కేటీఆర్‌ గారు.. నా ముక్కు పచ్చడైంది : వర్మ | Ram Gopal Varma Funny Tweets On KTR Over Liquor Bad Due To Lockdown | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ గారు.. నా ముక్కు పచ్చడైంది : వర్మ

Published Sun, Apr 12 2020 6:57 PM | Last Updated on Sun, Apr 12 2020 7:08 PM

Ram Gopal Varma Funny Tweets On KTR Over Liquor Bad Due To Lockdown - Sakshi

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు. ఆఖరుకు తనపై తాను కూడా పంచ్‌లు వేసుకుంటాడు. తాజాగా ఆయన ట్వీటర్‌ ద్వారా వేసిన ఓ ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఇక ఆ సమాధానంపై కూడా వర్మ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఇంతకీ రామూ వేసిన ప్రశ్న ఏంటి? కేటీఆర్‌  చెప్పిన సమాధానం ఏంటి? ఆ సమాధానంపై ఆర్జీవీ ఇచ్చిన రిప్లై ఏంటో చూద్దాం.
(చదవండి : కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!)

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్‌.. గత శుక్రవారం రాత్రి 8 గంటలకు తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి #ASK (కేటీఆర్‌ను అడగండి) నిర్వహించారు. నెటిజన్లు తనను ట్విటర్ ద్వారా సుదీర్ఘ సమయం పాటు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. #AskKTR లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఓ ప్రశ్న వేశారు. అది మద్యం సరఫరా గురించి. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అక్కడి ప్రభుత్వం మద్యాన్ని డోర్ డెలివరీ చేసేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వర్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ కోరిక కోరారు.
(చదవండి : వైరస్‌ గురించి ముందే ఊహించా

'మీకు నాదో విన్నపం. ఎవరైతే బోర్‌గా ఫీలవుతూ జుట్టు పీక్కుంటున్నారో, చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారో, మెంటల్ ఆస్పత్రుల్లో చేరుతున్నారో, ఫ్రస్టేషన్‌తో భార్యలను కొడుతున్నారో వీరి కోసం మమతా బెనర్జీ లాంటి పెద్ద మనస్సు ఉండాలి. అలాంటి పద్ధతినే ఇక్కడ కూడా ప్రవేశపెట్టండి' అని వర్మ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందిస్తూ..‘రామూ గారూ.. హెయిర్‌ కట్‌ గురించే అడుగుతున్నారు కదా' అంటూ చమత్కరించారు. కాగా, కేటీఆర్‌ రిప్లైపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. ’కేటీఆర్‌ సర్‌.. నేను మీరు ఇచ్చిన రిప్లైను గుర్తించలేదు. మీలో ఉన్న హాస్య చతురత నాకు చాలా ఇష్టం. మీరు వేసిన పంచ్‌కు నా ముక్కు పచ్చడైపోయింది. ప్రస్తుతం  మీ ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిది’అంటూ ట్వీట్‌ చేశారు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement