జాతీయ జెండాకు రూ.1.96 కోట్లు
303 అడుగుల ఎత్తున ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద జాతీయ పతాకం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.96 కోట్లు మంజూరు చేసింది. ట్యాంక్‌బండ్ సమీపంలోని సంజీవయ్య పార్కులో ఈ పతాకాన్ని ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మే 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 303 అడుగుల ఎత్తుండే జెండా పోల్ నిర్మాణ బాధ్యతలను కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సంబంధిత కంపెనీకి ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ సమ్మతి పత్రాన్ని అందజేశారు. దీనికి మంజూరు చేసిన రూ.1.96 కోట్లలో స్కిప్పర్ కంపెనీకి రూ.1.32 కోట్లను కేటాయించారు. మిగతా మొత్తాన్ని పిల్లర్ బేస్ నిర్మాణం, సివిల్ వర్క్స్‌కు వినియోగిస్తారు.