IT industries
-
అమ్మో ఏపీకా?
సాక్షి, విశాఖపట్నం : పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడదామనుకున్న వారు మరో దారి చూసుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో వెలుగులీనిన విశాఖ నగరం... ఇప్పుడు విలవిల్లాడుతోంది. ఒక్క విశాఖ నగరమే కాదు.. ఆంధ్రప్రదేశ్ వైపు ఐటీ పరిశ్రమలు రావాలంటేనే మొహం చాటేస్తున్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలంటే.. అమ్మో.. ఏపీకా.. అంటూ భయపడుతున్నాయి. నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న ఐటీ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్కుబై బై చెబుతున్నాయి. విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేందుకు సుముఖంగా ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ ఇప్పుడు వెనకడుగు వేసి, చెన్నైకి చెక్కేసింది. ఆరు నెలలుగా విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో కూడా ఆలోచనలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, విధ్వంసాలు, పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు, హింసా వాతావరణంతో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల ప్రతినిధులు, ఇతర పెట్టుబడిదారులు జంకుతున్నారు. ఒక్కసారిగా కుదుపువిభిన్నమైన ఐటీ పాలసీని మెచ్చి.. గత మూడేళ్లుగా దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతూ ముందుకొచ్చాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ వంటి సంస్థలు వరుసగా క్యూ కట్టాయి. దివంగత వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ.. ఆరు నెలల క్రితం కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా.. దిగ్గజ కంపెనీలన్నీ.. ఏపీలో శాఖలు విస్తరించేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ప్రభుత్వం మారిన తర్వాత.. ప్రశాంత వాతావరణం కాస్తా.. అశాంతి వాతావరణంగా మారడంతో అన్ని సంస్థలూ పునరాలోచనలో పడిపోయాయి. ఏపీలో అడుగు పెట్టాలంటేనే ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు భయపడిపోతున్నాయి. ఇందుకు క్యాప్జెమినీనే ఉదాహరణ. అడుగడుగునా దాడులు.. బెదిరింపులు నెల రోజులుగా రాష్ట్రంలో వరుస దాడులు అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార దిగ్గజాలను బెంబేలెత్తిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కాకుండా వ్యాపార సంస్థలపై కూడా వరుస దాడులు జరిగాయి. రైస్ మిల్లులు, ఫ్యాక్టరీలను మూయిస్తున్నారు. నిన్నటికి నిన్న మామూళ్లివ్వలేదని దాల్మియా సిమెంట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ‘మామూళ్లు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి.. మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులను టీడీపీ నాయకులు బెదిరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తామెందుకు డబ్బులివ్వాలని ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులు ప్రశ్నించడంతో ఏకంగా 11 లారీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజూ వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన వందలాది లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటాయి. కొన్ని రోజులుగా ఈ కంపెనీల యజమానులను టీడీపీ నాయకులు మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. వారు పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకుని లారెన్స్ ట్రాన్స్పోర్ట్కు చెందిన 11 లారీల అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. వెంటనే మామూళ్లు ఇవ్వకపోతే మిగతా కంపెనీల లారీలకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ రైస్ మిల్లును మూయించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని యునైటెడ్ బ్రూవరీస్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. ముడి సరుకు తీసుకొస్తున్న లారీలను ఆపేశారు. ఊరూరా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పగులగొడుతున్నారు. ఊళ్లొదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. వ్యాపారాల్లో ఉచిత వాటాలు కోరుతూ.. ఒప్పుకోని వారిపై కక్షగట్టి దాడులు చేస్తున్నారు. మేం ఫలానా వాళ్ల తాలూకా.. మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. మేం లోకేశ్ తాలూకా.. అంటూ బండ్లు, వాహనాలపై పేర్లు రాసుకుని బెదిరింపులకు దిగుతుండటం కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల బండ్ల నంబర్ ప్లేట్లు తీసేసి ఇలా రాసుకుని తిరుగుతూ వ్యాపారులను, ప్రజలను భయపెడుతున్నారు. అందుకే పలు సంస్థలు మరో దారి రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఇప్పటికే ఇక్కడకు రావాలని నిర్ణయించిన పలు సంస్థలు మరో దారి చూసుకుంటున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సాహసమే అవుతుందని ఆలోచిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసే విషయమై.. దేశంలోని ఇతర నగరాలకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. లక్నో, ఇండోర్, జైపూర్, కొచ్చి, నాగ్‌పూర్, చండీగఢ్ తదితర నగరాలవైపు అడుగులు వేస్తున్నాయి. విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో సంస్థ కూడా.. పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విస్తరించేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్రంలో పరిస్థితి వారిని కలవరపెడుతోందని సమాచారం. కొన్నాళ్లు వేచి చూసి.. తదుపరి నిర్ణయం తీసుకోవాలని విప్రో ప్రతినిధులు భావిస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని ఐటీ అనుబంధ సంస్థలు, బీపీవోలు కూడా విశాఖలో శాఖలు ఏర్పాటు చేయాలని భావించినా, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయని ఐటీ రంగ ప్రముఖుడొకరు తెలిపారు. అధికార పార్టీ నేతల తీరు వల్ల ఐటీ రంగం మళ్లీ కునారిల్లే దుస్థితి వచ్చిందని ఐటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.విశాఖ కంటే.. చెన్నై బెటర్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐటీ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులైన సంస్థలు తమ కార్యక లాపాల్ని సాగరనగరిలో విస్తరించేందుకు గతంలో సన్నద్ధమైంది. క్యాప్ జెమినీ సంస్థ కూడా తమ శాఖను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఇతర నగరాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల మధ్య క్యాప్ జెమినీ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ జాబితాలో వైజాగ్‌ని కూడా చేర్చింది. క్యాప్‌జెమినీలో పని చేస్తున్న వారిలో ఇప్పటి వరకు సింహభాగం ఉద్యోగులు విశాఖను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఇన్ఫోసిస్‌లో కూడా ఇదే విధమైన సర్వే చేశారు. ఫిబ్రవరిలో క్యాప్ జెమిని సంస్థ ప్రతినిధులు సైతం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లు క్యాప్‌జెమినీ సంస్థ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే నెల రోజులుగా రాష్ట్రంలో పరిస్థితుల్ని పరిశీలించిన సంస్థ.. చెన్నైలో విస్తరణ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రూ.1,000కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా 2027నాటికి డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సంస్థ గతంలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో అనుకూల వాతావరణం కనిపించి ఉంటే కచ్చితంగా ఈ సంస్థ శాఖ విశాఖలో విస్తరించేది. టీడీపీ, జనసేన నేతల దాడులు, విధ్వంస పర్వంతో రాష్ట్రంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తుండటంతో ఇది సరైన వేదిక కాదని మానసు మార్చుకుని క్యాప్‌జెమినీ సంస్థ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. -
నేచర్‌లో... కాలుష్యానికి దూరంగా..! ఆరోగ్యానికి దగ్గరగా..!!
ఐటీ జాబ్ అంటే వరుస మీటింగ్‌లు, టార్గెట్లతో బిజీబిజీ.. వీకెండ్ వస్తే తప్ప వ్యక్తిగత జీవితానికీ, కుటుంబానికీ టైం ఇవ్వలేని పరిస్థితి. అలా కాకుండా ఉద్యోగమే పచ్చని చెట్ల కింద, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, జీవ వైవిధ్యం మధ్యలో ఉంటే.. ఎంత బాగుంటుందో కదూ! అవును.. అచ్చం అలాంటి వాతావరణాన్నే కోరుకుంటున్నారు నేటి యువ ఐటీ ఉద్యోగులు, ఎంటర్‌ప్రెన్యూర్స్. వీరి అభిరుచికి తగ్గట్టుగానే పలు నిర్మాణ సంస్థలు ‘కలెక్టివ్ ఫామింగ్ గేటెడ్ కమ్యూనిటీ’లకు శ్రీకారం చుట్టాయి. ఈ నయా ట్రెండ్ గురించే ఈ కథనం.. – సాక్షి, సిటీబ్యూరోనగరంలోని గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్ మెంట్లతో జనసాంద్రత పెరిగిపోతుంది. దీంతో రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అత్యాధునిక వసతులున్న లగ్జరీ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్నా సరే నాణ్యమైన జీవితం గగనమైపోతోంది. పచ్చని ప్రకతిలో, స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితి.ప్రస్తుత జనాభా అవసరాలకు వెడల్పాటి రోడ్లు వేసినా.. కొన్నేళ్లకు పెరిగే జనాభా, వాహనాల రద్దీకి అవి ఇరుకుగా మారిపోతున్నాయి. పోనీ, నగరానికి కాస్త దూరంగా విశాలమైన స్థలంలో వీకెండ్ హోమ్ లేదా ఫామ్ హౌస్ సొంతంగా కట్టుకోవాలన్నా, దాన్ని నిరంతరం నిర్వహణ చేయాలన్నా కష్టంతో కూడుకున్న పని. దీనికి పరిష్కారంగా కొందరు డెవలపర్లు ‘కలెక్టివ్ ఫామింగ్ గేటెడ్ కమ్యూనిటీ’ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు.ఇదీ ప్రత్యేకత.. కరోనాతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకే గదిలో గంటల కొద్దీ కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం బోర్ కొట్టేసింది. దీంతో ఉద్యోగస్తులకు అనారోగ్య సమస్యలతో పాటు కంపెనీలకు ఉత్పాదకత తగ్గుతోంది. దీంతో ఇప్పుడు నగరంలో వర్క్ ఫ్రం ఫామ్ కల్చర్ హల్చల్ చేస్తోంది. పచ్చని ప్రకృతిలో నివాసం, అక్కడి నుంచే ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఆధునిక ఏర్పాట్లు ఉండటమే వీటి ప్రత్యేకత. సాధ్యమైనంత వరకూ పచ్చని చెట్లు, జీవ వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ, కొద్దిపాటి స్థలంలోనే నిర్మాణాలుంటాయి. రోడ్డు కనెక్టివిటీ బాగున్న ప్రాంతాలను ఎంచుకొని కాలుష్యానికి దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తున్నారు.70 శాతం ఐటీ ఉద్యోగులే..చేవెళ్ల, షాద్‌నగర్, శామీర్‌పేట, శంషాబాద్, ఘట్కేసర్, హయత్‌నగర్ వంటి నగరం నలువైపులా ఈ తరహా ప్రాజెక్టులను చేపడుతున్నారు. వీటిల్లో గృహాలు 600 గజాల నుంచి 1,800 గజాల మధ్య ఉంటాయి. 70 శాతం మంది ఐటీ ఉద్యోగులే ఉంటున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బహుళ జాతి కంపెనీలకు చెందిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు కస్టమర్లుగా ఉన్నారు.ఇంటర్నెట్, మీటింగ్ రూమ్‌లు..ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థతో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులకు విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు, సౌర విద్యుత్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. బృంద చర్చల కోసం 10–20 మంది కూర్చునేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్, బోర్డ్ రూమ్స్ ఉంటాయి. నేటి యువతరానికి అవసరమైన స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.రచ్చబండలతో సోషల్ బంధం.. వేప, రావి వంటి చెట్లతో పాటు ఆకు కూరలు, కూరగాయలతో పాటు వ్యవసాయం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ల లోపలికి ఓనర్లకైనా సరే వాహనాలకు ప్రవేశం ఉండదు. అత్యవసర వెహికిల్స్‌కు మినహా ప్రధాన ద్వారం వద్దే వాహనాలను పార్కింగ్ చేసి, అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ బగ్గీలో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటూ దారికి ఇరువైపులా కనుచూపుమేర పచ్చని గడ్డితో ల్యాండ్ స్కేపింగ్ ఉంటుంది. చిన్న కొలనులో సందడి చేసే బాతులు, కొంగలు, పిచ్చుకల కిలకిలలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకల సందడితో కనువిందుగా ఉంటుంది. పాత తరహాలో ఇంటి పక్కనే రచ్చబండలుంటాయి. దీంతో ఇరుగుపొరుగు వారితో సోషల్ బంధం పెరుగుతుంది.స్థానికులకు ఉపాధి.. వీకెండ్లో మాత్రమే వచ్చే కస్టమర్ల గృహాలను మిగిలిన రోజుల్లో నిర్వహణ అంతా కమ్యూనిటీయే చూసుకుంటుంది. గార్డెనింగ్, వంట వాళ్లు అందరూ స్థానిక గ్రామస్తులనే నియమించుకోవడంతో వారికీ ఉపాధి కల్పించినట్లవుతుంది.– నగేష్ కుమార్, ఎండీ, ఆర్గానోఈ వాతావరణం బాగుంది..ప్రతిరోజూ ట్రాఫిక్ చిక్కుల్లో నరకం అనుభవిస్తూ ఆఫీసుకు వెళ్లే సరికి అలసిపోయినట్లు అయిపోతోంది. దీంతో ఏకాగ్రత తగ్గిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు వచ్చాక ఆహ్లాదకర వాతావరణంలో పనిచేయడం చాలా బాగుంది. ఉత్పాదకత పెరిగింది.– సీహెచ్ శ్రీనివాస్, ఫార్మా ఉద్యోగిప్రతీది ఇక్కడే అందుబాటులో..శివారు ప్రాంతంలో ప్రాజెక్ట్ అంటే మొదట్లో భయమనిపించినా ఇక్కడికి వచ్చాకే తెలిసింది ప్రతి ఒక్కటీ ఇక్కడే అందుబాటులో ఉంది. సేంద్రీయ ఆహార ఉత్పత్తులతో నిత్యావసరాలు, మినీ థియేటర్ వంటి అన్ని రకాల సదుపాయాలున్నాయి. పైగా స్వచ్ఛమైన గాలి, వెలుతురు, చుట్టూ పచ్చని ప్రకృతితో ఎంతో ఆనందంగా ఉంది.– చిందె స్వాతి, గృహిణి -
విశాఖ, విజయవాడలో ‘నిక్సీ’ కేంద్రాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశేష నగరంగా ప్రధాని ప్రశంసలందుకున్న విశాఖతో పాటు విజయవాడలోనూ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజీ ఆఫ్ ఇండియా (నిక్సీ) నిర్ణయించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం నేపథ్యంలో అంతరాయ సమస్యలను అధిగమించేందుకు ఎక్స్చేంజీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే.. ఇంటర్నెట్ సేవలందించే సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కువగా ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఉన్నాయి. ఇకపై ఈ సమస్య ఉత్పన్నం కాకుండా విశాఖ, విజయవాడ కేంద్రంగా ఇంటర్నెట్ ఎక్స్చేంజీ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. నిక్సీ కేంద్రాలు ఏర్పాటైతే ఇంటర్నెట్ ఎకోసిస్టమ్ వృద్ధి చెంది.. ఐటీ పరిశ్రమలు తమ ఉత్పత్తుల దూకుడు పెంచేందుకు అవకాశాలూ మెరుగుపడనున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, విజయవాడలో యాక్సెంచర్ సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. గతంలోనే పరిశీలన.. వాస్తవానికి విశాఖపట్నంలో నిక్సీ ఏర్పాటుపై గతంలోనే ఒకసారి ప్రయత్నాలు జరిగాయి. 2019 చివరి త్రైమాసికంలో నిక్సీ బృందం పలు దఫాలుగా విశాఖపట్నంలో పర్యటించింది కూడా. నిక్సీ ఢిల్లీ కేంద్రం టెక్నికల్ మేనేజర్ అభిషేక్ గౌతమ్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నిఖిల్ విశాఖలోని ఐటీ పరిశ్రమల్ని ఇప్పటికే రెండు మూడు సార్లు సందర్శించి.. ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటుకు గల అనుకూలతల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే, తదనంతర కాలంలో కోవిడ్ పరిస్థితుల కారణంగా నిక్సీ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న నిక్సీ కేంద్రాల మధ్య కనెక్టివిటీ పెంచడం కోసం పాయింట్ టు పాయింట్ కనెక్టివిటీ కోసం చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే టెండర్లను కూడా నిక్సీ ఆహ్వానించింది. ఈ నెలాఖరులోగా ఈ టెండర్లను ఖరారు చేసి కనెక్టివిటీ పెంచిన తర్వాత కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏమిటీ ఉపయోగం.. రోజురోజుకీ ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోంది. ప్రతి చిన్న రోజువారీ అవసరాలకు ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఇంటర్నెట్లో వేగం పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్స్చేంజీ సేవలు రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి డేటా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని కారణంగా ఆయా సంస్థలకు 40 శాతం అదనపు భారం పడుతోంది. నగర పరిధిలో ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, బ్యాంకులు, రైల్వే బుకింగ్ కేంద్రం, వివిధ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య సంస్థలు.. మొదలైన సంస్థలు బల్క్ కేంద్రాలుగా ఇంటర్నెట్‌ని వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిక్సీ ఏర్పాటైతే.. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. -
విశాఖలో పెరుగుతున్న ఐటీ పరిశ్రమలు
-
చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కుల, మతాలతో తాము రాజకీయం చేయబోమని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, తమకు కులం, మతం పిచ్చి లేదని పరోక్షంగా బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. శాంతియుత వాతావరణంలో అన్నదమ్ముల్లా ఉంటున్న తాము ఇదే ఒరవడి కొనసాగిస్తామని, ఎన్నికల సమయంలో తప్ప రాజకీయాలు మాట్లాడమని పేర్కొన్నారు. 2 పార్టీలకు చెందిన ఒకరిద్దరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాని, చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కోరారు. ఉప్పల్ వైపు కూడా ఐటీ పరిశ్రమలు రావడానికి చేపట్టిన లుక్ ఈస్ట్పాలసీ సత్ఫలితాలిస్తోందన్నారు. -
క్యూ4లో ఐటీ దిగ్గజాల స్పీడ్!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఈ వారంలో క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. సోమవారం(12న) టీసీఎస్, మంగళవారం సమావేశంకానున్న ఇన్ఫోసిస్ బుధవారం(14న) ఫలితాలు వెల్లడించనుండగా, గురువారం(15న) విప్రో చివరి త్రైమాసిక పనితీరును ప్రకటించనుంది. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21) ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇక ఇన్ఫోసిస్ అయితే ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనతోపాటు.. వచ్చే ఏడాది(2021–22)కి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను సైతం ప్రకటించనుంది. కోవిడ్–19 నేపథ్యంలోనూ క్యూ4లో ఐటీ బ్లూచిప్స్ పటిష్ట పనితీరును చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు డిజిటైజేషన్, భారీ డీల్స్, ఆర్డర్ పైప్‌లైన్ తదితరాలు దోహదపడనున్నాయి. బీఎఫ్ఎస్ఐ, రిటైల్, లైఫ్‌సైన్సెస్, తయారీ రంగాల నుంచి డిమాండ్ వీటికి జత కలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి ఐటీ కంపెనీల ఫలితాలు అటు మార్కెట్లకు, ఇటు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లపై మార్కెట్ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయంటే.. వివరాలు చూద్దాం.. టీసీఎస్.. టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ క్యూ4లోనూ ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శించే వీలుంది. ఐటీ పరిశ్రమలో లీడర్‌గా ఆదాయం, మార్జిన్ల విషయంలో మెరుగైన ఫలితాలు సాధించనుంది. ఇందుకు పోస్ట్‌బ్యాంక్, ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్తో కుదుర్చుకున్న భారీ డీల్స్ సహకరించనున్నాయి. ఇటీవల 5–10 కోట్ల డాలర్ల డీల్స్‌ను పెంచుకుంది. క్లౌడ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ విభాగాల నుంచి డిమాండ్‌ను సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 9 శాతం, డాలర్ల రూపేణా 5 శాతం చొప్పున పుంజుకోవచ్చు. అయితే 2021–22కుగాను ప్రత్యేకంగా ఎలాంటి గైడెన్స్నూ ప్రకటించనప్పటికీ రెండంకెల వృద్ధిని ఆశించే వీలుంది. ప్రస్తుత స్థాయిలో లాభాలను కొనసాగించే అవకాశముంది. వాటాదారులకు తుది డివిడెండ్‌ను ప్రకటించడం, తయారీ, కమ్యూనికేషన్స్ విభాగాలపై యాజమాన్య స్పందన వంటి అంశాలను పరిశీలించవలసి ఉంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో టీసీఎస్ షేరు ఇంట్రాడేలో రూ. 3,354ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. 0.25 శాతం లాభంతో రూ. 3,325 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గత కొద్ది త్రైమాసికాలుగా చూపుతున్న వృద్ధి బాటలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ క్యూ4 ఫలితాలు వెలువడే వీలుంది. చివరి త్రైమాసికంలోనూ పటిష్ట పనితీరును చూపవచ్చు. కోవిడ్–19 కారణంగా డిజిటల్ టెక్నాలజీస్, క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావాన్ని చూపనున్నాయి. క్యూ4లో త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 2–5 శాతం మధ్య పుంజుకునే వీలుంది. వార్షిక ప్రాతిపదికన మాత్రం రెండంకెల వృద్ధి సాధించనుంది. ప్రధానంగా వచ్చే ఏడాది(2021–22)కి ఆదాయంలో 13–15 శాతం పెరుగుదలను అంచనా వేయవచ్చు. క్యూ4లో వేతనాల పెంపు కారణంగా మార్జిన్లు త్రైమాసిక ప్రాతిపదికన 0.5 శాతం క్షీణించవచ్చు. కాగా.. 14న ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించనుంది. ఇన్ఫోసిస్ ఇంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 8,260 కోట్లను వెచ్చించింది. వారాంతాన ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు ఇంట్రాడేలో రూ. 1,455ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. నామమాత్ర లాభంతో రూ. 1,441 వద్ద ముగిసింది. విప్రో డైవర్సిఫైడ్ దిగ్గజం విప్రో లిమిటెడ్ ఐటీ సేవల ఆదాయం క్యూ4లో డాలర్ల రూపేణా 4 శాతం స్థాయిలో ఎగసే వీలుంది. త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ 1.5–3.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అంటే 210–214 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆశించింది. కాగా.. క్యూ4లో వేతన పెంపు, యుటిలైజేషన్ తగ్గడం, ట్రావెల్ తదితర వ్యయాలు పెరగడం వంటి కారణాలతో మార్జిన్లు కొంతమేర మందగించవచ్చు. క్యూ3లో త్రైమాసిక ప్రాతిపదికన కన్సాలిడేటెడ్ ఆదాయం దాదాపు 4 శాతం పుంజుకుని రూ. 15,670 కోట్లను తాకింది. నికర లాభం మాత్రం రూ. 20 శాతంపైగా జంప్‌చేసి రూ. 2,968 కోట్లకు చేరింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో విప్రో షేరు 2 శాతం ఎగసి రూ. 451 వద్ద ముగిసింది. తద్వారా ఈ జనవరిలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 467కు చేరువైంది. -
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన సూక్ష్మ, మధ్యస్థాయి పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. కేంద్ర వద్ద పెండింగ్ ఉన్న జీఎస్టీ, ఆదాయపన్ను రిఫండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఐటీ పార్కులు, సెజ్‌ల కార్యాలయాలకు ఆరోగ్య మార్గదర్శకాలతో స్టాండర్డ్ హెల్త్ కోడ్ ప్రవేశపెట్టాలన్నారు. పలు కంపెనీల్లో ఉద్యోగుల సాంద్రత కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉందన్నారు. దీన్ని ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులు ఉండేలా నిర్దేశించాలని పేర్కొన్నారు. (చదవండి : కేంద్ర నిర్ణయంపై తెలంగాణ సర్కార్ అసంతృప్తి) -
సిటీ.. చుట్టూ ఐటీ...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలు మాత్రమే. ఇప్పుడు ఆదిభట్లలోనూ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి మారి నగరం చుట్టూ ఐటీ విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఐటీశాఖ చర్యలు తీసుకుంటోంది. శివారు ప్రాంతాలకు సైతం విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇప్పటికే ఆదిభట్లలో టీసీఎస్ సహా ఇతర ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని.. ఇదే స్ఫూర్తితో శంషాబాద్, మహేశ్వరం ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపాయి. కాగా, ఐటీ ఎగుమతుల విషయంలో జాతీయ సగటు తొమ్మిది శాతంతో పోలిస్తే తెలంగాణ ఐటీ ఎగుమతులు 17 శాతం అధికంగా ఉన్నాయన్నాయి. నూతన ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఉపాధి కల్పనకు ఊతమివ్వడంతోపాటు ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపాయి. ఐటీ ఎగుమతుల్లో దక్షిణాదిలో బెంగళూరు తర్వాత రెండోస్థానంలో గ్రేటర్ హైదరాబాద్ నగరం నిలిచినట్లు పేర్కొన్నాయి. టైర్–2 నగరాల్లోనూ ఐటీకి బాటలు.. గ్రేటర్ శివార్లతోపాటు రాష్ట్రంలోని ఇతర టైర్–2 నగరాల్లోనూ ఐటీ టవర్స్‌ను నిర్మించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లోనూ ఐటీ టవర్స్‌ను నిర్మించి.. వాటిల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియ ఈ ఏడాది చివరిలో ప్రారంభమౌతుందన్నారు. గ్రేటర్లో ఉపాధి ఇలా... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన కంపెనీల్లో 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. టీఎస్ ఐపాస్ రాకతో గత కొన్నేళ్లుగా బుద్వేల్, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సుమారు 30 కంపెనీలు దరఖాస్తు చేశాయన్నారు. కాగా గ్రేటర్ కేంద్రంగా సుమారు 647 ఐటీ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐసీటీ, హార్డ్‌వేర్ పాలసీలతోపాటు ఇమేజ్ పాలసీ, ఇన్నోవేషన్ (స్టార్టప్) పాలసీ, డ్రోన్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీలు ఐటీ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు గతేడాది రూ.1.09 లక్షల కోట్లమేర ఉన్నాయని తెలిపాయి. గత కొన్నేళ్లుగా గ్రేటర్ నుంచి ఐటీ ఎగుమతులు ( రూ. కోట్లలో) -
