
సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన సూక్ష్మ, మధ్యస్థాయి పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. కేంద్ర వద్ద పెండింగ్ ఉన్న జీఎస్టీ, ఆదాయపన్ను రిఫండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఐటీ పార్కులు, సెజ్‌ల కార్యాలయాలకు ఆరోగ్య మార్గదర్శకాలతో స్టాండర్డ్ హెల్త్ కోడ్ ప్రవేశపెట్టాలన్నారు. పలు కంపెనీల్లో ఉద్యోగుల సాంద్రత కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉందన్నారు. దీన్ని ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులు ఉండేలా నిర్దేశించాలని పేర్కొన్నారు.
(చదవండి : కేంద్ర నిర్ణయంపై తెలంగాణ సర్కార్ అసంతృప్తి)