం, కంటింజెంట్ల మార్చ్ ఫాస్ట్ ఉంటుందన్నారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలని సమాచారశాఖను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో హోర్డిం గ్లు, బెలూన్లు, విద్యుదీకరణ, పరిశుభ్రత, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, అంబులెన్స్‌లు, వైద్య బృందాలు, బారికేడింగ్, అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లు, పుష్పాలంకరణ పనులు చేపట్టాలని సంబంధితశాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మండల కార్యాలయాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాల్లో భారీగా వేడుకలు నిర్వహించాలన్నారు. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో దుస్తుల పంపిణీ, ఆస్పత్రుల్లో పండ్లు, అంధ విద్యార్థులకు పరికరాల పంపిణీ, రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, అధర్ సిన్హా, రామకృష్ణారావు, సునీల్ శర్మ, రాజీవ్ త్రివేది, అదనపు డీజీలు తేజ్‌దీప్ కౌర్ మీనన్, సుదీప్ లక్టాకియా, పర్యాటకశాఖ కార్యదర్శి బి. వెంకటేశం, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
నాడు గనులు... నేడు వనాలు !
కంకర క్వారీలపై పచ్చదనంపరవళ్లు సాగర్ వ్యర్థాలతో అద్భుత నందన వనం హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అద్భుత సృష్టి సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కులో అద్భుత వనాలను ఆవిష్కరించిన హెచ్ఎండీఏ ఇప్పుడు శివారు ప్రాంతాల్లో పచ్చదనాన్ని పరవళ్లు తొక్కించేందుకు సన్నద్ధమైంది. గాజులరామారం సమీపంలోని కంకర క్వారీలను కనుమరుగు చేస్తూ అక్కడ సుందర నందనాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగరం లోపలే కాదు...వెలుపల కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం పనులకు శ్రీకారం చుట్టింది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో భాగంగా బంజారా నాలా, బల్కాపూర్ నాలా, పికెట్ నాలాల ముఖద్వారం వద్ద పేరుకుపోయిన 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా వెలికితీసింది. దీన్ని సంజీవయ్య పార్కులోని డంప్‌సైట్‌లో ఎండబెట్టి ఇందులో 1.5 లక్షల క్యూబిక్ మీటర్లు వ్యర్థాలను నగర శివారులోని గాజులరామారం వద్ద గల కైసర్‌నగర్ సమీపంలోని కంకర క్వారీల కు తరలించింది. డంప్ సైట్ క్వారీ నుంచి వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా, పక్కలకు జారిపోకుండా అడుగున, చుట్టూ సైడ్ వాల్‌కు 90 సెం.మీ.ల మందంతో హెచ్డీపీఈ షీట్ లైనర్ను ఏర్పాటు చే సి జాగ్రత్తలు తీసుకొన్నారు. సాగర్ పూడిక వ్యర్థాలతో ఇక్కడి క్వారీలను నింపి లెవెల్ చేయడంతో సుమారు 2.5 ఎకరాల మేర మైదానం ఏర్పాటైంది. ఈ స్థలాన్ని ఖాళీగా వదిలేకుండా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అక్కడ ఉద్యానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా పవిత్ర వృక్షాలైన మారేడు, వేప, రాగి, మర్రి, కందంబం, పొగడ, పొన్న, అశోక, చింత, కైజీరియా, రోజ్ వుడ్ రకాలకు చెందిన మొక్కలు నాటి రాతి క్యారీల స్థానే అద్భుత