కావాలనే ఆ నగరాన్ని టీడీపీ అభివృద్ధి చేయలేదు
సాక్షి, అమరావతి: ఐటీ రంగాన్ని తామే అభివృద్ధి చేశామని, ఐటీని కనిపెట్టామని టీడీపీ వాళ్లు చెప్పుకుంటున్నారని, కానీ, గత టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే వైజాగ్ నగరం ఐటీపరంగా ఎంతోకొంత అభివృద్ధి చెంది ఉండేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఐటీ పరిశ్రమల గురించి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఐటీ పరిశ్రమకు తగిన ప్రదేశంగా వైజాగ్ ఉన్నప్పటికీ.. ఆ నగరంలో ఐటీని ఉద్దేశపూర్వంగా అభివృద్ధి చేయలేదని గత ప్రభుత్వం తీరును బుగ్గన తప్పుబట్టారు. వైజాగ్‌ను అభివృద్ధి చేసే ఉద్దేశమే గత ప్రభుత్వానికి లేదన్నారు. తమకు నచ్చినచోట ఐటీ కంపెనీలు పెట్టాలని టీడీపీవాళ్లు కోరారని, కానీ, అక్కడ తగిన వాతావరణం లేకపోవడంతో ఐటీ కంపెనీలు రాలేదన్నారు. ఇక, ఐటీ రంగానికి చంద్రబాబు సర్కారు బడ్జెట్లో చేసిన కేటాయింపులు.. చేసిన ఖర్చు గురించి ఆయన సభలో వివరించారు. 2018-19 సంవత్సరానికి రూ. వెయ్యి ఆరు కోట్లు కేటాయించినప్పటికీ దాదాపు 400 కోట్లు మాత్రమే ఐటీ కోసం ఖర్చు చేశారని, తాము రూ. 453 కోట్లు కేటాయించామని, ఇందులో తక్కువ ఏముందని బుగ్గన ప్రశ్నించారు. ఐటీనీ తామే కనిపెట్టామని, కంప్యూటర్‌నూ, సెల్‌ఫోన్‌నూ తామే కనిపెట్టామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని, అంతేకాకుండా వాళ్ల ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి కూడా చాలా ముఖ్యమైన మనిషి అని పరోక్షంగా నారా లోకేశ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రపంచానికి టెక్నాలజీ నేనే నేర్పించానని చంద్రబాబు ఇదే సభలో గొప్పలు చెప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రకృతితో యుద్ధమని, హుదూద్ మనల్నిచూసి భయపడుతోందని చంద్రబాబు ఆనాడు పేర్కొన్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. 2014-15లో ఐటీ రంగానికి ఇన్సెంటివ్‌గా రూ. 2 కోట్ల 12 లక్షలు కేటాయించి.. ఒక కోటి 12 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని, 2015-16లో రూ. 3.25 కోట్లు కేటాయించి.. కోటి 24 లక్షలు ఖర్చు చేశారని, 2016-17లో రూ. 25 కోట్లు కేటాయించి.. 2.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, 2017-18లో మళ్లీ రూ. 25 కోట్లు కేటాయించి.. రూ. 15.64 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. 2018-19 ఎన్నికల సమయం కావడంతో అన్ని కేటాయింపులు హై లెవల్లో చూపించారని, ఇందులో భాగంగా ఆ సంవత్సరం 450 కోట్లు కేటాయించి దాదాపు 18 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. ఐదు సంవత్సరాలకుగాను ఐటీ పరిశ్రమల ఇన్సెంటివ్ కోసం రూ. 35 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా అమాయకంగా ప్రశ్నలు అడుగుతూ.. నిజాలు తెలుసుకొని బాధపడుతున్నారని చురకలు అంటించారు. ఐటీ పరిశ్రమల కోసం సమగ్ర విధానం: గౌతంరెడ్డి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు, ఐటీ పెట్టుబడులు రాబట్టేందుకు త్వరలో సమగ్రమైన విధానాన్ని తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగినంతగా మౌలిక వసతులు కల్పించలేదని, విధాన నిర్ణయాల్లో సంక్లిష్టతల వల్ల ఐటీ పరిశ్రమలకు అంతగా అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడలేదని ఆయన తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఐటీ పరిశ్రమలు, ఉద్యోగాల విషయమై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. -
భలే మంచి చౌకబేరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అత్యంత విలువైన భూములను విదేశీ ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా కేటాయించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తోంది. భూముల అప్పగింత వ్యవహారంలో ఉన్నతాధికారుల అభ్యంతరాలు, సూచనలను సైతం ప్రభుత్వ పెద్దలు లెక్కచేయడం లేదు. ఐటీ కంపెనీల పేరిట ఇష్టారాజ్యంగా తక్కువ ధరకే విలువైన భూములను పరాధీనం చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు టీడీపీ ప్రభుత్వం 40 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టింది. ప్రధాన కార్యాలయం పదెకరాల్లోనే.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో కేవలం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, మన రాష్ట్రంలో ఆ సంస్థకు 40 ఎకరాలు కేటాయించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ తేల్చిచెప్పింది. తొలుత 10 ఎకరాలు మాత్రమే కేటాయించాలని, ఆ స్థలాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న తర్వాత అవసరమైతే మరికొంత భూమిని కేటాయించవచ్చని సూచించింది. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఇచ్చే భూమి ఎకరా రూ.10 కోట్లకు పైగా పలుకుతోందని, ఆ సంస్థ కోరినట్లు ఎకరా రూ.32.50 లక్షలకే కేటాయించవద్దని స్పష్టం చేసింది. కనీసం ఏపీఐఐసీ నిర్ణయించిన ధర ఎకరా రూ.2.70 కోట్ల చొప్పున అయినా వసూలు చేయాలని కమిటీ పేర్కొంది. ఎకరా రూ.32.50 లక్షలకే.. పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ చేసిన సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పట్టించుకోలేదు. ఫ్రాంక్టిన్ టెంపుల్టన్ కోరినట్లుగానే ఎకరా రూ.32.50 లక్షల చొప్పున మొత్తం 40 ఎకరాలను ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంటే రూ.406 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.13 కోట్లకే విదేశీ సంస్థకు దారాదత్తం చేశారన్నమాట. సదరు భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు తక్షణమే అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ శుక్రవారం జీవో జారీ చేశారు. పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సూచించినట్లు ఏపీఐఐసీ నిర్ణయించిన ధరకైనా భూములను కేటాయించి ఉంటే రూ.108 కోట్లు సర్కారు ఖజానాకు వచ్చేవని అధికారులు చెబుతున్నారు. కంపెనీలు రాకముందే ఔట్ రైట్ సేల్ విశాఖ రూరల్ మండలం మధురవాడలో గతంలో పర్యాటక శాఖకు కేటాయించిన సర్వే నంబర్ 409లో 28.35 ఎకరాలు, సర్వే నంబర్ 381లో 11.65 ఎకరాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు కేటాయించారు. ఇందులో ఆ సంస్థ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తుందని, 2,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రెగ్యులర్ కేటాయింపులతో సంబంధం లేకుండా తక్షణం ఆ 40 ఎకరాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఇచ్చేయాలని జీవోలో స్పష్టం చేశారు. ఔట్ రైట్ సేల్కు ఇచ్చేస్తున్నందున ఆ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదని అధికారులు అంటున్నారు. ఐటీ పరిశ్రమలు రాకముందే ఔట్ రైట్ సేల్ చేయడం సరైంది కాదని పేర్కొంటున్నారు. -
స్థానిక భాషల్లోనే ఐటీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక భాషల్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందిస్తేనే ప్రజలకు గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టంచేశారు. దేశ జనాభాలో 60–70 శాతం మందికి ఇంగ్లిష్ పరిజ్ఞానం లేనందున ఆ భాషలో తయారైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లను ఉపయోగించుకోలేక పోతున్నారన్నారు. మన దేశంలో 22 అధికారిక భాషలున్నాయని, ప్రజలు మాట్లాడే ఈ భాషల్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారమిక్కడ హైటెక్స్‌లో ప్రారంభమైన మూడ్రోజుల ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మాట్లాడారు. సామాన్య ప్రజలకు ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిరర్థకమని కేసీఆర్ తనతో అంటుంటారని, వారికి ప్రయోజనం కలిగించే టెక్నాలజీ వృద్ధికి కృషి చేయాలని ఐటీ రంగ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని లక్ష గృహాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి టీ–ఫైబర్ పథకాన్ని చేపట్టామన్నారు. దీనిద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ–హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. 20 వేల చదరపు అడుగుల స్థలంలో ఈ–హబ్ రెండో విడత భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని, ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ల ఇంక్యుబేటర్‌గా ఇది అవతరించనుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ రంగ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెచ్చిన రూరల్ టెక్నాలజీ పాలసీకి మంచి స్పందన వస్తోందని, ఇప్పటికే రెండో శ్రేణి పట్టణాల్లో పలు ఐటీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్ తొలిసారిగా భారత్‌లో.. అదీ హైదరాబాద్‌లో జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా రెండు దశాబ్దాల కింద హైదరాబాద్ నగరంలో ఐటీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రస్తుతం ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రాంతం. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్ లాంటి ఎన్నో ప్రఖ్యాత కంపెనీలకు ఈ నగరం నిలయం’’అని చెప్పారు. ఐటీ రంగ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందంటూ నగరంలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ కంపెనీలకు పిలుపునిచ్చారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ) చైర్మన్ ఇవాన్ చియూ, ప్రధాన కార్యదర్శి జిమ్ పైసంట్, విప్రో చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ రిషబ్ ప్రేమ్‌జీ, నాస్కామ్ చైర్మన్ రమణ్ రాయ్, అధ్యక్షుడు చంద్రశేఖర్, టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ ప్రసంగించారు. అంతకుముందు ‘ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్’ అనే అంశంపై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన ఐటీ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో హైటెక్స్‌లోని సదస్సు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కృత్రిమ మేధోశక్తితో సవాళ్లు: రవిశంకర్ ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగంలో కీలక శక్తిగా మారిన కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పరిజ్ఞానంతో ప్రయోజనాలతోపాటు దుష్పరిణామాలు సైతం ఎదురు కావొచ్చని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. దీని ద్వారా జరిగే నష్టాలు, నేరాలకు బాధ్యత ఎవరిదన్న అంశంపై ఐటీ రంగం మేధోమథనం జరపాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీ సైతం ప్రధానాంశంగా మారిందన్నారు. దేశంలో ఐటీ రంగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా డిజిటల్ ఇండియా కింద దేశంలోని గ్రామ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భారత్ ప్రపంచంలో అత్యధిక స్టార్టప్ కంపెనీలు కలిగిన మూడో దేశమని చెప్పారు. -
