సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తన దగ్గరకు జీహెచ్ఎంసీ అధికారులను పంపకపోవడంపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు విఫలమయ్యారంటూ దుయ్యబట్టారు.
కాగా హైదరాబాద్‌లో వరదల్లో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలను కిషన్ రెడ్డి బుధవారం సందర్శించారు. దోమల గూడలోని అరవింద్, సూరజ్ కాలనీలో పర్యటించి బాదిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.
ముంపు ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటన
ఖైరతాబాద్ ముంపు ప్రాంతాల్లో కేంద్రంమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతితో ఫోన్‌లో మాట్లాడారు. నిత్యావసరాలు,పాలు, ఆహారం పంపిణీ చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కిషన్‌రెడ్డి ముందే బీహెచ్‌ఎంసీ అధికారులను స్థానికులు నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment