ghmc workers
-
Meetho Sakshi: జీతాలే పెద్ద సమస్య.. ఒక రోజు సెలవు తీసుకుంటే రెండు రోజుల జీతం కట్
-
KTR : కొత్త ఏడాదిలో జీహెచ్ఎంసీ కార్మికులతో భోజనం చేసిన కేటీఆర్ (ఫొటోలు)
-
చనిపోయిన కార్మికులకు పరిహారం ఇచ్చారా లేదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణలో చనిపోయిన పారిశుధ్య కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఇవ్వాల్సిన రూ.10 లక్షలు ఇచ్చారో లేదో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనల మేరకు ఏ ప్రభుత్వ విభాగం పరిహారం చెల్లించాలి, రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంత మంది కార్మికులు చనిపోయారు, మనుషులతో సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయించే విధానాలను రాష్ట్రంలో నిషేధించారా, ఇప్పటికీ ఈ వృత్తిలో ఎంత మంది ఉన్నారు, వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించారా.. తదితర వివరాలన్నీ సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. గతేడాది డిసెంబర్లో హైటెక్ సిటీ కొండాపూర్‌లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను ధర్మాసనం గతంలో సుమోటోగా విచారణకు స్వీకరించింది. మృతి చెందిన కార్మికులకు రూ.10 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని గతంలో జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది నివేదించారు. పరిహారమివ్వకపోతే తదుపరి విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరు కావాల్సి ఉంటుందని ధర్మాసనం గతంలో ఆదేశించింది. దీంతో సోమవారం కమిషనర్ లోకేష్‌కుమార్ హాజరయ్యారు. చనిపోయిన కార్మికులకు పరిహారమిచ్చే బాధ్యత తమది కాదని వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ నివేదించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. -
ఇద్దరి ప్రాణం తీసిన మ్యాన్ హోల్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ పరిధిలోని సాహెబ్ నగర్లో డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ప్రాణాలు విడిచారు. వాస్తవానికి రాత్రిపూట డ్రైనేజీ క్లీన్ చేసేందుకు అనుమతి లేదు. కాంట్రాక్టర్ బలవంతం చేయడంతో నలుగురు మ్యాన్హోల్లోకి దిగారు. ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా గల్లంతయ్యాడు. శివ మృతదేహాన్ని రెస్క్యూ టీం వెలికితీసింది. అనంతయ్య మృతదేహాం కోసం రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమవారి ప్రాణాలు గాల్లో కలిశాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం ఈ ఘటనపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో డ్రైనేజి క్లీన్ చేసేందుకు అనుమతి లేదనే స్పష్టమైన నిబంధనలు జీహెచ్ఎంసీలో ఉన్నాయన్నారు. అయితే ఉదయం వేళల్లో వాటర్ ప్రవాహం ఎక్కువగా ఉంటుదని.. రాత్రి ప్రవాహం తక్కువ ఉంటుందనే ఉద్ధేశ్యంతోనే ఈ పనికి పూనుకున్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సాహెబ్‌నగర్‌లో ఉద్రిక్తత ఇదిలా ఉండగా వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ కార్మికుల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది. -
చెత్తబండే అంబులెన్స్..