తొలి త్రైమాసికంలో శంకుస్థాపనలు
కొత్త ఐటీ, పరిశ్రమల ప్రాజెక్టులపై కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇమేజ్ టవర్, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం తలపెట్టిన ఎస్ఎంఈ టవర్, టీ–హబ్ రెండో దశ ప్రాజెక్టుల భవన నిర్మాణ పనులకు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పరిశ్ర మలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మీ సేవా కేంద్రాల సేవలను మరింత విస్తరింపజేయాలన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల పనితీరుపై శుక్ర వారం సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలు, ఐటీ శాఖల్లో ఫైళ్లను 48 గంటల్లో పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఏడాదిలో నూతన ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల శాఖ లు పని చేయాలన్నారు. టీఎస్–ఐపాస్ తర హా విప్లవాత్మక విధానం ద్వారా పరిశ్రమల శాఖ గతేడాది గణనీయ పురో గతి సాధించిందన్నారు. తెలంగాణ వస్తే పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వెళ్లిపోతాయన్న ప్రచారాన్ని తిప్పి కొట్టి దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపారని పరిశ్రమల శాఖ ఉద్యోగులను మంత్రి అభినందించారు. కొత్త పరిశ్రమలతో పాటు ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు సహకారం కోసం కొత్త కార్యక్రమాలను రూపొందిచాలని కోరారు. మహిళా, దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, మానవీయ కోణంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఢిల్లీ రెసిండెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. -
సాగునీరిచ్చి రైతుల కన్నీళ్లు తుడుస్తాం
► తెలంగాణలో వెయ్యికోట్లతో గోదాంలు ► ఓపికగా ఉంటే పదవులు వస్తాయి ►నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ►మెట్టప్రాంతం కరువు తొలగిస్తాం ► మంత్రి కేటీఆర్ సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి రైతుల కన్నీళ్లు తుడుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలు గురువారం మంత్రి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారుు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. కరువు పోయే విధంగా గోదావరి, కృష్ణా నదీజలాలను మెట్టప్రాంతాలకు తరలిస్తామని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని వివరించారు. పార్టీలో అంకితభావంతో పని చేసేవారిని ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో వెయ్యి కోట్లతో గోదాములు నిర్మిస్తున్నామని వివరిం చారు. రైతులు పండించిన పంటలు కాపాడుకునేం దుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు వివరిం చారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఏఎంసీ పాల కవర్గంలో రిజర్వేషన్లను తీసుకువచ్చి సామాజికంగా చై ర్మన్ల ఎంపికను చేపట్టినట్లు తెలిపారు. రైతులు వర్షాలకోసం ఎదురుచూడకుండా శాశ్వత పరిష్కారంగా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి సాగునీటి ప్రదాయని అయిన ఎగువమానేరు ఎత్తిపోతల పథకాన్ని 18నెలల కాలంలో పూర్తిచేస్తామన్నారు. రైతులకోసం ప్రభుత్వంపై 17వేల కోట్ల భారం పడినప్పటికీ రుణమాఫీ చేస్తున్నామని, ఇప్పటికే రెండు ద ఫాల రుణమాఫీ పూర్తి కాగా, వారంలో ఇంకో దఫా రు ణమాఫీ ఇస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటీని అమలు చేస్తుందన్నారు. పార్టీలో సైనికుల్లా పనిచేసిన వారిని గుర్తించి నామినేటె డ్ పదవులను అప్పగిస్తున్నామన్నారు. ఏఎంసీ పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండి జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్‌రెడ్డి, కేడీసీసీబీ వైస్ చైర్మన్ ఉచ్చిడి మోహన్‌రెడ్డి, సెస్‌చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని పాల్గొన్నారు. -
'వరంగల్‌లోనే ఐటీ పరిశ్రమల ఏర్పాటు'
వరంగల్: వరంగల్ జిల్లా మడికొండలో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వరంగల్‌లోనే ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమలు త్వరలో రానున్నాయని కేటీఆర్ తెలిపారు. -
అనుమానాలను తొలగించాం: కేటీఆర్
* అదే మా పెద్ద విజయం ‘మీట్ ది ప్రెస్’లో కేటీఆర్ * రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు * ప్రపంచ ఐటీ దిగ్గజాలతో నేరుగా సంబంధాలు * కొన్నేళ్లుగా దుర్భిక్ష పరిస్థితులతోనే రైతు ఆత్మహత్యలు * పరిశ్రమలకు అనుమతుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా కోర్టుకెళ్లవచ్చు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు ఏడాది పాలనలో ఆశించిన మేరకు సఫలీకృతమయ్యామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే నేల విడిచి సాము చేయకుండా, ప్రాధాన్యతలవారీగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేసుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఉండవని, ఐటీ పరిశ్రమలు తరలిపోతాయని తీవ్రంగా వ్యతిరేకించిన మేధావులు సైతం ఇప్పుడు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఏడాది పాలనలో తమ సర్కారు సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని అభిప్రాయపడ్డారు. సోమాజిగూడలోని ‘హైదరాబాద్ ప్రెస్‌క్లబ్’ గురువారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన వివరంగా మాట్లాడారు. ‘ఏడాదిలోనే రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించాం. సీఎం కేసీఆర్ ఇంట్లో, ఆఫీసులో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అనునిత్యం