సాగునీరిచ్చి రైతుల కన్నీళ్లు తుడుస్తాం
► తెలంగాణలో వెయ్యికోట్లతో గోదాంలు
► ఓపికగా ఉంటే పదవులు వస్తాయి
►నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు
►మెట్టప్రాంతం కరువు తొలగిస్తాం
► మంత్రి కేటీఆర్
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి రైతుల కన్నీళ్లు తుడుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలు గురువారం మంత్రి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారుు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. కరువు పోయే విధంగా గోదావరి, కృష్ణా నదీజలాలను మెట్టప్రాంతాలకు తరలిస్తామని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని వివరించారు. పార్టీలో అంకితభావంతో పని చేసేవారిని ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో వెయ్యి కోట్లతో గోదాములు నిర్మిస్తున్నామని వివరిం చారు. రైతులు పండించిన పంటలు కాపాడుకునేం దుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు వివరిం చారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఏఎంసీ పాల కవర్గంలో రిజర్వేషన్లను తీసుకువచ్చి సామాజికంగా చై ర్మన్ల ఎంపికను చేపట్టినట్లు తెలిపారు.
రైతులు వర్షాలకోసం ఎదురుచూడకుండా శాశ్వత పరిష్కారంగా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి సాగునీటి ప్రదాయని అయిన ఎగువమానేరు ఎత్తిపోతల పథకాన్ని 18నెలల కాలంలో పూర్తిచేస్తామన్నారు. రైతులకోసం ప్రభుత్వంపై 17వేల కోట్ల భారం పడినప్పటికీ రుణమాఫీ చేస్తున్నామని, ఇప్పటికే రెండు ద ఫాల రుణమాఫీ పూర్తి కాగా, వారంలో ఇంకో దఫా రు ణమాఫీ ఇస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటీని అమలు చేస్తుందన్నారు.
పార్టీలో సైనికుల్లా పనిచేసిన వారిని గుర్తించి నామినేటె డ్ పదవులను అప్పగిస్తున్నామన్నారు. ఏఎంసీ పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండి జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీ ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్‌రెడ్డి, కేడీసీసీబీ వైస్ చైర్మన్ ఉచ్చిడి మోహన్‌రెడ్డి, సెస్‌చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని పాల్గొన్నారు.