గజ్వేల్: మానవత్వం మంటగలిసింది. ఆపదలో అండగా నిలవాల్సిన అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. ర్యాపిడ్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలిన 9మంది పారిశుధ్య కార్మికులకు తాము రోజూ పనిచేసే చెత్తబండే(ట్రాక్టర్) అంబులెన్స్‌గా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 120 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి దశల వారీగా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే శనివారం శ్రీగిరిపల్లి పీహెచ్సీ వైద్యాధికారుల ఆధ్వర్యంలో 85 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 9మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు మధ్యాహ్నం 12గంటల సమయంలో వారికి తెలియజేశారు. దీంతో ఆందోళనకు గురైన పారిశుధ్య కార్మికులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు సరైన విధంగా స్పందించలేదని సమాచారం. కార్మికులకు తలో రూ.500 చేతుల్లో పెట్టి చెత్త తరలించే ట్రాక్టర్లో ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి వెళ్లాలని సూచించి చేతులు దులుపుకున్నారు. దీంతో కార్మికులు చేసేదిలేక సాయంత్రం ట్రాక్టర్లో ఆర్వీఎం ఆస్పత్రి వద్దకు వెళ్లారు. అయితే ఆస్పత్రి సిబ్బంది వీరిని చేర్చుకోవడానికి నిరాకరించడంతో కార్మికులు ఆస్పత్రి ప్రాంగణంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు మైస రాములు, దళిత సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్, చైర్మన్‌కు సమాచారం ఇచ్చి.. ఇదేం తీరంటూ ప్రశ్నించారు. ఈ పరిణామంతో ఆలస్యంగా స్పందించిన మున్సిపల్ యంత్రాంగం, పాలకవర్గం పారిశుధ్య కార్మికులను రాత్రి 7గంటల తర్వాత ఆస్పత్రిలో చేర్చుకునేలా చేశారు. కాగా, మున్సిపల్ అధికారుల తీరుపై గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమేగాకుండా ఆదివారం ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయం వద్ద తోటి కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన విషయం తెలుసుకొని కమిషనర్ కృష్ణారెడ్డి అక్కడకు చేరుకున్నారు. ట్రాక్టర్లో పారిశుధ్య కార్మికులను తరలించిన ఘటనపై క్షమాపణ చెప్పడంతో ఆందోళనకారులు కొంత శాంతించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్‌చైర్మన్ జకియొద్దీన్‌లు సైతం మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో కార్మికుల ఆందోళన సద్దుమణిగింది. ఇదిలా ఉంటే చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిస్థితిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి తెలుసుకున్నారు. -
ఇది నాకు అతి పెద్ద బహుమతి: శేఖర్ కమ్ముల
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు తమకు శీతల పానియాలు అందిస్తున్నందుకుగానూ గాంధీ ఆస్పత్రి వద్ద ఆయన పేరుతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ట్విటర్ వేదికగా దీనిపై స్పందించిన శేఖర్ కమ్ముల ‘‘ గాంధీ ఆస్పత్రి వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నా కోసం ఇలా చేయటం వెలకట్టలేనిది. ఇది నాకు అతి పెద్ద బహుమతి. నేను చేసిన ఓ పని మిమ్మల్ని కదిలించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ, మీరు రాత్రింబవళ్లు మా కోసం చేస్తున్న దాంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ( రానా పెళ్లిపై సురేష్ బాబు క్లారిటీ ) I'm overwhelmed....... This is a priceless guesture from the GHMC sanitation workers at Gandhi Hospital ......my biggest award. I feel extremely happy that I could do something that touched you but it's nothing compared to what you do for us, day in and day out. pic.twitter.com/EkYAz8Wbnf — Sekhar Kammula (@sekharkammula) May 13, 2020 కాగా, మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న గాంధీ ఆస్పత్రి పరిధిలోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం శీతల పానియాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు శేఖర్ కమ్ముల. దాదాపు 1000 మందికి బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ అందిస్తున్నారు. ఓ నెల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. అంతేకాకుండా కర్నూల్ టౌన్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు కూడా శీతల పానియాలను అందిస్తున్నారాయన. -
జీహెచ్ఎంసీ సిబ్బందితో కేటీఆర్ లంచ్
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్లో సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ శానిటేషన్, డీఆర్ఎఫ్, ఎంటమాలజీ క్షేత్రస్థాయి సిబ్బందితో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు. సంజీవయ్యపార్క్ దగ్గర ఈవీడీఎం యార్డులో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతి ఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ సమయంలో పోలీసులకు దీటుగా పనిచేస్తున్నారని.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ముందుండి సేవలు అందిస్తున్న మునిసిపల్ సిబ్బంది అందరికీ మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ముందుండి పోరాడుతున్న ప్రతిఒక్కరికి చేతులెత్తి సమస్కరిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. (చదవండి: కరోనా: ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్) -
పోలీసు పెట్రోలింగ్ కారు ఢీకొని..