సమీక్షిస్తున్నారు. విద్యుత్ కోతలతో ఖరీఫ్ పంటలు ఎండి రైతు ఆత్మహత్యలు సంభవించడం, రబీలో పంటలు సగానికి తగ్గిపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకోవడం ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామాలు కావు. కొన్నేళ్లుగా దుర్భిక్ష పరిస్థితులే నెలకొన్నాయి. రైతు ఆత్మహత్యలు మాకు బాధ కలిగిస్తున్నాయి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐటీ ఇంక్యుబేటర్‌తో కొత్త కంపెనీలు రాష్ర్టంలో ఐటీ కంపెనీల స్థాపనకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ‘ప్రపంచవ్యాప్తంగా మన ఐటీ నిపుణులకు మంచి పేరుంది. వాట్సప్, గూగుల్, ట్విటర్, ఫేస్బుక్ లాంటి కంపెనీలను మనవాళ్లూ నెలకోల్పేలా ప్రోత్సహించేందుకు 15 రోజుల్లో హైదరాబాద్‌లో ఐటీ ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నాం. గడిచిన మూడు నెలల్లో అమెరికా తదితర దేశాల పర్యటనల్లో 31 మందికిపైగా ఐటీ దిగ్గజాలను కలసి వారితో నేరుగా సంబంధాలేర్పరచుకున్నాం. రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించగలిగాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. హార్డ్‌వేర్ పరిశ్రమలను ఆకర్షించేందుకు వచ్చే వారంలో తైవాన్, హాంకాంగ్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. త్వరలో ప్రకటించనున్న నూతన పారిశ్రామిక విధానంలో మెగా పరిశ్రమలకు 15 రోజుల్లో, ఇతర పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులివ్వనున్నట్లు చెప్పారు. ఒక్కరోజు ఆలస్యమైనా దరఖాస్తుదారులు ప్రభుత్వంపై కోర్టులో దావా వేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏపీ జనానికి జడిసే... హామీలు నెరవేర్చనందుకు ఏపీ జనం తంతారనే ఆ రాష్ర్ట సీఎం చంద్రబాబు మహానాడును తెలంగాణలో పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. కాగా, సీఎం కేసీఆర్ ఇంకా యువకుడే అని, మరో 30 ఏళ్ల దాకా ఆయన రాజకీయాల్లో కొనసాగుతారని, వారసత్వంపై ఇప్పుడే మాట్లాడటం అనవసరమని మంత్రి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వల్లే వందలాది యువకులు చనిపోయారని, ఇదంతా రాయాల్సి వస్తుందనే చరిత్ర పాఠ్యాంశాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేరును ప్రస్తావించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది 2.5 లక్షల ఐటీ కొలువులు
2016లో పరిశ్రమ వృద్ధి 12-14% - హైసియా వార్షిక సమావేశంలో నాస్కామ్ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది(2015-16) భారత సాఫ్ట్వేర్ రంగం 12 నుంచి 14 శాతం వృద్ధిని సాధిస్తుందని, దాదాపు 2.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకంతో దేశీయ సాఫ్ట్వేర్ వినియోగం పెరగనుందని, అయితే దీన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. గురువారమిక్కడ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.9 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు రూ. 6 లక్షల కోట్లు ఎగుమతులదేనని, అయితే దేశీయ మార్కెట్ ఆదాయం రూ.2 లక్షల కోట్లు మించకపోవడం శుభసూచకం కాదని చెప్పారాయన. జీఎస్టీ వంటి సంక్లిష్ట పన్నుల విధానం అమలు చేయాలంటే టెక్నాలజీ ద్వారానే సాధ్యమని తెలియజేశారు. ‘‘దాదాపు అన్ని రంగాలూ డిజిటలైజేషన్‌కు వెళుతున్నాయి. కాబట్టి దీనికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని ఆయన సూచించారు. దేశీయ ఐటీ అభివృద్ధిలో స్టార్టప్ కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వాటి ప్రోత్సాహకానికి నాస్కామ్ పలు చర్యలు చేపట్టిందని తెలియజేశారు. దేశంలో 2010 నుంచి దాదాపు రూ.14 వేల కోట్ల పెట్టుబడులతో దాదాపు 3,100 వరకు స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఇంటర్నెట్ ఆధారిత వస్తువులు (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటిని ప్రోత్సహించేందుకు కేంద్రం, నాస్కామ్ సంయుక్తంగా ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ బలోపేతానికి నాస్కామ్.. ఒకటిరెండు నెలల్లో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. -
చంద్రబాబును కలిసిన అజీజ్ ప్రేమ్‌జీ
-
విప్రో ప్రేమ్‌జీ వినతికి చంద్రబాబు,కెసిఆర్ సానుకూల స్పందన
హైదరాబాద్: విప్రో చైర్మన్ అజీమ్ హషిమ్ ప్రేమ్‌జీ వినతికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావులు సానుకూలంగా స్పందించారు. ఈ రోజు ఆయన ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులతో వేరువేరుగా సమావేశమయ్యారు. తెలంగాణలో ఐటీ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని ప్రేమ్‌జీ చెప్పారు. ఐటి పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక సదుపాయాలతోపాటు స్థలాలు కేటాయించాలని ప్రేమ్‌జీ కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు కెసిఆర్ సుముఖత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ప్రేమ్‌జీ అదే రకమైన విజ్ఞప్తి చేశారు. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా, మెదక్ జిల్లా మాసాయిపేట స్కూల్ బస్ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. -
ఐటీ పరిశ్రమలకు సింగిల్ విండో విధానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పరిశ్రమల స్థాపన కోసం కృషి చేస్తున్నామని ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఐటీ పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని చెప్పారు. వంద రోజుల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని రఘునాథ రెడ్డి తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.