హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు సచివాలయంలో కేసీఆర్ను కలసి వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగితే ఎవరూ అడకుండానే జీతాలు పెంచుతామని కేసీఆర్ కార్మికులకు చెప్పారు. జీతాల పెంపు క్రెడిట్ తమకే దక్కాలని కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవపట్టించారని విమర్శించారు. రంజాన్, పుష్కరాలు, బోనాలు జరుగుతున్న సమయంలో సమ్మె చేయడం సమంజసమా? అని కేసీఆర్ కార్మికులను ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లల విద్య కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతామని కేసీఆర్ చెప్పారు.
'జీహెచ్ఎంసీ కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు'
Published Fri, Jul 17 2015 5:39 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
Advertisement
Advertisement