యాకుత్‌పురా: పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీ కొని విధి నిర్వహణలో ఉన్న జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన గురువారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జావీద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సింగరేణి కాలనీకి చెందిన సాయమ్మ (56) గత 25 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ప్రస్తుతం చార్మినార్ జోన్ సర్కిల్–7 రెయిన్‌బజార్ డివిజన్, యాకుత్‌పురా బడాబజార్‌లో విధులు నిర్వహిస్తుంది. గురువారం ఉదయం ఆమె బడాబజార్ బ్రాహ్మణ్‌వాడీ వైపు వెళ్లే రోడ్డును శుభ్ర పరుస్తుండగా... రెయిన్‌బజార్ పీఎస్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నిర్లక్ష్యంగా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని నడుపుతూ సాయమ్మను ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తోటి కార్మికులు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, సర్కిల్–7 డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్, ఏఎంహెచ్ఓ డాక్టర్ జి. విజయ్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుమార్తె యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెయిన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన హెడ్ కానిస్టేబుల్ అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ అందుబాటులో లేనందునే... రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు రాజు గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో మౌలాకా చిల్లా నుంచి ఫోన్లో ఫిర్యాదు అందడంతో అశోక్ వాహనం తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా ప్రమాదానికి కారకుడైన హెడ్ కానిస్టేబుల్ అశోక్‌ను సస్పెండ్ చేస్తూ, రెయిన్‌బజార్ ఇన్స్పెక్టర్కు చార్జ్ మెమో జారీ చేస్తూ నగరపోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.2 లక్షల నష్టపరిహారం... మృతురాలు సాయమ్మ కుటుంబ సభ్యులకు ఉద్యోగం, మేయర్ నిధుల నుంచి రూ.2 లక్షల నష్ట పరిహారం చెల్లించనున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్–7 డిప్యూటీ కమిషనర్ పి.రవీందర్ కుమార్, ఏఎంహెచ్ఓ డాక్టర్ జి. విజయ్ కుమార్ తెలిపారు. -
సమ్మెకు చెక్!
ఔట్సోర్సింగ్ కార్మికులకు బయోమెట్రిక్ హాజరు సమయ పాలనపై దృష్టి జీహెచ్ఎంసీ నిర్ణయం వేతనాల పెంపుపై త్వరలో ఉత్తర్వులు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కార్మికులు భవిష్యత్‌లో సమ్మెలో పాల్గొనకుండా నిషేధం విధించబోతున్నారు. ఔట్సోర్సింగ్ కార్మికుల హాజరు నమోదులో ఇకపై కచ్చితత్వాన్ని పాటించనున్నారు. మాన్యువల్ హాజరుతో పాటు బయోమెట్రిక్నూ అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె సందర్భంగా వేతనాల పెంపునకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ ఉత్తర్వులూ వెలువడనున్నాయి. వేతనాలు పెంచడమే కాదు... సక్రమంగా విధులు నిర్వర్తించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. వెటర్నరీ, రవాణా, ఎంటమాలజీ విభాగాల్లో 24 వేల మందికి పైగా ఔట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. గత నెలలో వారు పది రోజులకు పైగా సమ్మెలో పాల్గొన్నారు. వారి డిమాండ్లపై స్పందించిన సీఎం వేతనాల పెంపునకు హామీ ఇచ్చారు. జూలై 16 నుంచే ఈ పెంపును వర్తింపజేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ జీవో కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇదే జీవోతో పాటు జీహెచ్ఎంసీ కొత్త నిర్ణయాలను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇవీ నిబంధనలు.. ఔట్సోర్సింగ్ కార్మికులకు సాధారణ హాజరుతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి.కార్మికులు పనివేళలను తప్పనిసరిగా పాటిం చాలి. పనిలో అంకితభావం ఉండాలి.శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎస్ఎఫ్ఏ) తమ పరిధిలోని కార్మికులందరి హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవడంతోపాటు వారి ఫొటోలను అప్లోడ్ చేయాలి. తమ పరిధిలోని చెత్తడబ్బాల ఫొటోలను ఏరోజుకారోజు అప్లోడ్ చేయాలి. తద్వారా కార్యాలయం నుంచే ఉన్నతాధికారులు వీటి పరిస్థితిని తెలుసుకునే వీలుంటుంది.ఎంటమాలజీ (దోమల నివారణ విభాగం)లోని కార్మికులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. చెత్తడబ్బాల బదులు వీరు చేసిన పనికి సంబంధించిన చిత్రాలు అప్లోడ్ చేయాలి.ఔట్సోర్సింగ్ కార్మికులు ఎలాంటి సమ్మెల్లోనూ జోక్యం చేసుకోరాదు. స్వచ్ఛ హైదరాబాద్ దిశగా పనిచేయాలి.చెత్త రవాణా వాహనాలకు జీపీఎస్‌ను తప్పనిసరిగా అమర్చాలి. జీపీఎస్ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా డ్రైవర్లు, కార్మికులు బాధ్యత వహించాలి. -
'జీహెచ్ఎంసీ కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు సచివాలయంలో కేసీఆర్‌ను కలసి వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగితే ఎవరూ అడకుండానే జీతాలు పెంచుతామని కేసీఆర్ కార్మికులకు చెప్పారు. జీతాల పెంపు క్రెడిట్ తమకే దక్కాలని కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవపట్టించారని విమర్శించారు. రంజాన్, పుష్కరాలు, బోనాలు జరుగుతున్న సమయంలో సమ్మె చేయడం సమంజసమా? అని కేసీఆర్ కార్మికులను ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లల విద్య కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతామని కేసీఆర్ చెప్పారు. -
కార్మిక నేతలను అరెస్టు చేసిన పోలీసులు
-
GHMC కార్మికుల వేతనాలు పెంపు
-
చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు
హైదరాబాద్ : ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. శనివార కార్మిక సంఘాల ప్రతినిధులతో మరోసారి కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి జరిపిన చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. జీహెచ్ఎంసీ కార్మికుల కనీస వేతనం రూ 10 వేలు ఉండగా, రూ.14 వేలు చేయాలిన కార్మికులు కోరుతుండగా.. రూ.12 వేల మాత్రమే ఇస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో తమ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు కార్మిల సంఘాలు స్పష్టం చేశాయి. -
చీపుర్లకు స్వస్తి.. రోడ్లకు సుస్తీ..
బంజారాహిల్స్ (హైదరాబాద్) : జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరింది. కార్మికులు చీపుర్లకు స్వస్తి పలకడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. టన్నులకొద్దీ చెత్త డంపర్ బిన్ల వద్ద నిండిపోయి రోడ్లను ఆక్రమిస్తోంది. గాలికి చెత్తంతా కొట్టుకొచ్చి ఇళ్లను కూడా ముంచెత్తుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమ్మె పరిష్కార దిశగా ముందుకు సాగకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. జీహెచ్ఎంసీ సర్కిల్ -10 పరిధిలో శుక్రవారం ఒక్కో నోడల్ అధికారి పరిధికి ఒక లారీని కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నా ఇది అమలు కాకపోవడంతో చెత్త సమస్య తీరలేదు. దీంతో వ్యాధులు విజృంభిస్తాయేమోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. అంటువ్యాధులు ప్రబలకముందే అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అత్యధికంగా చెత్తకుప్పలు పేరుకుపోగా ప్రధాన రహదారులకు రెండువైపులా లారీలకొద్దీ చెత్త కనిపిస్తుండటంతో వీవీఐపీలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతమంతా అధ్వాన్నంగా మారింది. -
మహా ‘చెత్త’గా..
అధ్వానంగా పారిశుద్ధ్యం నగర వాసులకు ప్రత్యక్ష నరకం గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వీధులు దుర్గంధభరితం ‘అంటు’కోనున్న ‘వ్యాధులు’ ఇప్పటికే డెంగీ కేసులు నమోదు సిటీబ్యూరో: మహా నగరం నాలుగు రోజులుగా ‘చెత్త’మయమైపోయింది. ఎటు చూసినా కుప్పలుగా చెత్త దర్శనమిస్తోంది. ప్రధాన రహదారులపైన కూడా కొండల్లా పేరుకుపోయింది. జీహెచ్ఎంసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీధులన్నీ చెత్త కుప్పలతో నిండిపోయాయి. ఓ వైపు ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటూ ప్రభుత్వం నగరాన్ని శుభ్రం చేసేందుకు కసరత్తు చేస్తుంటే... మరోవైపు కార్మికుల సమ్మెతో పరిస్థితి అదుపు తప్పింది. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో తొలగించిన చెత్తకు దాదాపు మూడింతలు మళ్లీ పోగయ్యింది. గత నాలుగు రోజులుగా చెత్తను తరలించేవారు లేక నగరం దుర్గంధభరితంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంటువ్యాధులు మొదలయ్యాయి. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈగలు ముసురుతున్నాయి. ఎక్కడికక్కడ కుళ్లిన చెత్తతో పరిస్థితి భయంకరంగా మారుతోంది. వర్షం లేకపోవడం కొంతలో కొంత ఉపశమనం. వర్షం పడితే పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఐదుగురికి పైగా డెంగీబారిన పడ్డారు. మరోవైపు మలేరియా కేసులూ పెరుగుతున్నాయి. రహదారిపైనే... ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లే మార్గంలో అశోక్ నగర్ చౌరస్తా వద్ద మినీ చెత్త తరలింపు కేంద్రం మొత్తం చెత్తతో నిండిపోయింది. దీంతో మిగిలినది రోడ్లపైనే పడేస్తున్నారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఆ మార్గంలో వెళ్లేవారు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితికి ఇది మచ్చుతునక. జీహెచ్ఎంసీలోని ఐదు జోన్లు, 18 సర్కిళ్లు.. దాదాపు 1500 బస్తీలు.. 900 కాలనీల్లో ఇదే దుస్థితి. ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో భారీగా చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ఒక్కరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిలిచిపోతేనే భరించలేని పరిస్థితి. అలాంటిది నాలుగు రోజులుగా చెత్త కదలకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతుండటంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే అవకాశం లేదు. కార్మికుల సమ్మెతో మిగతా కార్యక్రమాల సంగతిఅటుంచితే... పారిశుద్ధ్యం దారుణంగా దెబ్బతింది. ఇంటింటికీ వెళ్లి దోమల నివారణకు మందు చల్లే కార్మికులు సైతం విధులు బహిష్కరించారు. దీంతో దోమలు మరింతగా విజృంభించే పరిస్థితి నెలకొంది. డంపర్బిన్ల నుంచి చెత్త తొలగించేవారు లేకపోవడంతో వాటి వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సమ్మెలోని యూనియన్లు ఇవీ.... సమ్మెలో పాల్గొన్న యూనియన్లలో సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ, టీఆర్ఎస్ కేవీ, టీఎన్టీయూసీలతోపాటు జీహెచ్ఎంఈయూ ఉన్నాయి. 16 డిమాండ్లతో ఇవి సమ్మె చేస్తున్నాయి. కార్మికుల పక్షమే జీహెచ్ఎంసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. వారి సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీనివ్వాలి. కనీస వేతనాన్ని రూ.16,500కు పెంచాలి. కార్మికులపై ప్రేమ ఉందని చెప్పిన మాటలను అమలు చేయాలి. - యు.గోపాల్ (అధ్యక్షుడు, అధికార పార్టీ అనుబంధ యూనియన్ జీహెచ్ఎంఈయూ) డిమాండ్లు తీర్చాల్సిందే కార్మికుల డిమాండ్లు తీర్చేంత వరకు సమ్మె ఆగదు. అన్ని సర్కిళ్లలో శుక్రవారం అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహిస్తాం. అప్పటికీ పరిష్కరించకుంటే ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడతాం. జీహెచ్ఎంసీ కమిషనర్ మంత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు ఇప్పుడు చెల్లవంటున్నారు. కమిటీ వేయకుండా, పీఆర్ సీ వర్తింపజేయకుండా కాలయాపన చేస్తున్నారు. బెదిరింపులు మంచిది కాదు. - శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీఎంఎస్ సమస్యలు పరిష్కరించాలి వివిధ విభాగాల్లో కార్మికులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సేవలను తల్లి సేవలతో పోల్చిన సీఎం కేసీఆర్.. వారి సమస్యలు పరిష్కరించడంపై శ్రద్ధ చూపడం లేదు. వారికి పీఆర్సీ వర్తింపజేయాలి. ఉస్మానియాలో, వాటర్‌బోర్డులో సైతం ఉద్యోగులు తమ సమస్యల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరి సమస్యలూ తీర్చనందునే ధర్నాలు, ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ఇకనైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. - ఆనంద్ కుమార్ గౌడ్, టీడీపీ అధికార ప్రతినిధి మే 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన స్వచ్ఛ హైదరాబాద్‌లో 6,316 మెట్రిక్ టన్నుల అదనపు చెత్తను తొలగించారు. నిత్యం వెలువడేది కాక అదనంగా ఉన్న దానిని తొలగించడంతో నగరం పరిశుభ్రంగా మారుతుందని అందరూ ఆశించారు.సాధారణ రోజుల్లో జీహెచ్ఎంసీ నుంచి నిత్యం 3,800 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రంజాన్, తదితర పండుగల సమయాల్లో అదనపు చెత్త వెలువడటం రివాజు. ఇలా నాలుగు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా పోగుపడుతోంది. దీంతో దాదాపు 16వేల మెట్రిక్ టన్నులు పేరుకుపోయింది. -
నగరం చెత్త మయం
- కార్మికుల సమ్మెతో పేరుకుపోయిన చెత్త - దుర్గంధంతో ప్రజల ఇక్కట్లు - పొంచి ఉన్న రోగాల ముప్పు సాక్షి, సిటీబ్యూరో: ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త. వీధుల్లో నిండిపోయి దర్శనమిసుతన్న చెత్తకుండీలు. కంపు కొడుతున్న కాలనీలు. ముసురుతున్న ఈగలు.. దోమలు.. వాటి చుట్టూ వీధి కుక్కలు.. ఇదీ నగరంలో పారిశుద్ధ్య పరిస్థితి. రెండో రోజైన మంగళవారం కూడా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె కొనసాగించడంతో నగరం దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన రహదారులపై పరచినట్లుగా చెత్త పేరుకుపోయింది. జీహెచ్ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికులతోపాటు, దోమల నివారణ, తదితర విభాగాల్లోని కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 26 వేల మంది ఉన్నారు. వీరంతా విధులను బహిష్కరించడంతో నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిగా పడకేశాయి. ఏమూల చూసినా చెత్త గుట్టలు గుట్టలుగా పోగైంది. ప్రధాన రహదారుల్లోనూ ఇదే దుస్థితి. గ్రేటర్లో రోజూ దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తారు. అలాంటిది గత రెండు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించడంతో నగరం దుర్గంధభరితంగా మారింది. దీంతో వెక్టర్‌బోర్న్ వ్యాధుల ప్రభావం పొంచి ఉంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని జోన్లు, సర్కిళ్ల పరిధిలోనూ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో పరిస్థితి తీవ్రత కనిపించింది. మంగళవారం జరిగిన చర్చల్లోనూ యూనియన్ల డి మాండ్లు పరిష్కారం కాకపోవ డంతో సమ్మె కొనసాగుతుందని ఆయా కార్మికసంఘాలు స్పష్టం చేశాయి. సమ్మె నిర్వహిస్తున్న యూనియన్లలో సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ, టీఆర్ఎస్ కేవీ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలున్నాయి. సమ్మెలోకి మేం కూడా: జీహెచ్ఎంఈయూ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తుండటంతో బుధవారం నుంచి తాము కూడా సమ్మెలోకి దిగుతున్నట్లు అధికార పార్టీకి అనుబంధ యూనియన్ అయిన టీఆర్ఎస్ కేవీ- జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు. గోపాల్ తెలిపారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, అడిషన్ కమిషనర్(పరిపాలన)లకు సమ్మె నోటీసు అందజేశామన్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామన్నారు. తమ యూనియన్‌లో 14 వేల మంది ఔట్సోర్సింగ్ కార్మికులతోపాటు 4వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారన్నారు. వీరందరూ సమ్మెలో పాల్గొంటారని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : కమిషనర్ సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో రంజాన్, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరుకావాల్సిందిగా కమిషనర్ సోమేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు ప్రయత్నాలు జరుగుతున్నందున వెంటనే విధులకు హాజరు కావాలని కోరారు. మరోవైపు.. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సోమేశ్‌కుమార్ సీనియర్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని స్వచ్ఛ కమిటీలకు సూచిం చారు. జీహెచ్ఎంసీ కార్మికులు విధులకు హాజరుకాని పక్షంలో స్థానికంగా అందుబాటులో ఉండే కార్మికుల సేవలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని సూచించారు. -
