పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్ : పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. కార్మికులకు సంబంధించిన మిగతా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని ఆయన శుక్రవారమిక్కడ వెల్లడించారు. ఇంజినీర్ల సామూహిక సెలవుల అంశం పరిష్కారమైనట్లేనని సోమేష్ కుమార్ తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు గత అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.