ఉద్యానాన్ని సృష్టించింది. కైసర్‌నగర్ వాసులు ఊహించని విధంగా అక్కడ ట్రీ పార్కు రూపుదాలుస్తుండటంతో ముక్కున వేలేసుకొంటున్నారు. సాయంత్రం వేళల్లో వాహ్యాళికి వెళ్లేవారికి అనువుగా పార్కులో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్కులో భారీగా ఎదిగే వృక్షజాతి మొక్కలతో పాటు పర్యాటకుల మదిని దోచేలా వివిధ రకాల రంగు రంగుల పూలమొక్కలను నాటి సందర్శకులు సేదతీరేందుకు అక్కడ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలోని పార్కు చుట్టూ వెదురును పెంచి ట్రీపార్క్‌కు సరికొత్త రూపును అద్దుతుండటంతో శివారు ప్రాంతంలో పచ్చదనం పరవళ్లు తొక్కనుంది. సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కులో అద్భుత వనాలను ఆవిష్కరించిన హెచ్ఎండీఏ ఇప్పుడు శివారు ప్రాంతాల్లో పచ్చదనాన్ని పరవళ్లు తొక్కించేందుకు సన్నద్ధమైంది. గాజులరామారం సమీపంలోని కంకర క్వారీలను కనుమరుగు చేస్తూ అక్కడ సుందర నందనాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగరం లోపలే కాదు...వెలుపల కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం పనులకు శ్రీకారం చుట్టింది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో భాగంగా బంజారా నాలా, బల్కాపూర్ నాలా, పికెట్ నాలాల ముఖద్వారం వద్ద పేరుకుపోయిన 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా వెలికితీసింది. దీన్ని సంజీవయ్య పార్కులోని డంప్‌సైట్‌లో ఎండబెట్టి ఇందులో 1.5 లక్షల క్యూబిక్ మీటర్లు వ్యర్థాలను నగర శివారులోని గాజులరామారం వద్ద గల కైసర్‌నగర్ సమీపంలోని కంకర క్వారీల కు తరలించింది. డంప్ సైట్ క్వారీ నుంచి వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా, పక్కలకు జారిపోకుండా అడుగున, చుట్టూ సైడ్ వాల్‌కు 90 సెం.మీ.ల మందంతో హెచ్డీపీఈ షీట్ లైనర్ను ఏర్పాటు చే సి జాగ్రత్తలు తీసుకొన్నారు. సాగర్ పూడిక వ్యర్థాలతో ఇక్కడి క్వారీలను నింపి లెవెల్ చేయడంతో సుమారు 2.5 ఎకరాల మేర మైదానం ఏర్పాటైంది. ఈ స్థలాన్ని ఖాళీగా వదిలేకుండా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అక్కడ ఉద్యానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా పవిత్ర వృక్షాలైన మారేడు, వేప, రాగి, మర్రి, కందంబం, పొగడ, పొన్న, అశోక, చింత, కైజీరియా, రోజ్ వుడ్ రకాలకు చెందిన మొక్కలు నాటి రాతి క్యారీల స్థానే అద్భుత ఉద్యానాన్ని సృష్టించింది. కైసర్‌నగర్ వాసులు ఊహించని విధంగా అక్కడ ట్రీ పార్కు రూపుదాలుస్తుండటంతో ముక్కున వేలేసుకొంటున్నారు. సాయంత్రం వేళల్లో వాహ్యాళికి వెళ్లేవారికి అనువుగా పార్కులో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్కులో భారీగా ఎదిగే వృక్షజాతి మొక్కలతో పాటు పర్యాటకుల మదిని దోచేలా వివిధ రకాల రంగు రంగుల పూలమొక్కలను నాటి సందర్శకులు సేదతీరేందుకు అక్కడ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలోని పార్కు చుట్టూ వెదురును పెంచి ట్రీపార్క్‌కు సరికొత్త రూపును అద్దుతుండటంతో శివారు ప్రాంతంలో పచ్చదనం పరవళ్లు తొక్కనుంది. -
పార్కుల్లో భద్రతపై ఆరా..!
