
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్‌లో సేవలందిస్తున్న జీహెచ్‌ఎంసీ శానిటేషన్, డీఆర్‌ఎఫ్, ఎంటమాలజీ క్షేత్రస్థాయి సిబ్బందితో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు. సంజీవయ్యపార్క్ దగ్గర ఈవీడీఎం యార్డులో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతి ఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో పోలీసులకు దీటుగా పనిచేస్తున్నారని.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ముందుండి సేవలు అందిస్తున్న మునిసిపల్ సిబ్బంది అందరికీ మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ముందుండి పోరాడుతున్న ప్రతిఒక్కరికి చేతులెత్తి సమస్కరిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.
(చదవండి: కరోనా: ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్)
Comments
Please login to add a commentAdd a comment