నాడు గనులు... నేడు వనాలు ! | Mining on forests today | Sakshi
Sakshi News home page

నాడు గనులు... నేడు వనాలు !

Published Tue, Feb 23 2016 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

నాడు గనులు... నేడు వనాలు !

నాడు గనులు... నేడు వనాలు !

కంకర క్వారీలపై పచ్చదనంపరవళ్లు
సాగర్ వ్యర్థాలతో అద్భుత నందన వనం
హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అద్భుత సృష్టి

 
సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కులో అద్భుత వనాలను ఆవిష్కరించిన హెచ్‌ఎండీఏ ఇప్పుడు శివారు ప్రాంతాల్లో పచ్చదనాన్ని పరవళ్లు తొక్కించేందుకు సన్నద్ధమైంది. గాజులరామారం సమీపంలోని కంకర క్వారీలను కనుమరుగు చేస్తూ అక్కడ సుందర నందనాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా  నగరం లోపలే కాదు...వెలుపల కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం పనులకు శ్రీకారం చుట్టింది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో భాగంగా బంజారా నాలా, బల్కాపూర్ నాలా, పికెట్ నాలాల ముఖద్వారం వద్ద పేరుకుపోయిన 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా వెలికితీసింది. దీన్ని సంజీవయ్య పార్కులోని డంప్‌సైట్‌లో ఎండబెట్టి ఇందులో 1.5 లక్షల క్యూబిక్ మీటర్లు వ్యర్థాలను నగర శివారులోని గాజులరామారం వద్ద గల కైసర్‌నగర్ సమీపంలోని కంకర క్వారీల కు తరలించింది. డంప్ సైట్ క్వారీ నుంచి వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా, పక్కలకు జారిపోకుండా అడుగున, చుట్టూ సైడ్ వాల్‌కు 90 సెం.మీ.ల మందంతో హెచ్‌డీపీఈ షీట్ లైనర్‌ను ఏర్పాటు చే సి జాగ్రత్తలు తీసుకొన్నారు.

సాగర్ పూడిక వ్యర్థాలతో ఇక్కడి క్వారీలను నింపి లెవెల్ చేయడంతో సుమారు 2.5 ఎకరాల మేర మైదానం ఏర్పాటైంది. ఈ స్థలాన్ని ఖాళీగా వదిలేకుండా హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అక్కడ ఉద్యానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా పవిత్ర వృక్షాలైన మారేడు, వేప, రాగి, మర్రి, కందంబం, పొగడ, పొన్న, అశోక, చింత, కైజీరియా, రోజ్ వుడ్ రకాలకు చెందిన మొక్కలు నాటి రాతి క్యారీల స్థానే అద్భుత ఉద్యానాన్ని సృష్టించింది. కైసర్‌నగర్ వాసులు ఊహించని విధంగా అక్కడ ట్రీ పార్కు రూపుదాలుస్తుండటంతో ముక్కున వేలేసుకొంటున్నారు. సాయంత్రం వేళల్లో వాహ్యాళికి వెళ్లేవారికి అనువుగా పార్కులో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్కులో భారీగా ఎదిగే వృక్షజాతి మొక్కలతో పాటు పర్యాటకుల మదిని దోచేలా వివిధ రకాల రంగు రంగుల పూలమొక్కలను నాటి సందర్శకులు సేదతీరేందుకు అక్కడ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలోని పార్కు చుట్టూ వెదురును పెంచి ట్రీపార్క్‌కు సరికొత్త రూపును అద్దుతుండటంతో శివారు ప్రాంతంలో పచ్చదనం పరవళ్లు తొక్కనుంది.
 
సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కులో అద్భుత వనాలను ఆవిష్కరించిన హెచ్‌ఎండీఏ ఇప్పుడు శివారు ప్రాంతాల్లో పచ్చదనాన్ని పరవళ్లు తొక్కించేందుకు సన్నద్ధమైంది. గాజులరామారం సమీపంలోని కంకర క్వారీలను కనుమరుగు చేస్తూ అక్కడ సుందర నందనాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా  నగరం లోపలే కాదు...వెలుపల కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం పనులకు శ్రీకారం చుట్టింది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో భాగంగా బంజారా నాలా, బల్కాపూర్ నాలా, పికెట్ నాలాల ముఖద్వారం వద్ద పేరుకుపోయిన 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా వెలికితీసింది. దీన్ని సంజీవయ్య పార్కులోని డంప్‌సైట్‌లో ఎండబెట్టి ఇందులో 1.5 లక్షల క్యూబిక్ మీటర్లు వ్యర్థాలను నగర శివారులోని గాజులరామారం వద్ద గల కైసర్‌నగర్ సమీపంలోని కంకర క్వారీల కు తరలించింది. డంప్ సైట్ క్వారీ నుంచి వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా, పక్కలకు జారిపోకుండా అడుగున, చుట్టూ సైడ్ వాల్‌కు 90 సెం.మీ.ల మందంతో హెచ్‌డీపీఈ షీట్ లైనర్‌ను ఏర్పాటు చే సి జాగ్రత్తలు తీసుకొన్నారు. సాగర్ పూడిక వ్యర్థాలతో ఇక్కడి క్వారీలను నింపి లెవెల్ చేయడంతో సుమారు 2.5 ఎకరాల మేర మైదానం ఏర్పాటైంది. ఈ స్థలాన్ని ఖాళీగా వదిలేకుండా హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అక్కడ ఉద్యానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది.

ప్రధానంగా పవిత్ర వృక్షాలైన మారేడు, వేప, రాగి, మర్రి, కందంబం, పొగడ, పొన్న, అశోక, చింత, కైజీరియా, రోజ్ వుడ్ రకాలకు చెందిన మొక్కలు నాటి రాతి క్యారీల స్థానే అద్భుత ఉద్యానాన్ని సృష్టించింది. కైసర్‌నగర్ వాసులు ఊహించని విధంగా అక్కడ ట్రీ పార్కు రూపుదాలుస్తుండటంతో ముక్కున వేలేసుకొంటున్నారు. సాయంత్రం వేళల్లో వాహ్యాళికి వెళ్లేవారికి అనువుగా పార్కులో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్కులో భారీగా ఎదిగే వృక్షజాతి మొక్కలతో పాటు పర్యాటకుల మదిని దోచేలా వివిధ రకాల రంగు రంగుల పూలమొక్కలను నాటి సందర్శకులు సేదతీరేందుకు అక్కడ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలోని పార్కు చుట్టూ వెదురును పెంచి ట్రీపార్క్‌కు సరికొత్త రూపును అద్దుతుండటంతో శివారు ప్రాంతంలో పచ్చదనం పరవళ్లు తొక్కనుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement