వరంగల్: వరంగల్ జిల్లా మడికొండలో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వరంగల్‌లోనే ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమలు త్వరలో రానున్నాయని కేటీఆర్ తెలిపారు.
'వరంగల్‌లోనే ఐటీ పరిశ్రమల ఏర్పాటు'
Published Fri, Feb 19 2016 4:29 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
Advertisement
Advertisement