కరెంట్ షాక్‌తో ఇద్దరు కార్మికులు మృతి
హైదరాబాద్: నాలా శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన మియాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఓ కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కరెంట్ తీగలు తెగిపడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. (మియాపూర్) -
‘గ్రేటర్’లో సమ్మె దుమారం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్మికులు సోమవారం నుంచి చేపట్టిన సమ్మె తీవ్ర దుమారానికి దారి తీస్తోంది. అధికారులు.. ఉద్యోగులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన తరుణంలో కమిషనర్ చెత్త తరలింపు పనులను రాంకీకి కట్టబెట్టడాన్ని జీహెచ్ఎంఈయూ తప్పు పడుతుండగా.. ఎన్నికల సమయాన్ని ఆసరా చేసుకొని యూనియన్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక ల్లేకుండా చెత్త తరలింపు రవాణాను స్తంభింపచేయడాన్ని కమిషనర్ సోమేశ్‌కుమార్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎన్నికల సమయంలో సమ్మెకు దిగిన యూనియన్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని బుధవారం నుంచి యథావిధిగా విధులకు హాజరుకావాలని సూచించారు. లేనిపక్షంలో తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్మాను ప్రయోగించడమే కాక ఆర్పీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా జీహెచ్ఎంఈయూ గుర్తింపును రద్దు చేయాల్సిందిగా లేబర్ కమిషనర్‌కు లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, తమ డిమాండ్లు సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెను ఉపసంహరించేది లేదని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లోని వారి విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా కేవలం రవాణా విభాగంలోని వారు మాత్రం ప్రస్తుతం సమ్మెలో పాల్గొంటుండగా.. 30వ తేదీన పోలింగ్ అనంతరం జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లోని ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. ఎక్కడి చెత్త అక్కడే... సోమవారం నుంచి సమ్మెలో ఉన్న కార్మికులు చెత్త తరలింపు పనులు చేయకపోవడంతో గ్రేటర్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి పరిస్థితులు తీవ్ర దుర్భరంగా మారాయి. యూనియన్ ఈ సమయంలో సమ్మెకు దిగడం సమంజసం కాదని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన సోమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను ప్రైవేటుకిచ్చేందుకు ఇప్పుడు కొత్తగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సమ్మె కారణంగా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. వార్డుకు ఒక్కో వాహనాన్ని అద్దెకు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పరిస్థితుల దృష్ట్యా కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలన్నారు. వారితో సంప్రదించాల్సిందిగా స్పెషల్ కమిషనర్ రాహుల్‌బొజ్జా, సీనియర్ అధికారులకు సూచించామన్నారు. -
'కార్మికుల వేతనాల పెంపు ప్రభుత్వం దృష్టికి'
హైదరాబాద్ : పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. కార్మికులకు సంబంధించిన మిగతా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని ఆయన శుక్రవారమిక్కడ వెల్లడించారు. ఇంజినీర్ల సామూహిక సెలవుల అంశం పరిష్కారమైనట్లేనని సోమేష్ కుమార్ తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు గత అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.