లుంబినీ, ఎన్టీఆర్, సంజీవయ్య పార్కును పరిశీలించిన నిఘా బృందం అన్ని పార్కుల్లో బయటపడ్డ భద్రతా లోపాలు సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ తీరంలో నిత్యం సందర్శకులతో కిటకిటలాడే లుంబిని పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో ప్రజాభద్రతపై పోలీసు అధికారుల నిఘా బృందం లోతుగా అధ్యయనం చేసింది. లష్కరే తోయిబా, హిజుబుల్ ముజాహిద్దీన్, ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలు మెట్రోపాలిటన్ నగరాల్లో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సాగర్ పరిసరాల్లో సందర్శనీయ ప్రాంతాలైన పార్కుల ను బుధ, గురువారాల్లో సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లుంబినీ, ఎన్టీఆర్గార్డెన్, సంజీవయ్య పార్కుల్లోని భద్రతాపరమైన అనేక లోపాలు బయటపడ్డాయి. లుంబిని లేజర్ షో ప్రాంగణంలో అగ్నిప్రమాదం సంభవిస్తే నివారించేందుకు ఎలాంటి పరికరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిఘా బృందం గుర్తించింది. గతంలో ఇక్కడ తీవ్రవాదులు జరిపిన మారణ హోమంలో 11 మంది అసువులుబాసినా హెచ్ఎండీఏ ప్రజాభద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టక పోవడాన్ని పోలీసు అధికారులు తప్పుబట్టారు. ఎన్టీఆర్ మెమోరియల్ వెనుక సెక్రటేరియట్ వైపు ఉన్న గుడిసెలను వెంటనే తొలగించాలని నిర్ణయించారు. వీఐపీల కదలికలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డుపక్కనే ఉన్న గుడిసెల వల్ల ముప్పు ఉందని నిఘా అధికారులు భావిస్తున్నారు. అలాగే ఐమాక్స్ థియేటర్ వెనుక వైపున ఫెన్షింగ్ పటిష్టంగా లేకపోవడాన్ని నిఘా అధికారులు గుర్తించారు. ఐమాక్స్ థియేటర్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి, అలాగే గార్డెన్ నుంచి థియేటర్ వైపునకు వెళ్లేందుకు మార్గం సులభంగా ఉండటంతో ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సుమారు 90 ఎకరాల విస్తీర్ణం ఉన్న సంజీవయ్య పార్కులో తగినన్ని సీసీ కెమెరాలు లేని విషయాన్ని, అలాగే సాగర్ గట్టు వెంట నిర్మించిన రెయిలింగ్ ఎత్తు చాలా తక్కువ ఉండటాన్ని నిఘా బృందం గమనించింది. పీవీ ఘాట్ వెనుక ప్రాంతంలో పడిపోయిన కాంపౌండ్ వాల్‌ను తిరిగి నిర్మించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. సందర్శకులతో రద్దీగా ఉండే ఈ పార్కుల్లో నామమాత్రంగా సెక్యూరిటీ సిబ్బందిని కొనసాగిస్తున్న తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లకు వస్తున్న వాహనాలపై ఎలాంటి తనిఖీలు చేయకపోవడం, పార్కింగ్ లాట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం వ ంటి లోపాలను అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని సంబధిత అధికారి ఒకరు తెలిపారు. తనిఖీల్లో ఏసీపీ సురేందర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులు, సైఫాబాద్ పోలీసులు, హెచ్ఎండీఏ ఏఓ, రేణుకాశక్తి సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
21న సంజీవయ్య పార్కులో 'యోగా డే'
కాచిగూడ (హైదరాబాద్) : స్థానిక సంజీవయ్య పార్కులో ఈ నెల 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి తెలిపారు. బర్కత్‌పురలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, వాకర్స్, వివిధ యోగా కేంద్రాల నుంచి యోగా దివస్‌లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రకాష్ నడ్డ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న యోగా దినం పాటించనున్న విషయం విదితమే. -
రీబాక్ రన్నింగ్ స్వాడ్
హైదరాబాద్‌లో రీబాక్ ఇండియా రన్నింగ్ స్వాడ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. పరుగులు తీసే మనసున్న వారికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వనుంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 8 నగరాల్లో రన్నింగ్ స్వాడ్ నిర్వహిస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. గచ్చిబౌలి స్టేడియం, నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్క్‌లో ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య ఈ రన్నింగ్ స్వాడ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.