హైదరాబాద్ : ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. శనివార కార్మిక సంఘాల ప్రతినిధులతో మరోసారి కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి జరిపిన చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి.
జీహెచ్ఎంసీ కార్మికుల కనీస వేతనం రూ 10 వేలు ఉండగా, రూ.14 వేలు చేయాలిన కార్మికులు కోరుతుండగా.. రూ.12 వేల మాత్రమే ఇస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో తమ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు కార్మిల సంఘాలు స్పష్టం చేశాయి.